Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఒకే ‘క్లౌడ్‌’ను నమ్ముకుంటే ఇంతే..
ADVERTISEMENT 

ఒకే ‘క్లౌడ్‌’ను నమ్ముకుంటే ఇంతే..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 21, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
CLOUD1.jpg

ప్రపంచానికి గుణపాఠం నేర్పిన మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ క్లౌడ్‌ ఔటేజ్‌ 

ఖర్చుల నియంత్రణకు క్లౌడ్‌ సర్విసులపై ఆధారపడుతున్న ఐటీ సంస్థలు 

అజూర్‌ క్లౌడ్‌ సర్విస్‌లో అప్‌డేట్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన పలు సేవలు.. ఇప్పుడు ఇతర క్లౌడ్‌ సర్విసులపై కంపెనీల దృష్టి 

మ్యాక్, లీనక్స్‌ వంటి సేవలపైనా దృష్టి పెట్టాలంటున్న నిపుణులు

సాక్షి, అమరావతి: ఒక్క ‘క్లౌడ్‌’నే నమ్ముకొంటే ఇంతే.. మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ క్లౌడ్‌ ప్రపంచానికి నేర్పిన గుణపాఠమిది.  ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లౌడ్‌ సర్వీసులు ఉన్నప్పటికీ, మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ పైనే ఆధారపడిన సంస్థలన్నీ ఇప్పడు చిక్కుల్లో పడ్డాయి. ఐటీ, ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఖర్చుల నియంత్రణ కోసం క్లౌడ్‌ సర్వీసులపై ఆధారపడుతుంటే ఇప్పుడు వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతోంది.

తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన క్లౌడ్‌ సర్వీసెస్‌ ‘అజూర్‌’ సంక్షోభంతో ఐటీ కంపెనీలు వాటి విధానంపై పునరాలోచనలో పడ్డాయి. అజూర్‌ సైబర్‌ సెక్యూరిటీలో ఒక అప్‌డేట్‌ సందర్భంగా తలెత్తిన సమస్యతో ప్రపంచవ్యాప్తంగా విమాన, బ్యాంకింగ్, స్టాక్‌ ఎక్సే్ఛంజ్, వైద్యం వంటి పలు రంగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఐటీ కంపెనీలు దీనిపైనే దృష్టి పెట్టాయి. డేటా బ్యాకప్‌ కోసం క్లౌడ్‌ సర్వీసులపై ఆధారపడితే వాటిల్లో అజూర్‌ లాగా సమస్య తలెత్తితే సాధారణ సేవలకు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగించే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారిస్తున్నాయి.

ఒక క్లౌడ్‌పైనే ఆధారపడొద్దు
ఐటీ కంపెనీలు డేటా బ్యాకప్‌ కోసం కేవలం ఒక క్లౌడ్‌ సర్వీసుపైనే ఆధారపడకుండా అత్యవసర సమయాల కోసం మరో క్లౌడ్‌ సర్వీసు కూడా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ కాకుండా పదికి పైగా ప్రముఖ క్లౌడ్‌ సర్వీసు సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వెబ్‌ సర్వీసెస్, గూగుల్‌ క్లౌడ్‌ ఫ్లాట్‌ఫాంలతో పాటు ఐబీఎం, ఒరాకిల్, ఆలీబాబా, డిజిటల్‌ ఓషన్, వీఎంవేర్, రెడ్‌హాట్‌ వంటి అనేక క్లౌడ్‌ సర్వీసులు ఉన్నాయి.

తాజాగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా అత్యంత చౌకగా క్లౌడ్‌ సర్వీసులు అందించే కోర్‌­వేవ్‌ వంటి సంస్థలు కూడా మార్కెట్లోకి వస్తు­న్నాయి. ఇదే సమయంలో ఐటీ సంస్థలు కేవలం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వంటి ఒక ఐటీ వెండర్‌పైనే ఆధారపడకుండా ఇతర ఆప­రేటింగ్‌ సిస్టమ్స్‌పైనా సేవలంగించడానికి సిద్ధంగా ఉండాలని ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ప్రొఫెసర్‌ ఓకు ఇస్క్‌ చెబుతున్నారు.

మైక్రోసాఫ్ట్‌­తో పాటు మ్యాక్, లీనక్స్‌ వంటి ఐటీ వెండర్స్‌నూ వినియోగించుకో­వా­లని సూచిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణబమైన మైక్రోసాఫ్ట్‌కు సైబర్‌ సెక్యూ­రిటీ అందిస్తున్న క్రౌడ్‌స్ట్రైక్‌ చేసిన ప్రకటన దీనికి ఊతమి­స్తోంది. సెబర్‌ సెక్యూరిటీ­లో అప్‌గ్రెడేషన్‌ సంద­ర్భంగా తలెత్తిన సంక్షోభం కేవలం విండోస్‌కే పరి­మితమైందని ఆ ప్రకటన తెలిపింది. మ్యాక్, లీనక్స్‌ వంటి వాటిపై ఈ ప్రభావం లేదని క్రౌడ్‌­స్ట్రైక్‌ పేర్కొంది. అందువల్ల ఐటీ, ఇతర సంస్థలు ప్రత్యామ్నాయాల­నూ అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

తప్పించుకున్న రష్యా
మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌  అప్‌­గ్రెడేష­న్‌­లో తలెత్తిన సమస్యలతో ప్రపంచవ్యా­ప్తాంగా అనేక దేశాల్లో పలు సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. రష్యాలో మాత్రం ఆ ప్రభా­వం ఎక్కడా కనిపించలేదు. దీనికి ప్రధా­న కారణం ఇతర దేశాలపై రష్యా దాడులు. ఈ యుద్ధం కారణంగా అమె­రికాకు చెందిన పలు సంస్థలు రష్యాకు తమ ఉత్పత్తుల విక్రయా­లపై  నిషేధం విధించాయి. అం­దుకే మైక్రో­సాఫ్ట్‌ సంస్థ కొన్ని సంవత్సరాలు రష్యాకు ఎటు­వంటి సహకారం అందించలేదు.

ఈ సంక్షోభా­నికి కారణమైన అమెరికాకు చెందిన క్రౌడ్‌ స్ట్రైక్‌ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ ఇంత వరకు రష్యాలో అడుగే పెట్టలేదు. దీంతో రష్యా సొంత సాఫ్ట్‌వేర్‌ పైనే ఆధారపడు­తోంది. కాస్పర్‌­స్క్రై వంటి స్వదేశానికి చెందిన సెబర్‌ సెక్యూ­రిటీ సేవలనే వినియోగించుకుంటోంది. మైక్రోసాఫ్ట్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రెడేషన్‌తో తలెత్తిన సంక్షోభం తమ దేశంలో ఎక్కడా కనిపించలేదని రష్యా ప్రకటించింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Microsoft
software company
Cloud
services
IT & Infotech
Artificial Intelligence (AI)
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

ఇప్పుడంతా AI.. మరి రేపు ఏంటి?

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.