Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. చిత్తూరు జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య
ADVERTISEMENT 

చిత్తూరు జిల్లాలో విపరీతంగా పెరుగుతున్న మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 16, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
stress.jpg

చిత్తూరు నగరానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి ఒకప్పుడు ధనవంతుడు. కార్లల్లో షికారు చేసినవాడు. ఎప్పుడూ అతని చుట్టూ 10 మంది ఉండేవారు. అలా దర్జాగా బతికిన ఆ వ్యక్తి చివరకు అప్పుల పాలయ్యాడు. ఆర్థిక కష్టాలను అధిగమించలేక.. మత్తుకు బానిసయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. కుటుంబసభ్యులు వైద్యం చేయించినా నయం కాకపోవడంతో చివరకు ప్రాణాలు కోల్పోయాడు.  

చిత్తూరు జిల్లా  బంగారుపాళెం మండలానికి చెందిన 30 ఏళ్ల యువకుడు మద్యానికి బానిసయ్యాడు. తాగి తాగి మతిపోగొట్టుకున్నాడు. ప్రవర్తనలో మార్పులు చూసిన 
కుటుంబసభ్యులు ఆ యువకుడిని చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. మూడు నెలలుగా చికిత్స తీసుకుంటున్నాడు. క్రమం తప్పకుండా మందులు, మాత్రలు వాడుతున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి నిలకడగా ఉంటూ సొంత పనులు చేసుకుంటున్నాడని, మళ్లీ మద్యం జోలికెళితే, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు చెబుతున్నారు.

కాణిపాకం: ఆధునిక సమాజంలో మనిషి జీవితం ఉరుకులు పరుగులతో సాగుతోంది. ఉదయం నిద్రలేస్తే ఇంటి సరుకుల నుంచి ఈఎంఐలు, బ్యాంకు అప్పులు, డ్వాక్రా చీటీలు, వ్యాపారాలు, పిల్లల చదువులతో సతమతమవుతున్నారు. లక్ష్యాన్ని అందుకోవాలనే తపనతో విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, వ్యాపారులు ఇలా అందరూ మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు మత్తుకు బానిసవుతూ మానసిక రుగ్మతలకు గురవుతున్నారు.

చిత్తూరు జిల్లాలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతి వంద మందిలో 20 నుంచి 25 శాతం మంది మానసిక రుగ్మతల బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. యువకుల నుంచి పెద్దల వరకు ఒత్తిళ్లకు గురై మానసిక జబ్బును కొని తెచ్చుకుంటున్నారని గుర్తించారు. మరోవైపు మద్యంతో చిత్తవుతున్నారని వెల్లడిస్తున్నారు. ఇక ఆర్థిక కష్టాలు, ప్రేమ, పెళ్లిలు, ఇతరత్రా సమస్యలతో కూడా మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. ఈక్రమంలో చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి ప్రతిరోజూ 40 నుంచి 50 ఓపీలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.  ఆర్థిక కష్టాలు చిదిమేస్తున్నాయి  

ఆర్థిక భారం తట్టుకోలేక అనేక మంది మానసికంగా పూర్తిగా కుంగిపోతున్నారు. వ్యవసాయం నుంచి వ్యాపారం వరకు, ఉద్యోగాల నుంచి పెట్టుబడుల వరకు ఎక్కడ చూసినా అనిశి్చతి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో పడిపోయిన వ్యక్తి మౌనంగా లోలోపలే ఆత్మహత్యే మార్గంగా ఎంచుకుంటున్నారు. ఇక ఉద్యోగాల్లో టార్గెట్లు, ఒత్తిడి, భద్రత లేమి మనుషులను యంత్రాల్లా మార్చేసింది. నిద్రలేని రాత్రులు, ఆందోళనతో గడిచే రోజులుం చివరకు డిప్రెషన్‌. కానీ మానసిక జబ్బు అన్న మాట బయటకు చెప్పడానికి చాలామంది భయపడుతున్నారు. 

ఆత్మహత్యలు... చివరి ఫలితం 
ఈ కారణాల ఫలితం ఒక్కటే ఆత్మహత్యలు. మానసిక జబ్బు చివరకు ప్రాణాంతక నిర్ణయానికి నెడుతోంది. ఇటీవల హైదరాబాద్‌తోపాటు పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇవి కేవలం సంఖ్యలు కాదు.. చెదిరిపోయిన కుటుంబాల కథలు.

 తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు  అనేక రుగ్మతలకు గురవుతున్నారు. నిద్రలేమి సమస్యలు మనిíÙని తీవ్రంగా వేధిస్తున్నాయి. ముఖ్యంగా యువకులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మద్యానికి బానిసవుతున్నారు. సెల్‌ఫోన్‌ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది . ఆర్థికంగా రాణించకపోవడం వంటి సమస్యలు మానసిక సమస్యలను తీవ్రతరం చేస్తున్నాయి. ఇవి మనిషిని చంపేసేంతగా పనిచేస్తున్నాయి. ఇటీవల కొన్ని ఘటనలను ఆధారంగా తీసుకుని ప్రజలు మేల్కొవాలి. మానసిక సమస్యలుంటే.. వెంటనే డాక్టర్లను కలిసి చికిత్స తీసుకోండి.  
– దినేష్, మానసిక వైద్య నిపుణులు,

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Health
Mental stress
chittoor
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

కొన్ని తలనొప్పులను.. సీరియస్‌గా తీసుకోవాల్సిందే! లేదంటే..

‘ఆ డబ్బులతోనే నలుగురి అంత్యక్రియలు చేయండి’

‘ఆ డబ్బులతోనే నలుగురి అంత్యక్రియలు చేయండి’

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

పండుపై అంకె.. ఆరోగ్యానికి లంకె..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

వైరస్‌ పుట్టకముందే అంత్యక్రియలు! ఏఐ వ్యాక్సిన్‌ ప్రయోగం..

ఉదయ రాగం.. నాన్న యోగం!

ఉదయ రాగం.. నాన్న యోగం!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.