Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కనుమరుగై కాదు.. కంటిపాపగా ఉందాం!
ADVERTISEMENT 

కనుమరుగై కాదు.. కంటిపాపగా ఉందాం!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 27, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
handds.jpg

మనసులు విరిగితే మాటలు కలపాలి 

కోపాలు పెరిగితే కాస్తంత సమయం ఆగాలి

రాయవరం: రెండు మనసులు.. మూడు ముళ్లు.. ఏడడుగులతో ఆరంభమయ్యే దాంపత్య జీవితం కలకాలం పచ్చగా ఉండాలనే అందరూ ఆకాంక్షిస్తారు. పరిస్థితుల ప్రభావం, మనస్పర్థలు వంటివి ఆ పచ్చని సంసారాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. కొన్ని సందర్భాలలో క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతూ సూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. తమపై ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఏమైపోతారో అనే ఆలోచించకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. 

ఇటీవల ఇటువంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. భర్తను భార్యో, భార్య భర్తనో చంపడమో లేదా చంపించడమో జరుగుతున్నాయి. మనిషి నైతిక విలువలను మరచి దిగజారిపోతున్నాడు. అలా కాకుండా సమస్యను సానుకూలంగా ఆలోచించి నా మనిషేకదా అనుకుంటే సగం పరిష్కారం అయినట్టే. ఆ తరువాత మనసులు నెమ్మదించి మాటలు కలిసి చిలక పలుకులతో చర్చించుకుంటే మళ్లీ ఆ పాత రోజులు నిత్య నూతనాలవుతాయి.  

అనుమానం పెనుభూతమై  
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం  రంగాపురంలో ఒకడు తన భార్యను ఈ నెల 19న హత్య చేశాడు. దీంతో వారి చిన్నారులు తల్లిలేని వారయ్యారు. అలాగే ఈ నెల 17న ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో మరొకడు అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో దాడి చేశాడు.  

సమస్యలు ఎదురైనప్పుడు వీరిని సంప్రదించవచ్చు 
గృహ హింస నిరోధక చట్టం (2006): మహిళలను శారీరకంగా హింసించడం, గాయపర్చడం, ప్రాణా లకు హాని తలపెట్టడం, మాటలతో మానసికంగా ఒత్తిడి పెంచడం తదితర ఇబ్బందులకు గురి చేస్తే గృహ హింస అవుతుంది. ఇలాంటి సమయంలో బాధిత మహిళ నేరుగా మేజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఉచితంగా న్యాయసేవలు : కుటుంబాల్లో గొడవలు, వివాదాలను పరిష్కరించుకునేందుకు ఉచిత న్యాయ సేవలు పొందవచ్చు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయ సేవలు పొందే అవకాశం    కల్పిస్తున్నారు.  

వన్‌స్టాప్‌ సెంటర్‌ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల కోసం కాకినాడ, అమలాపురంలో వన్‌స్టాప్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ భార్యభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తారు. గృహ హింసకు పాల్పడితే శిక్షలు, చట్టాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. బాధిత మహిళలకు తాత్కాలికంగా షెల్టర్‌ ఇస్తారు. 

గొడవలకు కారణాలివీ..   
» పని ఒత్తిడిలో భాగస్వామితో సమయం కేటాయించకపోవడం. తమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతో మొదలైన గొడవలు దంపతుల మధ్య అగాధాన్ని సృష్టిస్తున్నాయి. 
» ఎవరికి వారే గొప్ప అనుకునే స్వభావం. చిన్న సమస్యలకు కూడా ఒకరిపై ఒకరు కోపాలు పెంచుకోవడం.  
 ఆర్థిక పరిస్థితులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వ్యాపారాల్లో నష్టాలు, అనుకోని ఘటనలతో అప్పుల పాలవడం, వాటిని తీర్చే మార్గంలేక ఇంట్లో వారిపై కోపం చూపడం. 
» సామాజిక మాధ్యమాలు, ఇతర పరిచయాలు వివాహేతర సంబంధాలకు దారితీయడం. 
» ఇంట్లో కుటుంబ కలహాలు.. తల్లిదండ్రులు, అత్తామామలను సరిగా చూసుకోక పోవడం. 
» సెల్‌ఫోన్‌లో మాట్లాడినా, ఇతరులతో మాట్లాడుతున్నా భార్య లేదా భర్తపై అనుమానాలు పెంచుకోవడం. 
»ఇద్దరి మధ్య సమన్వయం లేక పోవడం.  

పరిష్కారాలు ఇలా  
» సమస్య ఎదురైనపుడు సమన్వయం అవసరం. కోపాలు తగ్గించుకోవాలి. గొడవ సద్దుమణిగేలా ఎవరూ తగ్గకపోవడం..  
» ఒకరినొకరిపై ప్రేమభావం కలిగేలా బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం.. ఇద్దరం స­మా­నమనే భావన కలిగి ఉండాలి. 
 ఆదాయ, ఖర్చులు ఇద్దరికి తెలిసే ఉండాలే చూసుకోవాలి. 
» జీవిత భాగస్వామి ప్రవర్తనకు తగినట్లుగా నడుచుకుంటూ.. ఒకరినొకరు అర్ధం చేసుకోవాలి.. వేర్వేరు కాదు.. ఒకటే అనే భావన ఇద్దరిలో కలగాలి. 
» పిల్లలతో విహార యాత్రకు వెళ్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడిని చూరం చేసుకోవచ్చు.

వన్‌స్టాప్‌ సెంటర్‌ నంబరు : 181       
పోలీస్‌ హెల్ప్‌లైన్‌ : 112

బాధితులు ముందుకు రావాలి  
క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు కుటుంబాలపై ప్రభావం చూపుతున్నాయి. దంపతుల కలహాలు, గృహహింస తదితర బాధితులు ముందుకు వచ్చి, పోలీసుస్టేషన్లను సంప్రదించాలి. కుటుంబ సమస్యలతో వచ్చిన భార్యాభర్తలకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. సమస్య పరిష్కారం కాకుంటే కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నాం.  –  డి.సురేష్‌బాబు, ఎస్సై, రాయవరం   

సానుకూల దృక్పథం అవసరం 
జీవన విధానంలో మార్పులు వచ్చాయి. సమస్య చిన్నదే అయినా వ్యతిరేక ఆలోచనలతో ఉంటున్నారు. పరిష్కార మార్గాల వైపు కాకుండా సహనం కోల్పోయి విచక్షణా రహితంగా ప్రవర్తిస్తున్నారు. పాజిటివ్‌ థింకింగ్‌ అలవర్చుకోవాలి. ఇంటికి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులతో అధిక సమయం గడపాలి.   – డాక్టర్‌ సౌమ్య పసుపులేటి, సైకియాట్రిస్ట్, ఏరియా ఆస్పత్రి, అమలాపురం   

ప్రశాంతంగా ఆలోచించాలి  
సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. నేర సంబంధ ఘటనలను పదేపదే చూడటం మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మద్యానికి బానిసైన వారిలో మానసిక స్థితి లోపించి భార్యలపై అనుమానాలు వ్యక్తమవుతాయి. ఇదే గొడవలకు, అనర్ధాలకు దారి తీస్తాయి.   – డాక్టర్‌ అఖిలేంద్ర శ్రీనివాస్, సైకియాట్రిస్ట్, డిస్ట్రిక్ట్ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్, రాజమహేంద్రవరం

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Mindset
problem
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

‘దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ మత్స్యకారుల మీద లేదు’

‘దోచుకోవడం మీద ఉన్న శ్రద్ధ మత్స్యకారుల మీద లేదు’

 ‘కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది’

‘కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ కుప్పకూలింది’

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.