ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు
ఏపీ డీఎస్సీ–2025లో నష్టపోయిన లక్షలాదిమంది అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ మరోమారు సమరభేరి మోగించింది. నష్టపోయిన బాధితులకు ఆకాంక్షలకు అనుగుణంగా డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తుతో పాటు, మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా డిమాండ్‌తో మంగళవారం వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.
కర్నూలులో భారీ నిరసన ర్యాలీ
- కర్నూలులో యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
- డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ ఎంక్వయిరీ చేయాలని డిమాండ్ చేసిన విద్యార్థులు, యువత
- నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బుట్టా ప్రతుల్, రాష్ట్ర అధికార ప్రతినిధి బీవై రామయ్య, సిటీ ప్రెసిడెంట్ సిటీ ప్రెసిడెంట్ అహ్మద్ అలీ ఖాన్, తదితరులు
నెల్లూరులో డీఎస్సీ నిరసనకు తరలివచ్చిన యువత
- నెల్లూరు వైసీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి,ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన
- నెల్లూరులో dsc కి వ్యతిరేకం గా జరిగిన నిరసన ర్యాలీ కి భారీ స్పందన
- వేలాదిగా విద్యార్థులు రావడంతో కిక్కిరిసిన వీఆర్సీ సెంటర్
- డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- CBI విచారణ జరపాలని కోరుతూ ఆందోళన
- నిరుద్యోగ భృతి,ఫీ రీయంబర్స్మెంట్ హామీలు నెరవేర్చాలని డిమాండ్
- కూటమి ప్రభుత్వం విద్యార్థులను వంచించింది:కాకాణి గోవర్ధన్ రెడ్డి
- విద్యార్థులకిచ్చిన హామీ నెరవేర్చలేదు.
- లోకేష్‌పై మండిపడ్డ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
- డీఎస్సీ పేరుతూ లోకేష్ టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నారు.
- ఎలాంటి అర్హత లేని వారికి టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారు
- విద్యావ్యవస్థ విలువలను లోకేష్ దిగజార్చారు.
ఒంగోలులో నిరసన ర్యాలీ
- డీఎస్సీలో అక్రమాలు నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వైస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
- లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు వైస్సార్సీపీ యూత్, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన
- కొద్దిసేపు చర్చ్ సెంటర్లో ఆందోళన
- ర్యాలీలో పాల్గొన్న ఒంగోలు వైస్సార్సీపీ ఇంచార్జ్ చుండూరి రవిబాబు, పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, పార్టీ యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్నాటి రవీంద్ర రెడ్డి
పార్వతీపురం మన్యం జిల్లాలో ర్యాలీ
- డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలంటూ పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ
- ఈ ర్యాలీలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి, పార్టీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు, ఎమ్మెల్సీ విక్రాంత్, పార్వతీపురం మాజీ శాసనసభ్యులు జోగారావు, యువజన నాయకులు
అన్నమయ్య జిల్లాలో కదం తొక్కిన వైఎస్సార్సీపీ
- అన్నమయ్య జిల్లాలో కదం తొక్కిన విద్యార్థి లోకం
- డిఎస్సీ లో జరిగిన అవకతవకలపై నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్
- సీబీఐ దర్యాప్తు జరపాలని వైఎస్సార్సీపీ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్
కాకినాడలో వైఎస్సార్సీపీ పోరు బాట
- మెయిన్ రోడ్డు నుండి బాలాజీ చెరువు సెంట్రర్ వరకు భారీ ర్యాలీ
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి నిధులు విడుదల చేయాలని డిమాండ్
- హాజరైన యువజన విభాగం నాయకులు తోట రాంజీ, రాగిరెడ్డి బన్నీ, గౌతమ్, చంద్రకళా దీప్తీ
రాజమండ్రిలో పోలీసుల అత్యుత్సాహం..
- తూర్పుగోదావరి: రాజమండ్రిలో మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ ఆందోళన
- డీఎస్సీ స్కాంకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్
- వైఎస్సార్సీపీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
- పోలీసులను దాటుకుని ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులు
మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
- కృష్ణా జిల్లా: డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరిపించాలంటూ మచిలీపట్నంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
- లక్ష్మీటాకీస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీ
- ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, యువత,
- మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, వైఎస్సార్సీపీ సింహాద్రి వికాస్, ఉప్పాల రాము
- జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, దేవభక్తుని చక్రవర్తి
అనంతపురంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
- డీఎస్సీ అక్రమాలపై ఉద్యమాన్ని ఉధృతం చేసిన వైఎస్సార్సీపీ
- అనంతపురం నగరంలో భారీ ర్యాలీ చేపట్టిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగం నేతలు
- అనంతపురం జీజీహెచ్ నుంచి సప్తగిరి సర్కిల్ దాకా భారీ నిరసన ప్రదర్శన
- సప్తగిరి సర్కిల్ లో భారీ మానవహారం
- ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
- ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ విద్యార్థుల నినాదాలు
- పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి
అనకాపల్లిలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
-
డీఎస్సీలో అక్రమాలకు బాధ్యతగా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ
-
ర్యాలీలో భారీగా పాల్గొన్న విద్యార్థులు, యువత
-
పెరుగు బజారు వైఎస్సార్ విగ్రహం వరకూ ర్యాలీ
-
ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉమా శంకర్ గణేష్, అదీప్ రాజ్..
-
కంబాల జోగులు, బొడ్డేడ ప్రసాద్, ఈర్ల అనురాధ, పుల్లేటి వెంకటేష్, హేమంత్
వైఎస్సార్ జిల్లా: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ
- డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువత
- జిల్లా పార్టీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు భారీ ర్యాలీ
- పెద్ద ఎత్తున పాల్గొన్న యువత
- డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- యువతకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్న రవీంద్రనాథ్ రెడ్డి, అంజాద్ బాషా, ఎమ్మెల్యే దాసరి సుధా..
- సీఈసీ సభ్యుడు సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్
విజయవాడలో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ
-
వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాలు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
-
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు, నీట్ లీకేజీ, ఫీజు రీయింబర్స్ మెంట్ విధానం, నిరుద్యోగ భృతిపై ఆందోళన
-
సాంబమూర్తి నగర్ నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ
-
డీఎస్సీ అక్రమాలపై నైతిక భాద్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
-
నిరసనలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
-
మొండితోక జగన్మోహన్ రావు, జగ్గయ్యపేట పేట నియోజకవర్గ ఇంచార్జి తన్నేరు నాగేశ్వరావు
-
స్వామి దాస్, ఎమ్మెల్సీ రూహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర
ఏపీలో పలు చోట్ల పోలీసుల ఓవర్ యాక్షన్
- నిరసనల నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు
- పలు చోట్ల వైఎస్సార్సీపీ నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీస్స్టేషన్లకు తరలింపు
- దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం
- అన్ని జిల్లా కేంద్రాల్లో కొనసాగుతున్న భారీ ర్యాలీలు, ఆందోళనలు
- మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని డిమాండ్
నెల్లూరులో వైఎస్సార్సీపీ భారీ నిరసన ర్యాలీ
- నెల్లూరులో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాలు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
- డీఎస్సీ నియామకాలలో అక్రమాలు, నీట్ లీకేజీ, ఫీజు రీయింబర్స్మెంట్ విధానం, నిరుద్యోగ భృతిపై ఆందోళన
- అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించి.. గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ
- డీఎస్సీ అక్రమాలపై నైతిక భాద్యత వహించి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, నేదురుమల్లి, ఆనం విజయ్‌కుమార్
తిరుపతిలో వైఎస్సార్సీపీ నిరసన
- డీఎస్సీ స్కాం బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
- ఎస్వీ యూనివర్సిటీ సెకండ్ గేట్ వద్ద వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
- నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి ఆర్కే రోజా
- పాల్గొన్న వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, విద్యార్థులు
- మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి: ఆర్కే రోజా మాజీ
- స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు పై విచారణ జరిపించాలి
- మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ నినాదాలు
విశాఖలో వైఎస్సార్సీపీ నిరసన
- డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి అంశాలపై వైఎస్సార్సీపీ నిరసన
- జీవీఎంసీ గాంధీ విగ్రహం ఆందోళన చేపట్టిన విద్యార్థి యువజన విభాగం నేతలు
- నిరసనలో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు
- డీఎస్సీ అవకతవకలపై మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
- సీబీఐ విచారణ జరిపించాలని ప్లకార్డులు ప్రదర్శన
- కుటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
- ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్.
బాపట్లలో పోలీసుల ఓవరాక్షన్
- వైఎస్సార్సీపీ యువజన నాయకులను ఉదయాన్నే తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టిన పోలీసులు
- కోన రఘుపతి పీఏతో సహా యువజన విభాగ నాయకులను స్టేషన్లోనే ఉంచిన పోలీసులు
- ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసుల ఓవరాక్షన్
- పోలీస్ స్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ యువజన విభాగ నాయకుల్ని కవర్ చేయొద్దు అంటూ మీడియాపై ఆంక్షలు
వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలు
- విద్యార్థి, యువత విభాగాల ఆధ్వర్యంలో నిరసనలు
- అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు
- డీఎస్సీ పేపర్ లీక్, పోస్టులను అమ్ముకోవడం, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకపొవడంపై నిరసన
- మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్
అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందే..
- దగాపడిన అభ్యర్థుల డిమాండ్
- పేపర్ లీక్‌కు పక్కా ఆధారాలున్నాయి..
- స్పోర్ట్స్ కోటా పేరుతో అతిపెద్ద కుంభకోణం
- అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారు..
- అందుకోసం ఏకంగా జీవోలూ తెచ్చారు..
- అడ్డంగా దొరికిపోయినా బాధ్యత వహించరా?
- నీట్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించింది కదా.. అదే బాటలో మీరూ నడవాలి
- ధర్మేంద్ర ప్రధాన్ తరహాలో లోకేశ్ రాజీనామా చేయాలి
- దగాపడ్డ డీఎస్సీ అభ్యర్థులకు అండగా వైఎస్సార్సీపీ
- యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసనలు
మరిన్ని వార్తలు
