Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. 4 వేల గ్రామాల్లో  భూముల రీసర్వే పూర్తి
ADVERTISEMENT 

4 వేల గ్రామాల్లో  భూముల రీసర్వే పూర్తి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 14, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
WHATSAPP-IMAGE-2023-09-12-A.jpg

సాక్షి, అమరావతి: భూముల రీసర్వేలో రాష్ట్ర ప్రభుత్వం మరో మైలు రాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల గ్రామాల్లో అన్ని దశల సర్వే పూర్తయింది. ఈ గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు నెంబర్‌ 13 నోటిఫికేషన్లు కూడా జారీచేయడంతో అక్కడ కొత్త రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు దేశంలోని ఏ గ్రామంలోనూ పూర్తిస్థాయి రీ సర్వే జరగలేదు.



ఇప్పటికీ అన్ని రాష్ట్రాల్లోని గ్రామాలు, పట్టణాల్లో బ్రిటీష్‌ వాళ్లు రూపొందించిన రెవెన్యూ రికార్డులే ఉన్నాయి. తొలిసారిగా మన రాష్ట్రంలోనే నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తవడంతో అక్కడ డిజిటల్‌ రెవెన్యూ రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త రికార్డుల ఆధారంగానే ఇకపై భూముల వ్యవహారాలు జరగనున్నాయి. రీసర్వేలో భాగంగా ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌లు (గ్రామాల ఫొటోలు) తయారుచేయడానికి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగిస్తున్న తొలి రాష్ట్రం కూడా మనదే.



2020 డిసెంబర్‌లో ప్రాజెక్టు ప్రారంభం

పూర్వపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకాన్ని 2020 డిసెంబర్‌ 21న ప్రారంభించారు. ఆ తర్వాత కరోనా రావడంతో కొంత ఆలస్యమైనా ఆ తర్వాత శరవేగంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు, కంటిన్యూయస్లీ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్లు, రోవర్ల వంటి అత్యాధునిక సర్వే టెక్నాలజీలను ఉపయోగించి దాదాపు వందేళ్ల తర్వాత సమగ్ర రీ సర్వేను చేపట్టారు.



సర్వే తర్వాత రైతులకు భూ హక్కు పత్రాలివ్వడం.. ఆ భూములకు భద్రత నిర్ధారించడం, భూ రక్ష సర్వే రాళ్లు నాటడం ద్వారా సరిహద్దు భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. భూరక్ష సర్వే రాళ్ల ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

రీ సర్వే వల్ల ప్రయోజనాలు..

► సర్వే తర్వాత భూముల రికార్డులను 10 సెంటీమీటర్ల కచ్చితత్వంతో కొలిచి తయారుచేస్తారు. 

► భూ యజమానులకు భూ కమత పటం, గ్రామ పటం, భూ హక్కు పత్రం వంటి రికార్డులను జీపీఎస్‌ కో–ఆర్డినేట్లు, ఐడీ నెంబర్, క్యూఆర్‌ కోడ్‌తో ఇస్తారు. 

► గ్రామంలోని స్థలాలు, అర్బన్‌ ప్రాంతాల్లోని భూములను కూడా మొదటిసారి సర్వేచేసి యజమానులకు యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు కూడా జారీచేస్తున్నారు. 

► భూమి రికార్డులు ట్యాంపరింగ్‌కి అవకాశం ఉండదు. భూ యజమానికి తెలియకుండా భూమి రికార్డులో ఏ మార్పులు జరిగే అవకాశం ఉండదు. డబుల్‌ రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉండదు. 

► గ్రామ సచివాలయాలు సబ్‌ రిజిస్ట్రార్‌ కా­ర్యా­లయాలుగా పనిచేస్తాయి. ఎప్పటికప్పు­డు భూమి రికార్డులు అప్‌డేట్‌ అవుతాయి. 

► రిజిస్ట్రేషన్‌కు ముందే మ్యుటేషన్, పట్టా సబ్‌ డివిజన్‌ జరుగుతుంది. 

► రీ సర్వేకు హాజరుకాలేని వారికి వాట్సాప్‌ వీడియో కాల్, జూమ్‌ ఇతర వీడియో ఇంటరాక్టివ్‌ టెక్నాలజీల ద్వారా రీసర్వే బృందాలు వారి స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేస్తున్నాయి.

భూ సంబంధిత సేవలన్నీ ఏకీకృతమయ్యాయి

రీ సర్వే విజయవంతంగా జరుగుతోంది. భూమికి సంబంధించిన అన్ని సేవలు ఏకీకృతమై ఒకే డెస్క్‌ వ్యవస్థలోకి వస్తున్నాయి. గ్రామ సచివాలయంలో సమీకృత సర్వే, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ సేవలను దేశంలోనే మొదటిసారి అందిస్తున్నాం. మన రీ సర్వే ప్రాజెక్టు అనేక రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తోంది. ముస్సోరిలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మన అధికారులతో ఇతర రాష్ట్రాల్లో రీసర్వే శిక్షణలు ఏర్పాటుచేస్తోంది.

– సిద్ధార్థ జైన్, కమిషనర్, సర్వే, సెటిల్మెంట్‌ శాఖ 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Land resurvey
Government of Andhra Pradesh
revenue records
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నివారించదగినవే అయినా...

నివారించదగినవే అయినా...

డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్‌ గోల.. యూటర్నే శరణ్యం

డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్‌ గోల.. యూటర్నే శరణ్యం

చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!

చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!

ఎన్‌పీఎస్‌పీఎల్‌కు నజరానా

ఎన్‌పీఎస్‌పీఎల్‌కు నజరానా

వరుసగా మూడో బడ్జెట్‌లోనూ అన్నదాతకు మొండిచెయ్యే

వరుసగా మూడో బడ్జెట్‌లోనూ అన్నదాతకు మొండిచెయ్యే

పెండింగ్‌లో ‘పోలీస్‌’ ఫైల్‌!

పెండింగ్‌లో ‘పోలీస్‌’ ఫైల్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.