Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. గంజాయి బ్యాచ్ బరి తెగింపు
ADVERTISEMENT 

గంజాయి బ్యాచ్ బరి తెగింపు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 30, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
54488.jpg

పోలీసులపైనా దాడులకు తెగబడుతూ

గతంలో డీఎస్పీని కారుతో ఢీకొట్టి పరారైన ఘటన 

ఓ కానిస్టేబుల్‌పైనా అదే తరహాలో అటాక్‌ 

తాజాగా గంజాయిని అరికట్టేందుకు కృషి చేస్తున్న వ్యక్తిని వెంటాడి వెంటాడి చంపారు  

ఓ మహిళా డాన్‌ నేతృత్వంలో నెలకు రూ.కోట్లల్లో బిజినెస్‌ 

బ్యాచ్‌లను నడిపిస్తున్న వైనం 

అయినా కనిపెట్టలేకపోయిన పోలీసు నిఘా యంత్రాంగం    

వరుస ఘటనలతో ఉలిక్కి పడుతున్న జిల్లా  

టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా నేరాలకు అడ్డాగా మరింది. ఇందులో గంజాయి బ్యాచ్‌ బరి తెగిస్తోంది. అధికార పార్టీ అండదండలతోనే వీరు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికార పార్టీ సహకారం, పోలీసుల నిఘా వైఫల్యంతో సాధారణ గంజాయి విక్రేత స్థాయి నుంచి డాన్‌గా వ్యవహరించే స్థాయికి ఎదిగిన మహిళ నేతృత్వంలో ఈ గంజాయి బ్యాచ్‌ అరాచకాలు, ఘాతుకాలతో పేట్రేగిపోతోంది. తమ అక్రమ వ్యాపారానికి అడ్డొస్తే.. ఎంతటి వారైనా సరే అంతమొందించేందుకు సైతం వెనుకాడడం లేదు. గతంలో నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతోపాటు పోలీస్‌ సిబ్బందిని, మరో ఘటనలో ఓ కానిస్టేబుల్‌ను కారు ఢీకొట్టి తప్పించుకున్నారు. తాజాగా గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు కొట్టివిడి పెంచలయ్యను సినిమా సీన్‌ తలపించే రీతితో వెంటాడి.. వెంటాడి దారుణంగా హతమార్చారు.

నెల్లూరు: జిల్లాలో గంజాయి బ్యాచ్‌ చేసిన హత్య.. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత.. పోలీస్‌ శాఖ నిఘా యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. అధికార పార్టీలోని ముఖ్య నేతల అండదండలతో ఒక సాధారణ మహిళ గంజాయి విక్రేత స్థాయి నుంచి గంజాయిన్‌ డాన్‌ స్థాయికి ఎదిగింది. రూ.కోట్లల్లో గంజాయి వ్యాపారం చేస్తూ.. కిరాయి బ్యాచ్‌లను మెయింటెన్‌ చేస్తున్నా.. నిఘా యంత్రాంగం పసిగట్ట లేకపోవడం ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. గంజాయి డాన్‌ వ్యవహారం తెలిసినా.. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మౌనం దాల్చారా? అనే అనుమానులు కూడా వ్యక్తమవుతున్నాయి.  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గంజాయి పంట నుంచి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదంతో అణచివేసింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  జిల్లా గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి అడ్డాగా మారింది. విశాఖ, ఒడిశా సరిహద్దుల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున గంజాయిని దిగుమతి చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. విద్యార్థులు, యువతే లక్ష్యంగా వ్యాపా రం సాగుతోంది. ఇక్కడి నుంచి కేరళ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయి తరలివెళుతోంది. గంజాయిని కట్టడి చేయాల్సిన పోలీసులు, ఎక్సైజ్, ఈగల్‌ టీమ్‌లు మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యారు. దీంతో గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. గంజాయి తరలింపు సమయంలో అడ్డుపడిన వారిని అడ్డుతొలగించేందుకు స్మగ్లర్లు వెనుకాడటం లేదు.   

ఈ ఏడాది ఆగస్టు 17న.. 
అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా నుంచి కారులో 22 కేజీల గంజాయిని నెల్లూరులోని వ్యాపారికి ఇచ్చేందుకు తీసుకు వస్తున్నారని పక్కా సమాచారం పోలీసు బాస్‌కు అందింది. ఆయన ఆదేశాల మేరకు బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ జాతీయ రహదారిపై తన సిబ్బందితో కలిసి కాపు కాశారు. పెన్నాబ్రిడ్జి వద్ద నుంచి గంజాయి తరలిస్తున్న కారును వెంబడించారు. ఎస్వీజీఎస్‌ కళాళాల వద్ద కారు యూటర్న్‌ తీసుకుంటున్న సమయంలో పోలీసులు కారును చుట్టుముట్టారు. గంజాయి కోసం అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కారు డ్రైవర్‌ తప్పించుకునేందుకు కారును పోలీసులపైకి దూకించారు. ఈగల్‌ టీమ్‌ కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. ఇన్‌స్పెక్టర్‌ సాంబశివరావు కారును వెంబడిస్తూ కారుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పరారవుతున్న నిందితుడిని పట్టుకున్నారు.  
హెడ్‌ కానిస్టేబుల్‌పై కత్తితో దాడి.. 

పోలీసుల కాల్పులు 
పెంచలయ్య హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు కోవూరు షుగర్‌ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారన్న పక్కా సమాచారంతో నెల్లూరు రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి. వేణు, కోవూరు ఎస్‌ఐ తమ స్బిందితో కలిసి  శనివారం తెల్లవారు జామున షుగర్‌ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఉన్న ప్రాంతాన్ని చుట్టు ముట్టారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకునేందుకు నెల్లూరు రూరల్‌ హెడ్‌కానిస్టేబుల్‌ ఆదినారాయణపై హత్య కేసులో కీలక నిందితుడైన జేమ్స్‌ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మ రక్షణ కోసం ఇన్‌స్పెక్టర్‌ వేణు తొలుత గాలిలోకి, అనంతరం నిందితుడి ఎడమ కాలిపై గన్‌తో కాల్చారు.    


తాజాగా.. పెంచలయ్య హత్య  
నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన కొట్టివిడి పెంచలయ్య (35)సీపీఎం నాయకుడిగా, ఆరీ్టడీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యునిగా ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన అరవ కామాక్షి నేరచరితులకు ఆశ్రయం ఇచ్చి, దొంగతనాలకు పాల్పడే వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయించడం గమనించిన పెంచలయ్య పద్ధతి మార్చుకోవాలని చెప్పి చూశాడు. గంజాయి విక్రయాలను అడ్డుకున్నాడు. పోలీసులతో కలిసి చైతన్య కార్యక్రమాన్ని చేపట్టాడు. గతంలో రూ.కోట్లల్లో జరిగిన గంజాయి వ్యాపారం.. ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. దీంతో తన ముఠాతో కలిసి స్కెచ్‌ వేసి  పెంచలయ్య హత్యకు తెగబడినట్లు పోలీసులే చెబుతున్నారు.

అడ్డొస్తే.. అంతమే  
గతేడాది ఆగస్టులో విశాఖ ఏజెన్సీ నుంచి తిరుపతికి కారులో ముగ్గురు దుండగులు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారని జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెంకటాచలం, మనుబోలు పోలీసులు వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా నిందితులు కారును ఆపినట్లు ఆపి వేగంగా ముందుకు దూసుకెళ్లారు. వాహనాన్ని ఆపేందుకు యతి్నంచిన డీఎస్పీతోపాటు పలువురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేతులు దులుపుకున్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
marijuana
kotamReddy Sridhar Reddy
TDP
Andhra Pradesh
kamakshi
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.