Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కావాల్సినన్ని ‘సీట్లు’!
ADVERTISEMENT 

కావాల్సినన్ని ‘సీట్లు’!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 28, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
studnets.jpg

దేశవ్యాప్తంగా బీటెక్‌ సీట్లు భారీగా పెంపు 

అందుబాటులోకి 14.90 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు

దక్షిణాది రాష్ట్రాల నుంచే 40 శాతం

3.08 లక్షల సీట్లతో అగ్రస్థానంలో తమిళనాడు

ఆ తర్వాతి స్థానాల్లో ఏపీ, తెలంగాణ

దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్‌ సీట్లు భారీగా పెరిగాయి. 2024–25 విద్యా సంవత్సరంలో బీటెక్‌ సీట్ల సంఖ్య 14.90 లక్షలకు చేరింది. 2021–22లో దశాబ్దంలోనే కనిష్ట స్థాయికి(12.54 లక్షలకు) పడిపోయిన తర్వాత.. మళ్లీ ఇప్పుడు 18.84 శాతం మేర సీట్లు పెరగడం విశేషం. వాస్తవానికి 2014–15లో దాదాపు 17.05 లక్షల సీట్లు ఉండగా.. ఆ తర్వాత ఏటా తగ్గుదల నమోదయ్యింది. 

మళ్లీ తిరిగి 2022–23లో 2 శాతం, 2023–24లో 5 శాతం, ఈ విద్యా సంవత్సరంలో ఏకంగా 10 శాతం(1.40 లక్షలు) మేర సీట్ల సంఖ్య పెరిగింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) గణాంకాల ప్రకారం దేశంలో 2,906 అనుమతి పొందిన యూనివర్సిటీలు, కాలేజీల్లో 14.90 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లు ఉన్నాయి. కొత్తగా 1,256 కాలేజీల్లో ఇన్‌టేక్‌ పెంపునకు ఆమోదం పొందాయి. 

ఇంజ­నీరింగ్‌ సీట్లలో అత్యధికంగా 40 శాతం దక్షిణాదికి చెందిన మూడు రాష్ట్రాల్లోనే ఉండటం విశేషం. దేశంలోనే అత్యధికంగా తమిళనాడులో 3,08,686, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532, తెలంగాణలో 1,45,557 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే తమిళనాడులో 32,856, ఏపీలో 23,518, తెలంగాణలో 20,213 సీట్లు పెరిగాయి. ఈ గణాంకాలు ఇంజనీరింగ్‌ విద్యలో దక్షిణాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, అమరావతి

పరిమితి ఎత్తివేతతో పెరిగిన సీట్లు..
వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ఇంజనీరింగ్‌–టెక్నాలజీ కోర్సు­లకు ఆమోదంతో పాటు 2023–24లో బీటెక్‌లో కొత్త సీట్లు ప్రవేశపెట్టడంపై పరిమితిని ఏఐసీటీఈ ఎత్తివేసింది. దీంతో సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇందులో సూపర్‌ న్యూమరీ కోటాలో సుమారు 50 వేల సీట్లు కొత్తగా చేరాయి. 400 నుంచి 500 విద్యా సంస్థలు వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ కోర్సులను ప్రారంభించాయి.

2014–15 నుంచి 2021–22 వరకు ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరికలు చాలా వరకు తగ్గాయి. ఫలితంగా అనేక కాలేజీలు మూతపడ్డాయి. 2016–17 విద్యా సంవత్సరంలో 15.56 లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. 51 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదు. అనంతరం మళ్లీ 2021–22­లో 71 శాతా­నికి, 2022–23లో 81 శాతానికి సీట్ల భర్తీ పెరిగింది. దీంతో అడ్మిషన్లు ప్రోత్సాహకరంగా ఉండటంతో సీట్ల గరిష్ట పరిమితిని ఏఐసీటీఈ తొలగించింది.

అవసరమైన మౌలిక సదుపాయాలు, నిపుణులైన అధ్యాపకులు ఉంటే.. వాటిని పరిశీలించి కావాల్సినన్ని సీట్లకు ఏఐసీటీఈ అనుమతులిస్తోంది. ఒక విద్యా సంస్థ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ద్వారా 420 సీట్ల వరకు పెంచుకునే వెసులుబాటు తీసుకువచి్చంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Engineering seats
AICTE
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.