తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో 29 కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,715 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 24,503 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.06 కోట్లు సమర్పించారు. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 20 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 5 గంటల్లో దర్శనం లభిస్తోంది.
ADVERTISEMENT
ADVERTISEMENT