సాక్షి,విశాఖ: అనకాపల్లి - ఆనందపురం జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఆదివారం తెల్లవారు జామున జాతీయ రహదారిలో గండిగుండం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. బాధితులు టెక్కలిలో శుభకార్యానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు గుంటూరు జిల్లా వాసులుగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ADVERTISEMENT
ADVERTISEMENT