సాక్షి,కాకినాడ: స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ వద్ద జనసేన నాయకులు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రావణ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనాన్ని జనసేన శ్రేణులు ఒక్కసారిగా అడ్డుకున్నారు.
పోలీసుల వాహనం ముందుకు కదలకుండా అడ్డుకోవడమే కాకుండా, ఆగ్రహంతో ఆ వాహనంపై కోడిగుడ్లతో దాడికి దిగారు. దీంతో సర్పవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.