Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కూటమి నేతల ‘బరి’తెగింపు
ADVERTISEMENT 

కూటమి నేతల ‘బరి’తెగింపు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 27, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bari.jpg

కోడి పందేలు, జూద క్రీడలకు హైటెక్‌ ఏర్పాట్లు 

ఉమ్మడి కృష్ణా, పశ్చిమగోదావరిలో భారీగా బేరాలు 

మూడు రోజుల్లో చేతులు మారనున్న రూ.వందల కోట్లు 

రూ.కోట్లు దండుకోనున్న కూటమి ప్రజాప్రతినిధులు 

కేసరపల్లి బరికి నియోజకవర్గ ప్రజాప్రతినిధికి రూ.2 కోట్లు 

పెనమలూరు నియోజకవర్గంలో క్యాసినోకు రూ.70 లక్షలు 

పెద్దఎత్తున బరులు... బేరం పెట్టి రేటు నిర్ణయం.. 

సంక్రాంతి సంప్రదాయం మాటున డబ్బు లూటీ 

చక్రం తిప్పుతున్న కూటమి పార్టీల నాయకులు.. 

అడ్వాన్స్‌లు చెల్లిస్తున్న జూదాల నిర్వాహకులు  

సాక్షి ప్రతినిధి, విజయవాడ, సాక్షి భీమవరం: కత్తులు దూసే కోళ్లు... దానివెనుక జూద క్రీడలు.. చుట్టూ గ్యాలరీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు... వేలల్లో సందర్శకులు..! పెద్దమొత్తంలో చేతులు మారనున్న నగదు..! ఇదీ ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంప్రదాయం మాటున అధికార కూటమి నేతల ‘బరి’తెగింపు. కార్పొరేట్‌ హంగులతో భారీ ప్రాంగణాల్లో బరులు ఏర్పాటు చేస్తూ కోడి పందేలు, జూదం నిర్వహించేందుకు వీరంతా సిద్ధ­మవుతున్నారు. 

కోడి పందేలపై నిషేధం ఉన్నా పండుగ ముసుగులో 20 రోజుల ముందే బరులకు బేరాలు పెట్టి రేట్లు ఖరారు చేశారు. వీవీఐపీల కోసం ఏసీల వంటి హైటెక్‌ సదుపాయాలూ కల్పిస్తున్నారు. సాధారణంగా కోడి పందేలు, జూదం సాయంత్రం చీకటి పడే వరకే జరుగుతాయి. ఈసారి ఏకంగా మూడు రోజులు రేయింబవళ్లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

కూటమి నేతలతో నిర్వాహకులకు సిఫార్సులు
సంక్రాంతికి మూడు వారాలు మాత్రమే ఉండడంతో కోడిపందేలకు పెట్టింది పేరైన పశ్చిమ గోదావరి జిల్లాలో సన్నాహాలు మొదలయ్యాయి. కోడిపందేలు చూసేందుకు వచ్చినవారి జేబులు ఖాళీ చేయించడంలో గుండాట, పేకాట, కోతాట, జూదం నిర్వహణలో ఆరితేరినవారిదే ప్రధాన పాత్ర. దీంతో బరుల కోసం కూటమి నేతలతో నిర్వాహకులకు సిఫార్సు చేయించుకునే పనిలో ఉన్నారు. 

బరి ప్రత్యేకత, జనం రద్దీని బట్టి రూ.25 లక్షల నుంచి రూ.కోటిపైగా ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. భీమవరం చుట్టుపక్కల రూ.కోటి పైనే పలుకుతుండగా, ఇతరచోట్ల రూ.25 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఇస్తామని ముందుకొస్తున్నారు. భీమవరం దగ్గర పెద్ద బరిలో గుండాటకు రూ.70 లక్షలు, పేకాటకు రూ.40 లక్షలు, కోతాటకు రూ.20 లక్షలు ఇచ్చేందుకు అడ్వాన్స్‌లు చెల్లించినట్లు తెలిసింది. 

జూదాలతోనే జనం జేబులు గుల్ల
కోడి పందేలతో పోలిస్తే బరుల వద్ద జరిగే జూదాలే నిర్వాహకులకు ఆదాయ వనరు. పెద్ద బరిలో రోజుకు 20–25 పందేలు మాత్రమే జరుగుతాయి. ఒక్కోదానికి రూ.25 వేల వరకు వసూలు చేస్తే మూడు రోజుల్లో వచ్చే మొత్తం రూ.20 లక్షలు. చిన్న బరుల్లో రూ.5 లక్షలలోపు ఉంటుంది. రెండు, మూడు ఎకరాలలో టెంట్లు, పందెం బరి, గ్యాలరీలు, కుర్చీలు, ఎల్‌ఈడీ స్క్రీన్లు తదితరాలతో పెద్ద బరికి రూ.40 లక్షలు, చిన్న, మధ్యస్థాయి వాటికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చవుతుంది. 

పోలీసు పోస్టుకు గిరాకీ
» గన్నవరం నియోజకవర్గంలో పెద్దఎత్తున బరులు, జూ­ద క్రీడలు జరగనున్న నేపథ్యంలో అక్కడి ఓ పోలీసు స­ర్కి­ల్‌ అధికారి పోస్టుకు గిరాకీ నెలకొంది. మూడు నె­ల­లుగా ఖా­ళీగా ఉన్న ఈ పోస్టుకు ఉన్నత స్థాయిలో భారీగా ము­డుపులు తీసుకుని, అనుకూలమైన వారికి పోస్టింగ్‌ వే­యించుకున్నట్లు టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వి­నిపి­స్తు­న్నా­యి.పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేల మాటున చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాల వైపు  ఎవరూ కన్నెత్తి చూడకుండా నేతలు, సంబంధిత వర్గాలకు భారీగా మామూళ్లు ముట్టజెప్పాలి.

వారికి పంపే కోజాలు (పందెం పుంజులు), బౌన్సర్లు, సిబ్బంది జీతాలు, అతిథులకు భోజనాలు తదితర రూపాల్లో బరిని బట్టి రూ.20 లక్షల నుంచి రూ.కోటి పైనే అవుతుంది. జూదాలు, అశ్లీల నృత్యాలు, మద్యం, ఫాస్ట్‌ ఫుడ్‌ సెంటర్ల నుంచి ఈ మొత్తాన్ని రాబట్టనున్నారు.

మద్యం, పేకాట శిబిరాలకు తలుపులు బార్లా
సంక్రాంతికి ముందు మద్యం, పేకాట శిబిరాలకు చంద్రబాబు ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. దీంతో పెద్దఎత్తున కోడి పందేలు, క్యాసినో, గుండాట, పేకాట, మద్యం దుకాణాలు, వ్యాపార సముదాయాలు నెలకొల్పేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు. కొన్నిచోట్ల ఎంట్రీ ఫీజు రూ.5 వేలుగా నిర్ణయించారు. ఏ ఇబ్బందీ రాదని బరుల నిర్వాహకులకు ప్రజాప్రతినిధులు భరోసా ఇస్తున్నట్లు సమాచారం. 

జూదరుల కోసం హోటల్‌ రూమ్‌లను బుక్‌ చేస్తున్నారు. పండుగ మూడు రోజుల్లో రూ.వంద కోట్లు చేతులు మారనున్నాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా క్యాసినో నిపుణులను దించుతున్నారు. ‘అందర్‌–బాహర్, తీన్‌పత్తి, బ్లాక్‌ జాక్, నంబరింగ్, బకారత్‌’తో పాటు కోత ముక్క, స్టైక్‌ తదితర జూద క్రీడలకు బేరాలు మాట్లాడారు. ఈ ఆటల్లో నిపుణులైన నార్త్, గోవా, నేపాల్‌ డీలర్లతో బరుల నిర్వాహకులు ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. ఇందుకు సంబంధించి మహిళలను రప్పించేందుకూ అధికార పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

రూ.కోట్లు దండుకోనున్న కూటమి ప్రజాప్రతినిధులు
» ఉమ్మడి కృష్ణాలో ఒక్కో నియోజకవర్గంలో పదిపైగా బరులు ఏర్పాటు చేస్తున్నారు. స్థాయిని బట్టి రూ.30 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు టీడీపీ ప్రజాప్రతినిధులకు ఇవ్వా­లి. ఇలా కేసరపల్లి బరికి నియో­జకవర్గ ప్రజాప్రతినిధికి రూ.2 కోట్లు ఇవ్వ­నున్నారు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పామ­ర్రు, అవనిగడ్డల్లో టీడీపీ నియో­జకవర్గ ప్రజాప్రతినిధులు రూ.కోట్లు దండుకోనున్నారు.

» 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా విజ­యవాడ, పరిసర ప్రాంతాలైన రామవ­ర­ప్పాడు, ఎనికేపాడుల్లో సంక్రాంతి సంబ­రా­ల పేరుతో బరులు ఏర్పాటు చేస్తు­న్నా­రు.

» పెనమలూరు నియోజకవర్గం ఉప్పులూ­రులో క్యాసినో ఆడించేందుకు ప్రజాప్ర­తినిధితో రూ.70 లక్షలకు ఒప్పందం కుదిరింది. క్యాసినో ఆడించడంలో దిట్టగా పేరొందిన వ్యక్తితో పాటు, గంజాయి కేసు­లో నిందితుడికి ఈ బరిని అప్పజెప్పారు.

» నున్న ప్రాంతంలో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో హైటెక్‌ బరిలో పెద్దఎత్తున క్యాసినో ఆడించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా సరిహద్దులో ఉన్న ఆగిరిపల్లిలో పేకాట ఆడించడంలో కృష్ణా జిల్లా వారే కీలక పాత్ర పోషించడం గమనార్హం.

»  పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పరి­సరాల్లో జరిగే కోడి పందేలను చూసేందుకు తెలుగు రాష్ట్రాల రాజకీయ, సినీ ప్రము­ఖులు వస్తుంటారు. బరుల వద్ద గుండాట, పే­కా­ట, కోతాట తదితర జూద క్రీడలు పె­ద్దఎత్తున జరుగుతాయి. జిల్లాలో వందపైనే బరులు రానున్న నేపథ్యంలో గుండాట, పేకాట, కోతాట, మద్యం బెల్టు షాప్‌లు నెలకొల్పేందుకు బేరాలు సాగు­తు­న్నా­యి. బరిని బట్టి రూ.కోటి పైనే చెల్లించే­లా ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సమా­చా­రం.

భీమవరంలోని గొల్లవానితిప్ప, ఉండి, తా­డేరు రోడ్డుతో పాటు ఉండి, తాడే­పల్లిగూడెం, తణుకు, నరసాపురం, పాల­కొల్లులో పెద్ద బరులు ఏర్పాటు కాను­న్నాయి. చాలాచోట్ల టీడీపీ–జనసేన నేతలు సంయుక్తంగా, కొన్నిచోట్ల వేర్వేరుగా సిద్ధం చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Godavari Districts
Cockfight
coalition government
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.