Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. కోర్టు తీర్పులకు విరుద్ధ చట్టాలను సహించం
ADVERTISEMENT

కోర్టు తీర్పులకు విరుద్ధ చట్టాలను సహించం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 14, 2026 10:56 AM IST Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
hc.jpg

ఆదాయపు పన్ను నోటీసుల జారీపై హైకోర్టు సంచలన తీర్పు 

పన్ను చట్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ రద్దు 

సవరణ ద్వారా తెచ్చిన ‘సెక్షన్‌ 147ఏ’ రాజ్యాంగ విరుద్ధమంటూ కొట్టివేత 

‘డిజిటల్‌ విధానం’ స్థానంలో ‘జేఏఓల ప్రొసీడింగ్స్‌’ చెల్లవు 

పారదర్శకతకు పెద్దపీట వేయడమే డిజిటల్‌ విధానం లక్ష్యం 

చట్టసభలు పరిధి దాటి చేసే చట్టాలను కోర్టులు రద్దుచేస్తాయి

ధర్మాసనం స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: ఆదాయపు పన్ను పునఃమదింపు నోటీసుల జారీ విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పన్ను తప్పించుకున్న ఆదాయంపై నోటీసులు ఇచ్చే విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ తీసుకొచ్చిన ‘ఫేస్‌లెస్‌’ (డిజిటల్‌) విధానానికి తూట్లు పొడుస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణను హైకోర్టు తప్పుపట్టింది. ఫేస్‌లెస్‌ విధానం స్థానంలో సంబంధిత పరిధిలోని జ్యురిస్‌డిక్షన్‌ అసెసింగ్‌ ఆఫీసర్లే (జేఏఓ) నేరుగా నోటీసులు జారీ చేసేందుకు వీలు కల్పిస్తూ ఆదాయపు పన్ను చట్టం 1961ని సవరిస్తూ కొత్తగా చేర్చిన సెక్షన్‌ 147ఏను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది. ఈ సెక్షన్‌ను రద్దు చేసింది. 

ఈ నేపథ్యంలో ఫేస్‌లెస్‌ విధానం ద్వారా కాకుండా జేఏఓలు నేరుగా సెక్షన్‌ 148, 148ఏ కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ అన్నింటినీ కూడా కొట్టేసింది. ఇవన్నీ కూడా అధికార పరిధి దాటి ఇచ్చినవేనని తేల్చి చెప్పింది. ‘ఈ–అసెస్మెంట్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌ ఎస్కేపింగ్‌ అసెస్మెంట్‌ స్కీమ్, 2022’ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత జేఏఓలకు సెక్షన్‌ 148 కింద నోటీసు ఇచ్చే అధికారం లేదు. ఈ పథకం ప్రకారం పన్ను తప్పించుకున్న ఆదాయంపై ఇచ్చే నోటీసులు (సెక్షన్‌ 148), రీ–అసెస్మెంట్‌ చర్యలన్నీ (సెక్షన్‌ 147) కేవలం డిజిటల్‌/ఫేస్‌లెస్‌ పద్ధతిలోనే జరగాలి. అంతే తప్ప జేఏఓలు నేరుగా నోటీసులు ఇవ్వడానికి వీల్లేదు.’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ నైనాల జయసూర్య, జస్టిస్‌ తూటా చంద్ర ధనశేఖర్‌ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. 

సెక్షన్‌ 147ఏ ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో వ్యాజ్యాలు... 
ఫైనాన్స్‌ యాక్ట్, 2026 ద్వారా ఆదాయపు పన్ను చట్టం 1961లో చేర్చిన సెక్షన్‌ 147ఏని, దానిని వెనుకటి తేదీ (రెట్రోస్పెక్టివ్‌) 01.04.2021 నుండి వర్తింపజేయడాన్ని సవాలు చేస్తూ పలువురు హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సవరణ రాజ్యాంగ మూల నిర్మాణంలో భాగమైన చట్టబద్ధ పాలన, అధికార విభజన  సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వివేక్‌ చంద్రశేఖర్, శ్రీచరణ్‌ తేలప్రోలు, వినోద్‌ కె.రెడ్డి, జ్యోతిరత్న అనుమోలు తదితరులు వాదించారు. అంతేకాక పన్ను చెల్లింపుదారులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తోందన్నారు. సెక్షన్‌ 147ఏ కింద జేఏఓలు ఇచ్చే నోటీసులు.. ‘ఫేస్‌లెస్‌’ పద్ధతికి సంబంధించిన సెక్షన్‌ 151ఏకు విరుద్ధమని తెలిపారు. అందువల్ల అవి చెల్లవని వివరించారు. 

కోర్టు తీర్పులను చెల్లకుండా చేయడానికే సెక్షన్‌ 147ఏ 
జేఏవోలకు నోటీసులు ఇచ్చే అధికారాన్ని తిరిగి కల్పించడానికి, గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను చెల్లకుండా చేయడానికి ప్రభుత్వం నాన్‌–ఓబ్‌స్టాంటే క్లాజ్‌ (ఇతర చట్ట నిబంధనలను అధిగమించడం) తెచ్చి, సెక్షన్‌ 147ఏ ద్వారా ‘అసెసిగ్‌ ఆఫీసర్‌’ నిర్వచనాన్ని మార్చడానికి ప్రయత్నించింది. రీ–అసెస్మెంట్‌ నోటీసులన్నీ సెక్షన్‌ 151ఏ ప్రకారం ‘ఫేస్‌లెస్‌’ పద్ధతిలోనే జరగాలని, జేఏఓలకు నేరుగా నోటీసులు ఇచ్చే పరిధి లేదని గతంలోనే హైకోర్టులు స్పష్టంగా చెప్పాయి. 

సెక్షన్‌ 151ఏ ని లేదా అందులోని ఫేస్‌లెస్‌ పథకాన్ని అధికారికంగా సవరించకుండా, కేవలం సెక్షన్‌ 147ఏ ని తీసుకువచ్చి పాత తీర్పులను రద్దు చేయాలనుకోవడం న్యాయ సమీక్షలో నిలబడదు.  31.3.2026న ఆదాయపు పన్ను చట్టం 1961 చట్టం రద్దయింది. ఫైనాన్స్‌ యాక్ట్‌ 2026 ద్వారా 1961 చట్టంలో సెక్షన్‌ 147ఏను చేర్చారు. ఈ ఫైనాన్స్‌ యాక్ట్‌ 1.4.2026న అమల్లోకి వచ్చింది. కాబట్టి చట్ట సవరణ చేసే నాటికే 1961 చట్టం లేదు. అందువల్ల రద్దయిన చట్టానికి సవరణ చేసి తెచ్చిన సెక్షన్‌ 147ఏ చెల్లదు.  – హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Andhra Pradesh
Income Tax (IT)
Andhra Pradesh High Court
notices
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

అధికార టీడీపీకి ఊహించని షాక్!

అధికార టీడీపీకి ఊహించని షాక్!

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు

పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

బ్యాలెట్‌ బాక్సులు దింపి.. అక్రమ కేసులా?: అంబటి ఫైర్‌

అధికార టీడీపీకి ఊహించని షాక్!

అధికార టీడీపీకి ఊహించని షాక్!

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft