Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పుంగనూరు విధ్వంసం కేసుల్లో చల్లా బాబుకు లభించని ఊరట
ADVERTISEMENT 

పుంగనూరు విధ్వంసం కేసుల్లో చల్లా బాబుకు లభించని ఊరట

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 29, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hc.jpg

సాక్షి, అమరావతి/మదనపల్లె: చిత్తూరు జిల్లా పుంగనూరులో సాగించిన విధ్వంసంపై పోలీసులు నమోదు చేసిన వివిధ కేసుల్లో కీలక నిందితుడుగా ఉన్న పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జ్‌ చల్లా రామచంద్రారెడ్డి(చల్లా బాబు)కు హైకోర్టులో పూర్తిస్థాయి ఊరట లభించలేదు. అన్నీ కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏడు కేసులకు గాను మూడు కేసుల్లో ముందస్తు బెయిల్‌ నిరాకరించింది. ఈ మూడింటిలో చల్లా బాబు పాత్రపై నిర్దిష్ట ఆరోపణలున్న నేపథ్యంలో అతనికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేయట్లేదని స్పష్టం చేసింది.

మిగిలిన నాలుగు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 4 కేసుల్లో చల్లా బాబు పాత్రపై ఎలాంటి నిందారోపణలు లేవని, అందువల్ల అతనికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. 10 రోజుల్లోపు పుంగనూరు పట్టణ పోలీసుల ముందు లొంగిపోవాలని ఆయన్ను ఆదేశించింది. రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలని స్పష్టం చేసింది.

కాగా, బెయిల్‌పై విడుదలైన తరువాత నాలుగు వారాలపాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అడు­గు పెట్టకూడదని చల్లా బాబును ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్ రెడ్డి సోమవారం ఉత్తర్వులిచ్చారు. పుంగనూరు విధ్వంసంపై పోలీసులు తనపై నమోదు చేసిన వేర్వేరు కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని చల్లా బాబు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయగా.. వీటిపై గత వారం విచారణ జరిపిన జస్టిస్‌ సురే‹Ùరెడ్డి ఉత్త­ర్వు­లను రిజర్వ్‌ చేశారు. వీటిపై సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు.  



అంగళ్లు కేసులో.. 

చంద్రబాబు యుద్ధభేరి పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా అంగళ్లు వద్ద టీడీపీ నేతలు, కార్యకర్తలు సృష్టించిన విధ్వంసంపై పోలీ­సులు నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఆ పార్టీ  నేత దేవినేని ఉమా, పీలేరు టీడీపీ ఇన్‌చార్జ్‌ నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, పులివర్తి నానిలకు హైకోర్టు ఊరటనిచ్చింది. షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 10 రోజుల్లోపు ముదివేడు పోలీసుల ముందు లొంగిపోవాలని ఉమా తదితరులను హైకోర్టు ఆదేశించింది.

రూ.లక్ష చొప్పున రెండు వ్యక్తిగత పూచీకత్తులు సమర్పించాలంది. అనంతరం బెయిల్‌పై విడు­దల­య్యాక 4 వారాలపాటు అన్నమయ్య జిల్లాలో అడుగుపెట్టకూడదని ఆదేశించింది. అలాగే నాలుగు వారాలపాటు ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలని తేలి్చచెప్పింది. దర్యాప్తులో జోక్యం చేసుకో­వడం గానీ, సాక్ష్యాలను తారుమారు చేయడం గానీ చేయరాదంది. ఈ మేరకు జస్టిస్‌ సురే‹Ùరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 



నిందితులకు బెయిల్‌ నిరాకరణ 

పుంగనూరు, అంగళ్లులో  4న చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన అల్లర్లు, పోలీసులపై దాడి కేసులో నిందితుల తరఫున బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీకి షాక్‌ తగిలింది. విధ్వంసకాండలో పాల్గొన్న 120 మంది నిందితుల తరఫున దాఖలు చేసిన అన్ని రెగ్యులర్, యాంటిసిపేటరీ బెయిల్‌ పిటిషన్లను మదనపల్లె రెండో ఏడీజే కోర్టు తిరస్కరించింది.

టీడీపీ నాయకులకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా టీడీపీ నేతల తరఫున పిటిషన్లు దాఖలు కాగా.. వీటిపై ఈ నెల 24న మదనపల్లె రెండో ఏడీజే కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. టీడీపీ నాయకులు దాఖలు చేసిన అన్ని బెయిల్‌ పిటిషన్లను డిస్మిస్‌ చేస్తూ సోమవారం మధ్యాహ్నం కోర్టు తీర్పు ఇచ్చింది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP
Chandrababu Naidu
Andhra Pradesh High Court
ramachandra reddy
bail rejected
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

సాయికృష్ణ లాకప్‌డెత్‌ కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

కాపు యువకుని లాకప్‌డెత్‌ కేసు సీబీఐకి అప్పగించండి

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.