Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
search Subscribe Subscribe Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ Live TV లైవ్ టీవీ
download app యాప్ download app Download App
మమ్మల్ని అనుసరించండి
  • facebook
  • x
  • instagram
  • youtube
  • whatsapp
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫొటోలు
  • వీడియోలు
  • close logo
  • search
    Epaper icon ఈ-పేపర్ Live TV లైవ్ టీవీ download app యాప్

    విభాగాలు

  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • మమ్మల్ని అనుసరించండి

    facebook x instagram youtube whatsapp whatsapp whatsapp
  • Sakshi Search
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV

Breadcrumb

  1. Home
  2. ఆంధ్రప్రదేశ్
  3. ఆ ఏడు కేసులను ఎందుకు మూసేశారు?
ADVERTISEMENT

ఆ ఏడు కేసులను ఎందుకు మూసేశారు?

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 6, 2026 05:48 AM IST Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Google
ap_20hc.jpg

స్కిల్‌ డెవలప్‌మెంట్‌సహా ఏడు కేసులపై సీఐడీకి హైకోర్టు ప్రశ్న

సీజ్‌ చేసిన వస్తువులు, కీలక ఆధారాల పరిరక్షణకు ప్రత్యేక పిటిషన్‌ దాఖలుకు సూచన 

చంద్రబాబు సీఎం అయ్యాక ఈ కేసుల దర్యాప్తు పక్కదారి 

కేసుల మూసివేతే లక్ష్యంగా సీఐడీ దర్యాప్తు 

కీలక ఆధారాలను పక్కనపెట్టి క్లోజర్‌ రిపోర్టులు 

పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు 

సాక్షి, అమరావతి: అప్పటి ప్రభుత్వ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు, పొంగూరు నారాయణ, పలువురు మంత్రులు, అధికారులపై దాఖలైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌సహా ఏడు కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు అప్పగించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్స్‌)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడు కేసులను ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’ అంటూ మూసివేస్తూ సీఐడీ దాఖలు చేసిన నివేదికలకు సంబంధించిన వివరాలను కేసుల వారీగా పొందుపరిచి సమగ్ర పట్టికను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

ఆయా కేసుల్లో ఫిర్యాదుదారుల వైఖరి, క్లోజర్‌ రిపోర్టుల దాఖలు, వాటి ఆమోదం, ప్రొటెస్ట్‌ పిటిషన్ల వివరాలను కేసుల వారీగా సమగ్ర పట్టిక రూపంలో తమ ముందు ఉంచాలని సీఐడీని ఆదేశించింది. ఈ వివరాలతోపాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా సమర్పించాలని స్పష్టంచేసింది.  వాటి ప్రతులను పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి అందించాలని కూడా నిర్దేశించింది.  క్లోజర్‌ రిపోర్టులను సవాలు చేస్తూ ప్రొటెస్ట్‌ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు సంబంధిత  కోర్టు వాటిని పరిశీలించవచ్చని ధర్మాసనం స్పష్టంచేసింది. కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న వస్తువులు, కీలక ఆధారాలను పరిరక్షించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేస్తే సంబంధిత న్యాయస్థానం పరిశీలిస్తుందని కూడా సూచించింది. 

ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన  ప్రధాన న్యాయమూర్తి (సీజే )జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్, అసైన్డ్‌ భూములు, ఏపీ ఫైబర్‌నెట్, మద్యం, ఇసుక విధానాలకు సంబంధించి దాఖలైన కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీలకు అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ధర్మాసనం గురువారం విచారించింది.  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ 2023లో పిల్‌ దాఖలు చేశారు. అలాగే చంద్రబాబు తదితరులపై వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించి నమోదైన ఏడు కేసుల దర్యాప్తును సీబీఐ, ఈడీలకు బదిలీ చేయాలని కోరుతూ స్వర్ణాంధ్ర తెలుగు డైలీ ఎడిటర్‌ కె.బాలగంగాధర్‌ తిలక్‌ 2024లో పిల్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  

స్కిల్‌ డెవలప్‌మెంట్, అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్, అసైన్డ్‌ భూములు, ఏపీ ఫైబర్‌నెట్, మద్యం, ఇసుక విధానాలకు సంబంధించిన కేసుల్లో ధర్మాసనం అడిగిన వివరాలు  
1. కేసు నంబరు, ఎఫ్‌ఐఆర్‌ అంశాలు 
2. క్లోజర్‌ రిపోర్టు దాఖలు చేసిన తేదీ 
3. క్లోజర్‌ రిపోర్టును సంబంధిత న్యాయస్థానం ఆమోదించిన తేదీ 
4. ఫిర్యాదుదారుడు ఇచ్చిన 164 స్టేట్‌మెంట్‌ వివరాలు 
5. ఫిర్యాదుదారుడు దాఖలు చేసిన అఫిడవిట్‌ లేదా ఎన్‌ఓసీ వివరాలు 
6.    క్లోజర్‌ రిపోర్టుకు ఫిర్యాదుదారుడు అంగీకరించిన కారణాలు 
7. ప్రొటెస్ట్‌ పిటిషన్‌ దాఖలు చేశారా? లేదా? సంబంధిత వివరాలు 
8. ప్రొటెస్ట్‌ పిటిషన్‌ లేదా క్రిమినల్‌ రివిజన్‌ పెండింగ్‌లో ఉన్న న్యాయస్థానం వివరాలు

స్వతంత్ర సంస్థ నిష్పక్షపాత దర్యాప్తు అవసరం
2024లో రాష్ట్రంలో ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత.. ఆయనపై గతంలో నమోదైన కీలకమైన ఆర్థిక నేరాల కేసుల్లో రికార్డులు, ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ముందు నుంచీ మాకు ఆందోళన ఉంది. తొలుత ఐదు కేసుల్లో చార్జ్‌షీట్లు దాఖలు కాగా, మిగిలిన కేసుల్లో దర్యాప్తు కొనసాగింది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన అనంతరం సీఐడీ అధికారులు గతంలో సేకరించిన ఆధారాలను పక్కన పడేశారు. 

చంద్రబాబు తదితరులపై కేసులను మూసి వేయాలన్న ఉద్దేశంతో కోర్టు అనుమతి లేకుండా నామమాత్రంగా దర్యాప్తు చేపట్టి, గతంలో విచారించిన సాక్షులతోపాటు కొత్తగా మరికొందరిని విచారించారు.  గతంలో 289 మంది సాక్షులను విచారించగా, తిరిగి దర్యాప్తులో మరో 146 మందిని విచారించారు.   వాటి ఆధారంగా ఏసీబీ కోర్టులో ‘మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌’ అంటూ క్లోజర్‌ రిపోర్టులు దాఖలు చేశారు. సంబంధిత న్యాయస్థానాల అనుమతి లేకుండా తిరిగి దర్యాప్తు చేపట్టి సాక్షులను పునర్విచారించడం చట్టవిరుద్ధం. కొన్ని కేసుల్లో క్లోజర్‌ రిపోర్టులను వ్యతిరేకిస్తూ ప్రొటెస్ట్‌ పిటిషన్లు, ఇతర న్యాయపరమైన పిటిషన్లు దాఖలయ్యాయి.  అందువల్ల ఈ పిల్‌ నిరర్థకంగా మారిందని చెప్పడానికి వీల్లేదు. 

చంద్రబాబు తదితరులపై నమోదు చేసిన కేసుల్లో గతంలో సీజ్‌ చేసిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఇతర కీలక వస్తువులను నిందితులకు తిరిగి ఇవ్వకుండా పరిరక్షించాలి.  ప్రొటెస్ట్‌ పిటిషన్లపై నిర్ణయం వెలువడే వరకు వాటిని భద్రపరచాలి.  లేకుంటే కీలక ఆధారాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ అంశంపై మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలి. పిటిషనర్లతోపాటు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, కళ్లం అజయ్‌కుమార్‌రెడ్డి, దాసరి సువర్ణరాజు, ఏము కొండలరావు తదితరులకు థర్డ్‌ పార్టీ సర్టిఫైడ్‌ కాపీలు ఇవ్వకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన రివిజన్‌ పిటిషన్లను ప్రస్తుత పిల్‌కు జత చేయాలని దీనిపై ఒక అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశాం.

న్యాయమైన, నిష్పక్షపాత దర్యాప్తు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 కల్పించిన జీవించే హక్కులో భాగం. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగలేదని లేదా నిందితులకు అనుకూలంగా సాగిందని  న్యాయస్థానం భావించినప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణకు ఆదేశించవచ్చు. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులను ఇచ్చింది.  చంద్రబాబు తదితరులపై నమోదైన కేసుల్లో ఈడీ 2023 సెప్టెంబర్‌ 14న విడుదల చేసిన ప్రకటనలో సుమారు రూ.70 కోట్ల ప్రభుత్వ నిధుల మళ్లింపు, దుర్వినియోగం జరిగినట్లు పేర్కొంది. 

సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సరఫరాల పేరుతో షెల్‌ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులు మళ్లించినట్లు గతంలో ఈడీ వెల్లడించింది.  ఇప్పుడు అదే ఈడీ ఈ వ్యవహారంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అఫిడవిట్‌లో పేర్కొనడం పరస్పర విరుద్ధమైన వైఖరి. ఫిర్యాదుదారుల నుంచి ఒత్తిడి తెచ్చి ఎన్‌ఓసీలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. క్లోజర్‌ రిపోర్టులు, వాటిని ఆమోదించిన ఉత్తర్వుల ప్రతులు కూడా కొందరు ఫిర్యాదుదారులకు అందలేదు.  అవినీతి, ప్రజాధనం దుర్వినియోగం అనేవి సమాజంపై విస్తృత ప్రభావం చూపుతాయి.  ప్రజాధనాన్ని పరిరక్షించేందుకు హైకోర్టు జోక్యం చేసుకోవాలి.   – పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌ కుమార్‌ వాదనలు 

ADVERTISEMENT
ADVERTISEMENT
tags Tags:
Andhra Pradesh
Andhra Pradesh High Court
Chandrababu Naidu
ponguru narayana
skill development
cbi
Crime Investigation Department
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

విషాదం.. పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి?

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

‘అలా టీడీపీ గెలిస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా’

పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు

పచ్చమూకల దాష్టీకాలకు ఎదురొడ్డి గెలుపు

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

వెయ్యి ఓట్ల మెజార్టీతో గెలిస్తే.. 979 ఓట్లు చెల్లనివట..!

పరిషత్‌ ఎన్నికల్లో మంత్రికి షాక్‌

పరిషత్‌ ఎన్నికల్లో మంత్రికి షాక్‌

మరీ ఇంత నీచానికి దిగజారుతారా?: విక్రమ్‌రెడ్డి

మరీ ఇంత నీచానికి దిగజారుతారా?: విక్రమ్‌రెడ్డి

మరిన్ని వార్తలు

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

‘చంద్రబాబు దాన్ని తన గొప్పతనంగా చెప్పుకుంటున్నారు’

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

కూటమికి భారీ షాక్‌.. పరిషత్ పోరులో వైఎస్సార్‌సీపీ జోరు

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

వైఎస్సార్‌సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ

తల్లిపాలే దివ్య ఔషధం

తల్లిపాలే దివ్య ఔషధం

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

అల్లూరి జిల్లా పరిషత్‌ పీఠంపై వైఎస్సార్‌సీపీ జెండా!

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

రాష్ట్ర ప్రజల నెత్తిన బాబు అప్పుల బండ

  

ADVERTISEMENT
 
 
ADVERTISEMENT
ADVERTISEMENT
 
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Jagati Publications Limited.
Powered by Yodasoft