Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. జీవో 94ను ఉపసంహరించుకోండి
ADVERTISEMENT 

జీవో 94ను ఉపసంహరించుకోండి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 4, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
hc.jpg

వివాదానికి ఆ జీవోనే కారణం.. మీ వైఖరి చెప్పండి 

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం 

విచారణ మూడు వారాలకు వాయిదా

సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని మైనారిటీ కాలేజీలు మినహా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వినర్‌ కోటా కింద జనరల్‌ కేటగిరీలో భర్తీ చేసే మొత్తం సీట్లలో 10 శాతం ఆర్థి కంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 94ను ఉపసంహరించుకోవాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

 ఈ మొత్తం వివాదానికి ఆ జీవోనే కారణమని తేల్చి చెప్పింది. ప్రభుత్వమే దానిని ఉపసంహరించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయంది. దీనిపై వైఖరి ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

జీవో 94 అమలును నిలిపేసిన హైకోర్టు 
సీట్ల సంఖ్యను పెంచకుండా ఈడబ్ల్యూఎస్‌ కోటాను అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ జీవో 94ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఆ జీవో అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత జీవో 94తో పాటు ప్రస్తుతం జనరల్‌ కేటగిరిలో ఉన్న 50 శాతం సీట్లలోనే ఈడబ్ల్యూఎస్‌ కోటాను కూడా సర్దుబాటు చేయాలంటూ ఎన్‌ఎంసీ జారీ చేసిన పబ్లిక్‌ నోటీసును సవాలు చేస్తూ దాఖలైన మరో వ్యాజ్యంపైనా సీజే ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. 

కౌంటర్లు దాఖలు చేయాలని ఎన్‌టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ రెండు వ్యాజ్యాలు మంగళవారం మరోసారి విచారణకు రాగా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలుకు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం హైకోర్టుకు స్పష్టంగా చెప్పిందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు యరగొర్ల ఠాగూర్‌ యాదవ్, ఎం.కె.రాజ్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఈ వివరాలన్నింటినీ రికార్డ్‌ చేస్తూ ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తామని ధర్మాసనం తెలిపింది. 

అసలు జీవో 94నే ఉపసంహరించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి కదా అని ధర్మాసనం ప్రశి్నంచింది. మెరుగైన మౌలిక సౌకర్యాలు ఉంటే ప్రైవేటు కాలేజీల్లో అదనపు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) చెప్పిన నేపథ్యంలో జీవో 94ను కొనసాగించడం వల్ల ప్రయోజనం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది.  

టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ‘బెయిల్‌’పై నేడు తీర్పు 
సాక్షి, అమరావతి: టీడీపీ ప్ర«ధాన కార్యాలయంపై దాడికి సంబంధించి పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించనుంది. వాస్తవానికి హైకోర్టు మంగళవారమే తీర్పు వెలువరిస్తామని గతంలోనే స్పష్టం చేసింది. కానీ మంగళవారం ఆ కేసులేవీ విచారణ జాబితాలో లేకపోవడంతో వాటి గురించి వైఎస్సార్‌సీపీ నేతల తరఫు న్యాయవాది ప్రస్తావించారు. 

దీంతో న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్‌ స్పందిస్తూ.. బుధవారం తీర్పు వెలువరిస్తానని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నేతల తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ గతంలో ఇచి్చన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

హైబ్రిడ్‌ విధానంలో కేసుల విచారణ
సాక్షి, అమరావతి : విజయవాడ, అమరావతిలో భారీ వరద నేపథ్యంలో మంగళవారం హైకోర్టులో కేసుల విచారణ హైబ్రిడ్‌ (ఆన్‌లైన్, భౌతిక) విధా­నంలో జరిగింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో సహా సగం మంది న్యాయమూర్తులు హైకోర్టుకొచ్చి కేసుల విచారణ చేపట్టారు. సీజే ధర్మాసనం ముందు అత్యధిక న్యా­య­వాదులు ఆన్‌లైన్‌లో వాదనలు వినిపించగా, అతి కొద్ది మంది కోర్టుకొచ్చి వాదనలు వినిపించారు.

 మిగిలిన సగం మంది న్యాయమూర్తులు వారి ఇళ్ల నుంచే ఆన్‌లైన్‌లో కేసులను విచారించారు. 95 శాతం కేసులు వాయిదా పడ్డాయి. భోజన విరామ సమయానికికల్లా న్యాయమూర్తులు కేసుల విచారణ పూర్తి చేశారు. కోర్టు సిబ్బంది యథాతథంగా హైకోర్టుకొచ్చి విధులు నిర్వర్తించారు. బుధవారమూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. 

విజయవాడలో భారీ వరద, కరకట్ట వద్ద ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో ఆన్‌లైన్‌ విధానంలో కేసుల విచారణ చేపట్టాలంటూ హైకోర్టు న్యాయవాదుల సంఘం కోరడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం మంగళ, బుధవారాల్లో కేసుల విచారణ ఆన్‌లైన్‌లోనే చేపట్టాలంటూ ప్రధాన న్యాయమూర్తి పాలనాపరమైన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం హైబ్రిడ్‌ విధానంలో కేసుల విచారణ జరిగింది.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
ews
Andhra Pradesh High Court
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.