Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. తీవ్ర అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు
ADVERTISEMENT 

తీవ్ర అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 23, 2025 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rain.jpg

తిరుపతి జిల్లాను ముంచెత్తిన కుండపోత వాన 

పాపమాంబపురంలో 13.5 సెంటీమీటర్ల వర్షపాతం 

పలు జిల్లాల్లో నీట మునిగిన పంటలు.. ఆందోళనలో రైతులు 

5 జిల్లాలకు రెడ్‌.. 5 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ 

అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం!

సాక్షి, అమరావతి/సాక్షి, నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో పలుచోట్ల కుండపోత వానలు పడుతున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా తడిసి ముద్దయింది. బుధవారం కూడా తిరుపతి జిల్లాలో వర్షం తెరిపినివ్వలేదు. శేషాచలం కొండల నుంచి వరదలు పోటెత్తడంతో స్వర్ణముఖి నది, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తిరుపతిలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మాల్వాడిగుండం, కపిల­తీర్థం సమీపంలోకి ప్రజ­లను అనుమతించడం లే­దు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లలో అధికారులు కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. చెన్నై– విజయవాడ జాతీయరహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

చిల్లకూరు సమీపంలో వరగలి క్రాస్‌ రోడ్డు నుంచి 2 కి.మీ మేర వాహనాలు బారులు తీరాయి. వాకాడు వద్ద 10 మీటర్ల మేర స­ముద్రం ముందుకు చొచ్చుకొచి్చంది. తిరుమలలోనూ మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీనికితోడు పొగమంచు తిరుమలను కమ్మేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఘాట్‌రోడ్డులోని జలపాతాలు పొంగిప్రవహిస్తున్నాయి.

తిరుమలలోని గో­గర్భం ఆకాశగంగ, పాపవినాశం, కుమారధార–ప­సుపుధార డ్యాముల్లో నీటి ప్రవాహం పెరిగింది. తిరుపతి, శ్రీకాళహస్తితో పాటు తొట్టంబేడు, కోడూ­రు, బుచి్చనాయుడి కండ్రిగ, వడమాలపేట, ఏర్పేడు, వెంకటగిరి, బాలాయపల్లె, పెళ్లకూరు, సూళ్లూరుపేట తదితరచోట్ల భారీ వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలతో అన్నమయ్య జిల్లాలోని చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. పింఛ డ్యామ్‌ వద్ద ప్రవాహం ప్రమాదకరంగా మా­రింది. రైల్వేకోడూరు రోడ్లు జలమయం అయ్యాయి. 

⇒ కడప నగరం జలమయమైంది. రోడ్లపైకి నీరు భారీగా చేరింది. అనేకచోట్ల మోకాళ్ల లోతులో నిలిచి... జనజీవనం స్తంభించింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురంలో మిడతవాగు, ఉలవపాడు మండలంలో ఉప్పుటేరు, అనంతరసాగరం మండలంలోని కొమ్మలేరు, మనుబోలు–గూడూరు మధ్య ఉండే పంబలేరు, చేజర్ల మండలంలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,500 ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు నీటమునిగి నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మతో పాటు, ముసి, మన్నేరు, పాలేరుతో పాటు ఇతర వాగుల్లో నీరు చేరి పారుతున్నాయి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో 33.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా ఎరతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో 2,296 హెక్టార్లలో పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.   

పలుచోట్ల పది సెంటీమీటర్లకు పైనే... 
⇒ మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం పాపమాంబపురంలో 13.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏర్పేడులో 13.4, బాలాయపల్లి మండలం చిలమన్నూరులో 13.1, వెంకటగిరి మండలం లాలాపేటలో 12.8, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం గంగరాజుపురంలో 12.4, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 12, అనుమసముద్రంపేట మండలం దూబగుంటలో 11.1, తిరుపతి జిల్లా బాలాయపల్లె మండలం హస్తకావేరిలో 11.9, గొల్లగుంటలో 11.6, వెంకటగిరిలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మర్రిపాడులో 8.8 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. లింగసముద్రం మండలం ముగిచర్లలో 7.8, కృష్ణా జిల్లా నాగాయలంక భావదేవరపల్లెలో 7.5, గుంటూరు జిల్లా దుగ్గిరాల, ప్రకాశం జిల్లా తర్లపాడు మండలం ఉమరెడ్డిపల్లెలో 6.1, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జంగందొరువు రోడ్డులో 5.9 సెంటీమీటర్ల వర్షం పడింది. 


వాయుగుండంగా బలపడొచ్చు! 
⇒ తీవ్ర అల్పపీడనం నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు తీరం నుంచి వాయువ్య దిశగా కదులుతున్నట్లు బుధవారం వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఏపీ తీరాలకు ఆనుకుని ఉన్న పశి్చమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. తర్వాత ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణాంధ్ర తీరాల మీదుగా కదిలే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 4 రోజులు పలుచోట్ల అతి భారీ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.  

⇒ తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, వైఎస్సార్‌ కడప, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ ఇచ్చింది.

అప్రమత్తంగా ఉండండి: సీఎస్‌ 
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం  వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)  కె.విజయానంద్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల కలెక్టర్లతోపాటు ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీ లోతేటి శివశంకర్‌ లతో సీఎస్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలుచేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

పిడుగు పడి ఇద్దరు మహిళా కూలీల మృతి
పొన్నూరు: పిడుగు పడి పొలంలో కలుపు తీస్తున్న ఇద్దరు మహిళా కూలీలు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. స్థానికులు తెలి­పిన వివరాల ప్రకారం... పొన్నూరు 23వ వార్డులోని క్రిస్టియన్‌పేటకు చెందిన వలపర్ల మరియమ్మ (45), నీలం మాణిక్యమ్మ, 27వ వార్డు షరాఫ్‌ బజార్‌కు చెందిన షేక్‌ ముజా­హిద (45), మరి­కొందరు మహిళా కూలీలు కలిసి బుధవారం పెద ఇటికంపాడు రోడ్డులోని ఓ పొలంలో కలుపు తీసేందుకు వెళ్లారు. మధ్యాహ్నం ఒక్క­సారిగా ఉరుములు, మెరుపు­లతోపాటు భారీ వర్షం మొదలై వారు పని చేస్తున్న ప్రాంతంలో పిడుగు పడింది. దాని తీవ్రత వల్ల వలపర్ల మరియమ్మ, షేక్‌ ముజాహిదా అక్కడికక్కడే మృతిచెందారు. నీలం మాణిక్యమ్మ కాలికి తీవ్ర గాయమైంది. ఆమెను 108 సహాయంతో నిడు­బ్రోలు సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమ­ర్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
heavy rains
Tirupati
low pressure
bay of bengal
Bay of Bengal rains
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.