Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం
ADVERTISEMENT 

చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 5, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
RAIN.jpg

పలు ప్రాంతాలకు స్తంభించిన రాకపోకలు

చిత్తూరు రూరల్‌/తిరుపతి తుడా/చిత్తూరు రూరల్‌ (కాణిపాకం)/తిరుమల: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శుక్రవారం అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8గంటల వరకు వాన పడుతూనే ఉంది. దీంతో పలు చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోయాయి. పలు మండలాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు పంటలు సైతం దెబ్బతిన్నాయి.

⇒  చిత్తూరు జిల్లా సోమల మండలం పెద్ద ఉప్పరపల్లి వద్ద సీతమ్మ చెరువు నుంచి గార్గేయ నదికి వెళ్లే మార్గంలో వర్షం నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పది గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. టమాటా, వరి, పూలతోటలు, కూరగాయల పంటలు అధిక విస్తీర్ణంలో దెబ్బతిన్నట్లు 
రైతులు వాపోతున్నారు.

⇒ చిత్తూరు జిల్లా తవణంపల్లిలోని మాధవరం వంక పొంగిపొర్లుతోంది. తొడతర బ్రిడ్జిపై వర్షపునీరు ఉధృతంగా పారుతోంది. ఈకారణంగా రాకపోకలు నిలిచిపోయాయి.

తిరుపతిలో భారీ వర్షం 
భారీ వర్షం తిరుపతి నగరాన్ని ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత రెండు గంటల సమయంలో మొదలైన వర్షం ఉదయం 8 గంటల వరకు పడుతూనే ఉంది. కుండపోత కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వర్షపు నీరు పెద్ద ఎత్తున చేరింది. లక్ష్మీపురం కూడలి, ఏఐఆర్‌ బైపాస్‌ రోడ్డు, లీలామహల్‌ కూడలి, కరకంబాడి రోడ్డు, కొర్లగుంట పెద్ద కాలువ ప్రాంతాల్లో వర్షం నీరు ఏరులై పారింది. ప్రమాదకరస్థాయిలో దాటడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలానే రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ల వద్ద వరద నీరు ప్రమాదకర స్థాయికి చేరింది.  

తిరుమలలో కూడా..
తిరుమలలో కూడా శనివారం భారీగా వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎడతెరపి లేని వర్షం కురవడంతో చలి తీవ్రత పెరిగింది. నాలుగు మాడవీధులు జలమయమయ్యాయి. రోడ్లన్నీ వర్షం నీటితో నిండిపోయాయి.  స్వామివారి దర్శనానికి వెళ్లిన భక్తులు, దర్శనం అనంతరం ఆలయం బయటకు వచి్చనపుడు తడిసి ముద్దయ్యారు. వసతి గృహాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

వరి, టమాటా పంటలకు నష్టం 
అన్నమయ్య జిల్లాలో శనివారం పలుచోట్ల  వర్షం కురిసింది. పీలేరులో భారీ వర్షం  కురవడంతో రోడ్లపై నీరు నిలిచింది. ఆర్టీసీ బస్టాండ్‌ జలమయమైంది. పీలేరు–మదనపల్లె మార్గంలో నాలుగులేన్ల రహదారి విస్తరణలో భాగంగా నిర్మాణం కోసం కొత్తచెరువును తవ్వి వదిలేశారు. అయితే భారీ వర్షం కారణంగా చెరువు కట్ట తెగిపోయింది. దీంతో దిగువన ఉన్న పొలాల్లో వరి, టమాటా పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి గార్గేయ ప్రాజెక్టు నిండి పింఛా నది పరవళ్లు తొక్కుతోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
chittoor
Tirupati District
heavy rain
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.