Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. టిడ్కోలో కూడా చంద్రబాబు ‘డబుల్‌’ దోపిడీ!
ADVERTISEMENT 

టిడ్కోలో కూడా చంద్రబాబు ‘డబుల్‌’ దోపిడీ!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 9, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
tidco.jpg

సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా సాగిన దోపిడీ, ప్రజాధనం లూటీకి టిడ్కో ఇళ్లే నిలువెత్తు సాక్ష్యం. ఈ నిర్మాణాలకు కేటాయించిన స్థలం ప్రభుత్వానిది.. ఇసుక ఉచితం.. నిర్మాణ అనుమతులకు ఎలాంటి ఫీజులూ లేవు. వసతులు, సదుపాయాలు కల్పించాలన్న నిబంధన కూడా టెండర్లలో లేదు. అలాంటప్పుడు మార్కెట్‌ రేటు కంటే టిడ్కో ఇళ్ల నిర్మాణ ధర తగ్గాల్సింది పోయి రెట్టింపు కావడం అక్రమాలకు నిదర్శనంగా నిలుస్తోంది. నిరుపేదల కోసం చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడటం విస్మయం కలిగిస్తోంది.   



ఎనిమిది కంపెనీలకు కాంట్రాక్టు.. 

పట్టణాల్లో సొంత ఇల్లు లేని సుమారు 5 లక్షల మందికి జీ ప్లస్‌ 3 విధానంలో ఇళ్ల నిర్మాణానికి 2016లో టిడ్కో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ. విస్తీర్ణంలో కట్టే టిడ్కో ఇళ్లకు నాటి మార్కెట్‌ ధర కంటే రెండింతలు పైగా నిర్మాణ వ్యయాన్ని పెంచేశారు. కంపెనీని బట్టి చ.అడుగుకు రూ.2,534.75 నుంచి రూ.2034.59 మధ్య నిర్మాణ వ్యయంగా నిర్ణయించారు. సగటున చ.అడుగు నిర్మాణ ధర రూ.2,203.45 చొప్పున టెండర్లు అప్పగించారు. అంటే బయట మార్కెట్‌ కంటే అదనంగా రూ.1203.45 పెంచారు.

తొలి విడతలో 2,08,160 టిడ్కో యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మించే కాంట్రాక్టును ఎనిమిది కంపెనీలకు కేటాయించారు. నిజానికి అప్పుడు పట్టణాల్లో ప్రైవేట్‌ అపార్ట్‌మెంట్లను చ.అడుగు రూ.1,000 లోపే నిర్మిస్తుండటం గమనార్హం. టిడ్కో ఇళ్లకు నాడు ఇసుక ఉచితం. సిమెంట్, స్టీల్, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు కూడా తక్కువే కాబట్టి వ్యయం తగ్గాల్సింది పోయి రెట్టింపైంది. టిడ్కో ఇళ్లను షీర్‌వాల్‌ టెక్నాలజీలో నిర్మిస్తున్నందున గరిష్టంగా చ.అడుగు నిర్మాణ వ్యయం రూ.1000కి మించదని ఈ విధానంలో ఎన్నో ఏళ్లుగా అపార్ట్‌మెంట్లు కడుతున్న కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. 



 రివర్స్‌ టెండర్లతో ఖజానాకు ఆదా.. 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు రివర్స్‌ టెండరింగ్‌ విధా నాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో 2020 ఏప్రిల్‌లో 54,056 టిడ్కో యూనిట్లకు చ.అ. నిర్మాణానికి సగటున రూ.1,655.31 చొప్పున టెండర్లు ఖరారయ్యాయి. చంద్రబాబు సర్కారు నిర్ణయించిన దానికంటే చ.అడుగుకు రూ.548.14 తక్కువ ధరకు టెండర్లు చేయడంతో ఖజానాకు దాదాపు రూ.321 కోట్లు ఆదా అయ్యాయి.

పైగా ఈ నిర్మాణాలకు ఇసుక ఉచితం కాదు. సిమెంటు, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రి, కూలీల రోజువారి వేతనాలు అన్నీ గత ప్రభుత్వ హయాం కంటే ఎక్కువే ఉన్నా ధర తగ్గించి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టును చంద్రబాబు బృందం తమ అవినీతికి ఆదాయ వనరుగా మార్చుకున్నదనేందుకు ఇది నిదర్శనం. 

ఇంటికి రూ.2 వేలు.. ఫ్లాట్‌కి  రూ.1,500 

సాధారణంగా వ్యక్తిగత ఇల్లు, అపార్ట్‌మెంట్‌ నిర్మాణాల ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంటికి అయిన ఖర్చులో అపార్ట్‌మెంట్‌కు సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు వ్యక్తిగత ఇల్లు నిర్మాణ ధర చ.అ రూ.2 వేలు ఉంటే అపార్ట్‌మెంట్‌లో చ.అ. రూ.1500 వరకు ఉంది. ఇవన్నీ ఎక్కువ మంది కోరుకునే ప్రాంతాల్లో చెబుతున్న సరాసరి ధరలు. అదే పట్టణాలకు దూరంగా నిర్మిస్తే గరిష్టంగా రూ.700 నుంచి రూ.900 మించదు.   – వీవీఎన్‌ యుగంధర్, భవన నిర్మాణ సంస్థ యజమాని, కాకినాడ

రూ.1,200 మించదు  

కొన్నేళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నా. టిడ్కో ఇళ్లు ప్రారంభించినప్పుడు కాకినాడలో అపార్ట్‌మెంట్లు కట్టా. స్థలంతో కలిపి అన్ని సదుపాయాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన ఫ్లాట్లను చ.అడుగు రూ.1,900 నుంచి రూ.2,000 మధ్యనే ఇచ్చాం. అలాంటిది ప్రభుత్వ స్థలంలో ఉచిత అనుమతులు, ఉచితంగా ఇసుక ఇస్తే చ.అడుగుకు గరిష్టంగా రూ.800 మాత్రమే అవుతుంది. టిడ్కో ఇళ్లకు అప్పుడు ఇన్ని వసతులు కూడా లేవు. అన్ని వసతులతో అద్భుతంగా కడితే చ.అ రూ.1,200కి మించే అవకాశం లేదు.  

– బసవా ప్రసాద్, బిల్డర్‌(కాకినాడ) 



అక్రమాలు జరిగినట్లే.. 

పట్టణంలో ఒక అపార్ట్‌మెంట్‌ కట్టాలంటే ఫీజుల రూపంలో చ.అడుగుకు రూ.270 వరకు చెల్లించాలి. ఫౌండేషన్, గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణానికి అధికంగా ఖర్చవుతుంది. స్థలంతో కలిపి 2016–17లో విశాఖలో మేం కట్టిన అపార్ట్‌మెంట్‌లో చ.అ. రూ.2వేల నుంచి రూ.2200కే ఇచ్చాం. అన్ని వసతులు కల్పించాం. పేరున్న కంపెనీల వస్తువులనే వాడాం. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి అన్ని అనుమతులను ప్రభుత్వం ఉచితంగానే ఇస్తుంది. నాడు ఇసుక కూడా ఉచితం. ఇంటీరియర్‌ సొబగులు లేవు. మౌలిక సదుపాయాలు లేవు. ఇలాంటి నిర్మాణాల్లో చ.అ రూ.700కి మించి ఖర్చుకాదు. ఆ ధర దాటిందంటే అక్రమాలు జరిగినట్టే.   – బర్కత్‌ అలీ, బిల్డర్‌ (విశాఖపట్నం)  



ఇప్పుడూ అంత ధర లేదు  

ఎన్నో ఏళ్లుగా కాకినాడలో నిర్మాణాలు చేస్తున్నాం. అ పార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ల ధర అన్ని సదుపాయాలు, స్థల ంతో కలిపి ఇప్పుడైతే చ.అ. రూ.1500 నుంచి రూ.2 వేల వరకు ఉంది. విశాఖలో మరో రూ.2 వందలు ఎక్కువ ఉంది. నాలుగైదేళ్ల క్రితం అయితే ఇందులో సగం కూడా లేదు. ప్రభుత్వ ప్రాజెక్టులైతే ఫీజులు ఉండవు కాబట్టి రూ.వందల్లోనే ఉండాలి.   – ఎం.గంగబాబు, బిల్డర్‌ (కాకినాడ) 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Chandrababu Naidu
TIDCO
house
Corruption
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

ఓటర్ల జాబితా సవరణ..

ఓటర్ల జాబితా సవరణ..

పవన్‌ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..

పవన్‌ కల్యాణ్‌పై అంబటి సంచలన వ్యాఖ్యలు..

చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

చంద్రబాబు ప్రేమ ముమ్మాటికీ బూటకం... రైతులకు చంద్రబాబు చేసిన మోసాలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.