Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఫోర్జరీ పోలీస్‌!
ADVERTISEMENT 

ఫోర్జరీ పోలీస్‌!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 6, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
police.jpg

ఇంటెలిజెన్స్‌ డీఐజీ సంతకం ఫోర్జరీ చేసిన జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌

తాను ఎస్‌ఐని అంటూ నకిలీ ఐడీ కార్డు సృష్టి

పలు ప్రాంతాల్లో దందాలు

బాధితుల ఫిర్యాదుతో విచారణ చేస్తున్న స్పెషల్‌ బ్రాంచ్‌ బృందం

కాకినాడ క్రైం: తన స్థాయిని పెంచుకుని అడ్డగోలు దందాలకు పాల్పడేందుకు ఒక హెడ్‌ కానిస్టేబుల్‌ ఏకంగా డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తనకు తానే ఎస్‌ఐగా ఐడీ కార్డును తయారు చేసుకున్నా­డు. దాన్ని చూపించి ఎస్‌ఐగా చెప్పుకొంటూ చెలరేగిపోతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొప్పిశెట్టి యోగి కామేశ్వర­రావు గవర్న­మెంట్‌ రైల్వే పోలీస్‌ విభాగం(జీఆర్పీ)­లో స్పెషల్‌ బ్రాంచ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.

రాజమహేంద్రవరం రైల్వే సబ్‌ డివిజన్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన కొద్దికాలం కిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ వింగ్‌ డీఐజీ సంతకాన్ని ఫోర్జరీ చేసి తన పేరిట ఎస్‌ఐగా ఐడీ కార్డు తయారు చేసుకున్నాడు. దాన్ని చూపిస్తూ రాజమ­హేంద్రవరం రైల్వే సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతోపాటు కాకినాడ, తుని, సామర్లకోట, అన్నవరం, రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లలో ఉద్యోగులపై అజమా­యిషీ చేసేవాడు. కొన్ని కేసులను ఎస్‌ఐ హోదాలో సొంతంగా విచారణ చేసి డబ్బులు వసూలు చేయడం, చోరీ కేసుల్లోనూ రికవరీలు చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. 

ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఓ జవాన్‌ తనను వేధిస్తు­న్నాడని అతని భార్య నగరంలోని దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జవాన్‌ సోదరుడైన రైల్వే కానిస్టేబుల్, అతని తల్లి పేర్లను కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. రైల్వే కానిస్టేబుల్‌పై ఫిర్యాదు చేయడంతో విచారణ కోసం జీఆర్పీ స్టేషన్‌కు పంపారు. దీంతో వివరాలు సేకరించేందుకు వెళ్లిన హెడ్‌ కానిస్టేబుల్‌ కామేశ్వరరావు... విచారణ పేరుతో రైల్వే కానిస్టేబుల్‌ భార్యను మరో ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి బెదిరించాడనే ఆరోపణలు ఉన్నాయి. 

ఫిర్యాదు చేసిన జవాన్‌ భార్యను రైల్వే గెస్ట్‌ హౌస్‌కి అనధికారికంగా తీసుకెళ్లి విచారించడం వివాదాస్పదంగా మారింది. అదే సమయంలో కామేశ్వరరావు నకిలీ ఐడీ కార్డు చూపించి తాను ఎస్‌ఐని అని బెదిరించాడని రైల్వే కానిస్టేబుల్‌ భార్య కాకినాడ టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు డీఐజీ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు. మరికొందరు కూడా అతనిపై జీఆర్పీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో నకిలీ ఐడీ కార్డును ఎక్కడెక్కడ ఉపయోగించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కామేశ్వరరావుపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అనకాపల్లి జిల్లా ఎస్పీకి జీఆర్పీ అధికారులు సిఫార్సు చేశారు. రైల్వే నుంచి తిరిగి అతని మాతృవిభాగమైన అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయానికి బుధవారం పంపించారు. అతనికి సహకరించిన మరికొందరిని కూడా జీఆర్పీ నుంచి బదిలీ చేశారు. విశాఖ రేంజ్‌కి చెందిన స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులు ఈ నెల ఒకటో తేదీన కాకినాడ వచ్చి కామేశ్వరరావుపై ఫిర్యాదు చేసిన బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కామేశ్వరరావుపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేస్తున్నామని, బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు తెలిపారు. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
dig
Signature forgery
head constable
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.