Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. డాక్టర్‌.. C/O గూగుల్‌
ADVERTISEMENT 

డాక్టర్‌.. C/O గూగుల్‌

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 8, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
sctr.jpg

మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో పెరుగుతున్న శ్రద్ధ

డాక్టర్ల కోసం నెట్‌లో శోధన 

ఈ ఏడాది 41 శాతం పెరుగుదల 

వైద్యుల వద్దకు వెళ్లడంలో దేశ వ్యాప్తంగా గణనీయ వృద్ధి  

జస్ట్‌ డయల్‌ సంస్థ నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: ఒత్తిడి, ఆందోళన, అనవసర భయాలు వంటి మానసిక సమస్యలతో బాధపడే వారికి మానసిక వైద్యులను సంప్రదించాలంటే భయం, బెరుకు ఉంటాయి. ఎవరైనా చూస్తే పిచ్చోళ్ల కింద లెక్క కడతారనే అపోహలతో చాలా మంది ఆ సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో ఇలా భావించే వారిసంఖ్య తగ్గుతోంది. మానసిక సమస్యలపై నిర్భయంగా వైద్యులను సంప్రదించే వారు పెరుగుతున్నారు. 

గత ఏడాదితో పోలిస్తే 2024లో మానసిక వైద్యుల సమాచారం కోసం ఇంటర్నెట్‌లో శోధించిన వారి సంఖ్య 41 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా అక్షరాస్యులు ఎక్కువగా ఉండే మెట్రో నగరాల్లో గణనీయమైన వృద్ధి కనిపిస్తోంది. 

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జనవరి–అక్టోబర్‌ నెలల మధ్య మానసిక వైద్యుల కోసం అన్వేషిoచిన వారి సంఖ్య కోల్‌కతాలో 43 శాతం, ముంబై 36, కోజికోడ్‌ (క్యాలికట్‌)లో 29 శాతం చొప్పున పెరిగింది. ఈ అంశం జస్ట్‌ డయల్‌ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. హెల్త్‌ కేర్‌ సెర్చ్‌లలో మెట్రో నగరాల్లో మొత్తంగా 15 శాతం వృద్ధి కనిపించింది. ఢిల్లీలో 20, హైదరాబాద్‌ 17, చెన్నై వంటి నగరాల్లో 16 శాతం పెరుగుదల నమోదైంది.  

ఆరోగ్య సమస్యలపై 23 శాతం పెరిగిన అన్వేషణ  
ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం ఇంటర్నెట్‌లో అన్వేషించిన వారి సంఖ్య ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 23 శాతం పెరిగినట్టు తేలింది. ఆధునిక జీవన శైలి నేపథ్యంలో మధ్య వయసు్కల్లోనూ ఎముకలు, కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం ఆర్థోపెడిక్‌ సెర్చ్‌లు 38 శాతం పెరిగినట్టు వెల్లడైంది. అత్యధికంగా లక్నోలో 37, ఢిల్లీలో 36 శాతం చొప్పున పెరిగినట్టు తేలింది. 

బెంగళూరు, పాట్నా నగరాల్లో 32 శాతం వృద్ధి చోటు చేసుకుంది. గైనకాలజిస్ట్‌ల కోసం శోధనలు 28 శాతం పెరిగాయి. ఈ తరహా వృద్ధి హైదరాబాద్‌లో 31 శాతం, పూణేలో 33, ముంబైలో 29 శాతం  నమోదైంది. కాగా, దేశ వ్యాప్తంగా ఆయుర్వేద వైద్య సేవల వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. 

ఈ నేపథ్యంలోనే గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 18 శాతం ఆయుర్వేద వైద్యుల కోసం శోధనలు పెరిగాయి. ఢిల్లీలో 29 శాతం, ముంబైలో 21 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. సంప్రదాయ వైద్య పద్ధతులపై పెరుగుతున్న ఆసక్తిని ఈ పెరుగుదల సూచిస్తోంది.  

అవగాహన పెరిగింది
గతంలో ప్రజలు మానసిక సమస్యలపై వైద్యులను సంప్రదించాలంటేనే ఎంతో భయపడేవాళ్లు. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం మానసిక ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది. గతంలో మాదిరిగా భూత వైద్యం, మంత్ర, తంత్రాలను నమ్మే పరిస్థితులు పోతున్నాయి. ప్రస్తుతం రోజు రోజుకు ప్రజల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి. కేవలం పిచ్చే కాకుండా ఆందోళన, అసహనం, భావోద్వేగ సమస్యలన్నీ మానసిక అనారోగ్యం కిందకే వస్తాయి. 

ఇలాంటి ఇబ్బందులున్న వారు బయటకు చెప్పుకుంటే ఏమవుతుందోనని భయపడాల్సిన అవసరం లేదు. తమ సమస్యలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకోవాలి. ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స, కౌన్సెలింగ్‌ పొందాలి.   – డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి, మానసిక వైద్యనిపుణులు, విజయవాడ   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Mental health problems
Andhra Pradesh
Healthcare
Psychiatrists
Google
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. పిచాయ్‌కు వినతి!

గూగుల్ ఉద్యోగుల ఆందోళన.. పిచాయ్‌కు వినతి!

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.