Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. క్షణికావేశం.. తీస్తోంది ప్రాణం
ADVERTISEMENT 

క్షణికావేశం.. తీస్తోంది ప్రాణం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 13, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
112.jpg

పెరుగుతున్న మానసిక సమస్యలు     

అర్ధంతరంగా ముగుస్తున్న జీవితాలు 

రోజుకు ఒకరు చొప్పున బలవన్మరణం    

సత్యసాయి జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

‘బలమే జీవితం.. బలహీనతే మరణం’ అని ఆలోచనాత్మక వాక్యం చెప్పారు స్వామి వివేకానంద. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకోలేక చిన్న సమస్యలకే కుంగిపోయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ సమస్యలనో.. ఆర్థిక ఇబ్బందులనో.. అనారోగ్య సమస్యలనో.. పరీక్ష తప్పామనో.. చదువు ఇష్టం లేదనో.. ప్రేమ విఫలమైందనో.. ఇలా రకరకాల కారణాలతో ఒత్తిడికి లోనై బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు జిల్లా వ్యాప్తంగా రోజురోజుకూ పెరగిపోతున్నాయి. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందన్న విషయాన్ని మరచి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు.  

కదిరి: ఉన్నది ఒక్కటే జీవితం. ఏం సాధించినా అందులోనే. అలాంటి అమూల్యమైన జీవితాన్ని క్షణికావేశంలో చేజేతులా సమాప్తం చేసుకుంటే వారి మీద ఆధారపడ్డవారిని, వారి మీదే ఆశలు పెట్టుకొని జీవిస్తున్నవారిని రోడ్డున పడేసినట్లే అవుతుంది. 

సత్యసాయి జిల్లాలో ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకూ కేవలం 9 రోజుల్లోనే 9 మంది పలు కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారంటే ఇది మామూలు విషయం కాదు. వీరిలో అధిక శాతం మంది యువతీ యువకులే. సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల కారణంగానే ఇలా బలవన్మరణాలు జరుగుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.  

భయపెడుతున్న ఘటనలు..
మడకశిర పట్టణానికి చెందిన మధు(23) అగళి మండలంలోని ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇదే విషయంగా చివరకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఒక ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదనే భావంతో క్షణికావేశంలో  ఈ నెల 1వ తేదీ ఆత్మహత్య చేసుకున్నాడు.

» నల్లచెరువు మండలం అల్లుగుండు గ్రామానికి చెందిన కుళ్లాయప్ప(40) చిన్నపాటి అంశానికి భార్యతో గొడవ పడి కొన్నేళ్లుగా విడిగా ఉంటున్నాడు. చివరకు ఒంటరి జీవితంపై విరక్తి పుట్టి ఈ నెల 5న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.=    ధర్మవరంలోని కోట కాలనీకి చెందిన తొండ­మాల మహేష్‌(37) ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేసేవాడు. పెళ్లి సంబందాలేవీ కుదరడం లేదని మనస్థాపానికి గురై ఈ నెల 6న ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

»  మడకశిర మండలం హెచ్‌ఆర్‌ పాళ్యంకు చెందిన ప్రవీణ్‌కుమార్‌(27) సైతం పెళ్లి సంబందాలు కుదరడం లేదని ఈ నెల 6న రాత్రి గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

»   చెన్నేకొత్తపల్లి మండలం ప్యాదిండి గ్రామానికి చెందిన పార్వతి, గంగాధర్‌ల కుమార్తె అశ్వని(16) రామగిరి కేజీబీవిలో ఇంటర్‌ చదువుతుండేది. దసరా సెలవుల్లో ఇంటికొచ్చిన ఆ విద్యార్థిని తిరిగి కళాశాలకు వెళ్లడం ఇష్టంలేక ఈ నెల 8న ఇంటి పక్కనే ఉన్న షెడ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

... ఇలా ఒకరిద్దరు కాదు... ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ 153 మంది బలవన్మరణాలకు పాల్పడడం ఆందోళన చెందే విషయం. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో ఆత్మహత్యలు చోటుచేసుకున్న ఘటనలు లేవు. సగటున ప్రతి రెండు రోజులకు ఒకరు ఆత్యహత్య చేసుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవన్నీ అధికారికంగా వెలుగు చూసిన ఘటనలే. ఇక అనధికారిక లెక్కలు మరిన్ని ఉన్నట్లుగా తెలుస్తోంది.

కౌన్సెలింగ్‌ అవసరం 
మానసిక సమస్యలకు చికిత్స అందుబాటులో ఉంది. ప్రారంభ దశలోనే గుర్తించి తగిన కౌన్సెలింగ్‌ ఇప్పిస్తే వ్యతిరేక ఆలోచనల నుంచి బయట పడవచ్చు. మానసిక సమస్యలతో బాధపడే వారిని మరింత కోపానికి, ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదు. వారికి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. వీలైనంత వరకూ వారు అందరిలో ఉంటూ ఆనందంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  – డాక్టర్‌ ఫైరోజాబేగం, డీఎంహెచ్‌ఓ 

ఒక్క క్షణం ఆలోచించాలి
జీవితం ఎంతో విలువైనది. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. నమ్ముకున్న అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఆ క్షణంలో తలుచుకుంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే రాదు. సమస్యలకు చావు పరిష్కారం కానే కాదు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ సెంటర్‌ను అందుబాటులోకి తెస్తాం. యువతను మేల్కోలిపే కార్యక్రమాలు చేపడతాం.   – ఎస్‌.సతీష్ కుమార్, ఎస్పీ

ఇవీ హెచ్చరిక సంకేతాలు.. 
» ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం 
» స్నేహితులకు, బంధువులకు దూరంగా ఉండటం 
» విపరీతమైన కోపం, భయం ప్రదర్శిస్తూ సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండటం.  
» నిరంతరం నిస్సహాయతాభావాన్ని వ్యక్త పరుస్తుండడం.  
» అతిగా మద్యం సేవించడం, ప్రతీకార కాంక్షతో మాట్లాడుతుండడం.  
» ఏకాగ్రత, జ్ఞాపకశక్తి సమస్యలు, నిద్ర, ఆకలిలో మార్పులు ఉండడం.  
» పండగలు, వివాహాల వంటి వేడుకల్లో పాల్గొనకుండా దూరంగా ఉండటం.  
» స్నేహితులకు విషాదరకమైన మెజేస్‌లు పంపడం. 
» చనిపోతున్నట్లు ముందుగానే వారి మాటల్లో పరోక్షంగా వ్యక్తపరుస్తుండడం.   

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Mental health problems
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.