Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. పాడి, ఉద్యాన రంగాలకు ఊతం
ADVERTISEMENT 

పాడి, ఉద్యాన రంగాలకు ఊతం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 14, 2023 Sakshi Read Time Read Time: 5 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
abdul_20nazer.jpg

సాక్షి, అమరావతి : ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో తృణ, చిరుధాన్యాల పంటల సాగును రాష్ట్రంలో బాగా ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

ఉద్యానవన, పశుగణ, మత్స్య రంగాలు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నడిపించే వృద్ధి చోదకాలుగా గుర్తించి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్‌ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాట, కొబ్బరి, మిరప పంటల ఉత్పాదకతలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. 2023-24 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తొలి రోజు మంగళవారం ఆయన ఉభయ సభల సంయుక్త సమావేశంలో  ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.



♦  భారతదేశంలో మామిడి, కమల, పసుపు ఉత్పత్తిలో రాష్టం 2వ స్థానంలో, సూక్ష్మ నీటి పారుదల (డ్రిప్‌ ఇరిగేషన్‌) అమలులో 3వ స్థానంలో నిలిచింది. 

♦ దేశంలోనే ఏడాదికి గుడ్ల ఉత్పత్తిలో 2,645 కోట్ల గుడ్లతో ప్రథమ స్థానంలో, మాంసం ఉత్పత్తిలో 10.26 లక్షల టన్నులతో రెండవ స్థానంలో, పాల ఉత్పత్తిలో 154.03 లక్షల టన్నులతో 5వ స్థానంలో ఉంది.

♦ పశు ఆరోగ్య రక్షణలో భాగంగా 1962కు ఫోన్‌ చేయగానే పాడి రైతు వద్దకు వచ్చేలా రూ.252.91 కోట్ల వ్యయంతో 340 వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏర్పాటు చేసింది. 

♦ పాల సహకార సంఘాల బలోపేతానికి అమూల్‌ ప్రాజెక్ట్‌­కు­ ఎన్‌సీడీసీ ద్వారా పాడి పరిశ్రమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి రుణంగా రూ.1,362 కోట్లు అందించింది.

♦ రూ.1,868.63 కోట్ల వ్యయంతో జగనన్న జీవక్రాంతి పథకం కింద 45-56 సంవత్సరాల మధ్య వయసున్న 2.49 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది.

♦ జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల్లో రూ.20,020 కోట్లు (35 శాతం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వాటాగా ఉంది.

రాష్ట్రం పచ్చతోరణం 

రాష్ట్రంలో 26 శాతం ఉన్న హరిత విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని ప్రభుత్వం పని చేస్తోంది. జగనన్న పచ్చ తోరణం కింద 2022-23లో 3.05 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ఐఎస్‌ఎఫ్‌ఆర్‌-2021 (ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ రిపోర్ట్‌) నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణాన్ని 646.9 చ.కి.మీ మేరకు పెంచడంలో ఆంధ్రప్రదేశ్‌  మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు 2023-24లో రాష్ట్రంలోని 23 ప్రదేశాలలో నగరవనాలు/దేవాలయ ఎకో పార్కులను అభివృద్ధి చేయనుంది.

స్వచ్ఛ భారత్‌ సంకల్పానికి నిదర్శనం 

♦ క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌) ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాల సేకరణ, నిర్వహణ కోసం 2022-23లో రూ.220.82 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో 70 శాతం మేర ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.417.76 కోట్లతో ప్రతి మండలంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నివారణ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది.

♦ ప్రభుత్వ చర్యలతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరిలో విశాఖ, విజయవాడ, తిరుపతి మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. 

♦ విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ ‘క్లీనెస్ట్‌ స్టేట్‌/నేషనల్‌ క్యాపిటల్‌’ అవార్డు, 10-40 లక్షల జనాభా కేటగిరిలో విశాఖపట్నం ‘క్లీన్‌ బిగ్‌ సిటీ’ అవార్డు, సౌత్‌ జోన్‌ (50,000 నుండి ఒక లక్ష జనాభా) కేటగిరీలో పులివెందులకు ‘ఇన్నోవేషన్‌ - బెస్ట్‌ ప్రాక్టీసెస్‌’ కింద అవార్డులు లభించాయి. మిలియన్‌ ప్లస్‌ ­సిటి కేటగిరీలో విశాఖపట్నం ‘టాప్‌ ఇంపాక్ట్‌ క్రియేటర్‌’ సిటీగా నిలిచింది.

ఉపాధి నైపుణ్యాల పెంపు

♦ ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే ఉపాధి నైపుణ్యాల పెంపుపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 45,871 కాంట్రాక్టు, 3.72 లక్షల అవుట్‌­సోర్సింగ్‌/ఇతర ఉద్యోగాలు కలిపి మొత్తం 6.31 లక్షల ఉద్యోగాలు కల్పించింది. 

♦ అవుట్‌­ సోర్సింగ్‌/ గౌరవ వేతన ఆధారిత ఉద్యోగుల జీతాలు పెంచి, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమమ్‌ టైం స్కేల్‌­ను అందిస్తోంది. 25 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో 2 దశలలో వైఎస్సార్‌ బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల పేరుతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నైపుణ్య విశ్వవిద్యాలయాలు, జిల్లాల్లో నైపుణ్య కేంద్రాలను నెలకొల్పనుంది.

 

నేరుగా వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ 

♦ విద్యుత్‌ రంగంలో.. విద్యుత్‌ ఖర్చును తగ్గించి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎస్‌ఈసీఐతో ఒప్పందం చేసుకుంది. కృష్ణపట్నంలో దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌­కు సంబంధించి 800 మెగావాట్లు, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌­కు సంబంధించి 800 మెగావాట్ల పనులను పూర్తి చేసింది. 

♦ రైతులకు స్మార్ట్‌ మీటర్లు బిగించి పారదర్శకంగా నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందిస్తోంది. డీబీటీ విధానం ద్వారా వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

రీ సర్వే అద్భుతం

17,584 గ్రామాల్లో సమగ్ర రీ సర్వేను చేపట్టిన రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 2000 గ్రామాల్లో 4,38,899 మంది ఆస్తి యజమానులకు ‘శాశ్వత భూ హక్కు పత్రాలు’ పంపిణీ అయ్యాయి. ఈ విషయమై నీతి ఆయోగ్‌ నుంచి ప్రశంసలు అందుకుంది. 

రాజకీయ సాధికారతో సామాజిక న్యాయం

♦ మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం పదవులను, రెండో విడతలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించాం. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో (80 శాతం) నాలుగు పోస్టులను వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం. 

♦ 13 జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవుల్లో తొమ్మిదింటిని (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్‌ పదవులు, పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ్ చట్టం చేశాం. ఇందులో భాగంగా 137 వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టులలో (58 శాతం) వీరినే కూర్చోబెట్టాం. 

♦ 56 బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ, ఒక ఎస్టీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వెనుబడిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టింది. ‘జగజ్జీవన జ్యోతి’ పథకం కింద 15.14 లక్షల ఎస్సీ, 4.5 లక్షల ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌­ను అందిస్తున్నాం.

 

ఇంకా ఎన్నెన్నో..


♦ వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల సంఖ్యను 26కు, రెవెన్యూ డివిజన్‌లు 76కు, పోలీసు డివిజన్లను 108కి పెంచాం. 1956 తర్వాత తొలిసారి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.  

♦  ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం అమలు చేస్తున్నాం. దీనికి నీతి ఆయోగ్‌ ప్రసంశలు లభించాయి.  

♦ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో సచివాలయ స్థాయిలో పరిష్కరించడానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశాం. 

♦  9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్‌ పంపిణీ చేస్తున్నాం.  

♦ నేరాల నియంత్రణలో భాగంగా తీసుకున్న వినూత్న పోలీసింగ్‌ చర్యలు శాంతియుత వాతావరణానికి దోహదపడ్డాయి. మహిళల భద్రత, రక్షణకు దిశ బిల్లు తెచ్చాం.  

♦ రాష్ట్రాన్ని మరింత పటిష్టంగా, శక్తివంతంగా చేయడానికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తాం.

♦ రాష్ట్రం ఎగుమతుల్లో 2019-20లో 7వ ర్యాంకులో ఉంది. 2020-21 నాటికి 16.08 బిలియన్‌ డాలర్లతో నాల్గవ ర్యాంకుకు చేరుకుని మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జాతీయ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాను అందిస్తోంది. దీనిని 2030 నాటికి 10 శాతానికి పెంచేలా ప్రణాళిక రూపొందిస్తోంది.

♦ రూ.4,994 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ రోడ్లు ప్రాజెక్టు చేపట్టాం. గత ఏడాది పీఎంజీఎస్‌వై కింద రూ. 502 కోట్ల వ్యయంతో 992 కిలోమీటర్ల తారు రోడ్లు వేశాం. ఈ ఏడాది 1,236 కిలోమీటర్లు మేర 174 రోడ్లను, 21 వంతెనలను పూర్తి చేయనున్నాం.

♦ రూ.2,173 కోట్ల వ్యయంతో 5,181 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు ప్రభుత్వం చేపట్టింది. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సహాయంతో రూ.3,013 కోట్ల అంచనా వ్యయంతో 1,260 కిలోమీటర్ల రోడ్ల పనులు నడుస్తున్నాయి.

 ♦ దేశంలో ఎక్కడా లేని విధంగా వందేళ్ల తర్వాత అత్యాధునిక సాంకేతికత సాయంతో గ్రామాల్లో రీసర్వే చేస్తోంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
United Nations
small grains
Abdul Nazir
Assembly budget meetings
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వాతావరణ మార్పులతో ముప్పు: ఐరాస 

వాతావరణ మార్పులతో ముప్పు: ఐరాస 

సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు

సెలవిక సమ్మర్‌కు సరదాగా స్కూల్‌కు

యుద్ధభూమిలో... జెండర్‌ పోరాటం

యుద్ధభూమిలో... జెండర్‌ పోరాటం

డేటా సెంటర్లు..నీటి జలగలు!

డేటా సెంటర్లు..నీటి జలగలు!

లెక్కల్లో దాగుడుమూతలు

లెక్కల్లో దాగుడుమూతలు

అధిక సంతానంపై ప్రేమ!

అధిక సంతానంపై ప్రేమ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.