Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు'
ADVERTISEMENT 

ఇష్టారాజ్యంగా 'సర్దుబాటు'

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 20, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
transfer.jpg

సాంకేతిక విద్యలో నిబంధనలు కాలరాస్తూ లెక్చరర్ల బదిలీలు

జోన్లు, రీజియన్లు మార్చేసి 200 మందిని బదిలీ చేసిన ప్రభుత్వం

తిరుపతి జిల్లా వారికి విజయనగరంలో పోస్టింగ్‌

ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కోర్టును ఆశ్రయించిన పలువురు లెక్చరర్లు!

పాలిటెక్నిక్‌ కాలేజీల్లో కుంటుబడిన బోధన

పాఠశాల విద్యలాగే సాంకేతిక విద్యలోనూ ప్రమాణాలను దిగజారుస్తున్న కూటమి ప్రభుత్వం  

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో ఇష్టానుసారంగా బదిలీలు చేపట్టి బోధనను నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఇదే విధానాన్ని సాంకేతిక విద్యలోనూ అమలు చేసింది. సర్దుబాటు బదిలీల పేరుతో లెక్చరర్లను ఏకంగా రీజియన్లు దాటించేసింది. దీంతో దాదాపు 20 రోజులైనా లెక్చరర్లు.. తాము బదిలీ అయిన స్థానాలకు వెళ్లకపోవడంతో పాలిటెక్నిక్‌ కాలేజీల్లో బోధన కుంటుబడింది. 

జోన్‌ స్థాయిలో చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను ఏకంగా రీజియన్లను దాటించేయడంతో పలువురు లెక్చరర్లు సాంకేతిక విద్య ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయగా.. మరికొందరు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.

అక్టోబర్‌లో చేపట్టాల్సిన సర్దుబాటు ప్రక్రియను డిసెంబర్‌లో చేపట్టడమే కాకుండా.. సాంకేతిక విద్య డైరెక్టరేట్‌ చేపట్టిన సర్దుబాటు బదిలీలు సైతం సక్రమంగా లేకపోవడంతో లెక్చరర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 200 మంది లెక్చరర్లను బదిలీ చేయగా.. సగం మందికి పైగా పోస్టుల్లో చేరకపోవడం గమనార్హం.   

ఫిర్యాదు చేసిన వారికి బెదిరింపులు! 
పాలిటెక్నికల్‌ కాలేజీల్లో కాంట్రాక్టు లెక్చరర్ల కాలపరిమితి అక్టోబర్‌తో ముగిసింది. అలాగే గతంలో ఇచి్చన డిప్యుటేషన్లు కూడా పూర్తయ్యాయి. నవంబర్‌లో తరగతులు ప్రారంభమయ్యేలోగా సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాలి. అంటే సర్దుబాటు బదిలీలు అక్టోబర్‌లోనే చేపట్టాలి. కానీ సాంకేతిక విద్య డైరెక్టరేట్‌ అధికారులు ఈ నెల మొదట్లో పాలిటెక్నిక్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌పై తాము చెప్పిన విధంగా వర్క్‌లోడ్‌ నివేదిక తెప్పించుకున్నారు.

వెంటనే 2వ తేదీన ఆఘమేఘాలపై దాదాపు 200 మందిని సర్దుబాటు బదిలీ చేశారు. ఈ పోస్టులను జోన్‌ స్థాయిలోనే సర్దుబాటు చేయాలి. కానీ రీజియన్లను మార్చేయడంపై లెక్చరర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర వర్సిటీ రీజియన్‌లోని తిరుపతి జిల్లా చంద్రగిరి పాలిటెక్నిక్‌ కాలేజీలో పనిచేస్తున్న ఓ లెక్చరర్‌ను.. ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్‌లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి పాలిటెక్నిక్‌ కాలేజీకి, మరొకరిని అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కాలేజీకి బదిలీ చేశారు. 

వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించారు. అయితే, 60 కి.మీ పరిధిలో చేపట్టాల్సిన సర్దుబాటును ఏకంగా 900 కి.మీ దూరానికి చేయడంతో బాధితులు తమ పోస్టుల్లో చేరకుండా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయం తెలిసిన సాంకేతిక విద్య డైరెక్టరేట్‌ సిబ్బంది.. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించినట్లు సమాచారం. దీంతో కొందరు బాధిత లెక్చరర్లు హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిసింది.   

కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితి మరీ ఘోరం
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల పరిస్థితిని మరీ దారుణంగా మార్చేశారు. వీరికి వారంలో రెండు, మూడు రోజులు ఒక కాలేజీ చొప్పున విధులు వేస్తుండడం గమనార్హం. ఇలా వారంలో రెండు, మూడు కాలేజీలు మారుస్తుండడంతో వారు ఏ కాలేజీ­లో పనిచేస్తున్నారో తెలియని దుస్థితి నెలకొంది. వీరిని కూడా గుంటూరు నుంచి పాడేరుకు, చీపురుపల్లికి బదిలీ చేయడం విమర్శలకు దారి తీసింది. 

ఈ ప్రక్రియతో అకడమిక్‌ పరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తాయని లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైలెవల్‌ కమిటీ చేపట్టాల్సిన సర్దుబాటు బదిలీలను.. కిందిస్థాయి సిబ్బందే నివేదిక తయారు చేయడం, దాన్నే డైరెక్టర్‌ ఆమోదించడంతో సమస్యలు వచ్చాయని సమాచారం. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
lecturer
transfers
technical education
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.