Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. జీవో నంబర్‌ 1లో నిషేధమనే పదమే లేదు
ADVERTISEMENT 

జీవో నంబర్‌ 1లో నిషేధమనే పదమే లేదు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 12, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
go1.jpg

ఏఎన్‌యూ: ప్రజల ప్రాణాలు, జీవితాలను కాపా­డేం­దుకు రోడ్లపై బహిరంగ సభల విషయంలో నియంత్రణ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణ­యాన్ని మేధావుల ఐక్యవేదిక కొనియాడింది. జీవో నంబర్‌ 1లో బహిరంగ సమావేశాలు నిషేధమనే పదమే లేదని వక్తలు గుర్తు చేశారు. నియంత్రణకు, నిషేధానికి చాలా వ్యత్యాసం ఉందనేది గుర్తించాలని సూచించారు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. ప్రజా సంరక్షణ చర్యలు చేపట్టడం పాలకుల కనీస బాధ్యతనే విషయం మరి­చిపోకూడదన్నారు.



ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం అమల్లోకి తెస్తే దానిపై అవగాహన కల్పించడం మీడియా బాధ్యత అని తెలిపారు. ఇలా కాకుండా ప్రభుత్వ నిర్ణయాలను భూతద్దంలో చూపుతూ.. ఇవి ప్రజలకు నష్టమన్నట్టు ప్రచారం చేయడం సరి­కాదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని.. ఇత­రుల హక్కులు, స్వేచ్ఛ, ప్రాణాలను హరించకూడ­దని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వుల ఆవశ్యకత, ఇందులోని అంశాలపై విద్యావేత్తలు, మేధావులు సమాజానికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.



అలాగే పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు కూడా స్పందించాలని కోరారు. మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్‌యూ)­లో బుధవారం జీవో నంబర్‌ 1పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వక్తలు ఏమన్నారంటే..

రాజకీయ కోణంలో చూడకూడదు..

సామాన్యుల ప్రాణాలు పరి­రక్షించేందుకు ప్రభు­త్వం జారీ చేసిన ఈ ఉత్త­ర్వులను రాజకీయ­కోణంలో చూడటం సరికాదు. తొక్కిసలాటల్లో 11 మంది ప్రాణాలు పోతే ప్రభుత్వం స్పందించకుండా ఎలా ఉంటుంది? కందుకూరు, గుంటూరు ఘటనలపై పౌరహక్కులు, దళిత సంఘాలు కూడా స్పందించకపోవడం విచారకరం. ఇదే ఘటన అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో జరిగితే అక్కడ సమాజ­మంతా గొంతెత్తేది. మరణించిన వారికి కనీసం సంతాప సభ కూడా నిర్వహించకపోవడం హర్షణీ­యమా? కనీసం భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగనీయబోమని ప్రకటించకుండా యధా­విధిగా సభలు, సమావే­శాలు నిర్వహించడం సరైన పనేనా? ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయంపై మేధా­వులు సమాజానికి అవగాహన కల్పించాలి.

–ఆచార్య పి.రాజశేఖర్, వీసీ, ఏఎన్‌యూ



మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం..

సమాజానికి ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ ఉత్తర్వులపై సమాజానికి అవగాహన కల్పించడం విద్యావేత్తలు, మేధావుల బాధ్యత. ప్రభుత్వ ఉత్తర్వులపై మేధావుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరిన్ని సదస్సులు నిర్వహించి అవగాహన కల్పిస్తాం.

–ఆచార్య శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపాల్, ఆర్కిటెక్చర్‌ కళాశాల, ఏఎన్‌యూ 

ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయని గుర్తించాలి..

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆసక్తి ఉన్నవారు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు. కానీ ఆ నిర్ణయమే తప్పంటే ఎలా? ప్రభుత్వ ఉత్తర్వులు అందరికీ వర్తిస్తాయనేది గుర్తించాలి.  

–ఆచార్య బి.కరుణ, రిజిస్ట్రార్, ఏఎన్‌యూ



ప్రభుత్వ చర్యను అందరూ హర్షించాలి..

సమాజంలోని పౌరులందరి హక్కులు, స్వేచ్ఛ కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. ప్రజాప్రయో­జనాల కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను అందరూ హర్షించాలి.

– ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రెక్టార్, ఏఎన్‌యూ



ఎవరికీ ఇబ్బంది లేనిచోట నిర్వహించుకోవాలి..

ఎవరికీ ఇబ్బంది లేనిచోట బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలి. అసలు సమా­వేశాలే నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేస్తే ఇబ్బంది కానీ ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా జరుపుకోండంటే తప్పెలా అవుతుంది? 

– ఆచార్య కె.సునీత, ఓఎస్‌డీ, ఏఎన్‌యూ



ఈ జీవోతో ఇబ్బందులేమీ లేవు..

జీవో నంబర్‌ 1తో ఇబ్బందులేమీ లేవు. దీని­లోని వాస్తవాలను అందరూ గ్రహించాలి. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడే చర్యలను ఎవరు చేపట్టినా హర్షించాలి.

–ఆచార్య కె.మధుబాబు, డీన్, సీడీసీ, ఏఎన్‌యూ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Government of Andhra Pradesh
intellectuals
Civil society
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

నివారించదగినవే అయినా...

నివారించదగినవే అయినా...

డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్‌ గోల.. యూటర్నే శరణ్యం

డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్‌ గోల.. యూటర్నే శరణ్యం

చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!

చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!

ఎన్‌పీఎస్‌పీఎల్‌కు నజరానా

ఎన్‌పీఎస్‌పీఎల్‌కు నజరానా

వరుసగా మూడో బడ్జెట్‌లోనూ అన్నదాతకు మొండిచెయ్యే

వరుసగా మూడో బడ్జెట్‌లోనూ అన్నదాతకు మొండిచెయ్యే

పెండింగ్‌లో ‘పోలీస్‌’ ఫైల్‌!

పెండింగ్‌లో ‘పోలీస్‌’ ఫైల్‌!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.