Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కొడవలి.. బతుకు వారధి
ADVERTISEMENT

కొడవలి.. బతుకు వారధి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 27, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
1123.jpg

మూడు తరాలుగా కొడవళ్ల తయారీ 

నడకుదురులో పలు కుటుంబాలకు ఇదే వృత్తి

ఉమ్మడి తూర్పు గోదావరితో పాటు పలు జిల్లాలకు ఎగుమతులు

వ్యవసాయ సీజన్‌లో రైతుల అడుగులు ఆ గ్రామం వైపే..  

కణకణ మండే అగ్ని కీలల నుంచి ఎగసిపడే నిప్పురవ్వలు.. పిడికిళ్లు బలంగా బిగించి మలాటు(పెద్ద సుత్తి వంటి సాధనం)లతో ఇనుప కమ్మెలపై కార్మికులు గట్టిగా కొడుతున్న శబ్దాలు ఆ ఊళ్లో సర్వసాధారణం. ముఖ్యంగా వ్యవసాయ సీజన్‌లో రైతన్నకు ఉపయోగపడే కొడవళ్లతో పాటు, ఇతర పనిముట్ల తయారీలో రేయింబవళ్లు శ్రమిస్తూంటుంది నడకుదురు గ్రామం.  

కాకినాడ సిటీ: వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైందంటే ఎక్కువ మంది రైతుల అడుగులు నడకుదురు గ్రామం వైపే పడతాయి. కాకినాడ సిటీకి కూతవేటు దూరాన.. కరప మండలంలో ఉన్న ఈ ఊరు పంట కోతలకు అవసరమైన కొడవళ్ల తయారీకి పెట్టింది పేరు. వరి, మినుముతో పాటు, గడ్డి కోతలకు అవసరమైన కొడవళ్లను, ఇతర పనిముట్లను నడకుదురు గ్రామంలో తయారు చేస్తూంటారు. సుమారు 80 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కొడవళ్ల తయారీ ప్రారంభమైంది. 

ప్రస్తుతం నాణ్యమైన కొడవళ్లను నైపుణ్యంతో తయారు చేయడంలో మూడో తరం కార్మికులు నిమగ్నమై ఉన్నారు. ఈ గ్రామంలో 4 కుటుంబాలకు చెందిన వారు 46 మందికి పైగా ఐదుకు పైగా కొలుముల్లో పని చేస్తున్నారు. నడకుదురులో తయారైన కొడవళ్లు తెలుగు రాష్ట్రాల నలుమూలలకూ సరఫరా అవుతున్నాయి. అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు సై­తం ఇక్కడి కొడవళ్లు ఎగుమతి అవుతున్నాయి. 

గిట్టుబాటు కాక.. 
కొడవళ్ల తయారీకి ఉపయోగించే బేల్‌ బద్దలను రాజమహేంద్రవరం, మండపేట, విశాఖపట్నంతో పాటు విజయవాడ తదితర ప్రాంతాల నుంచి  కిలోల లెక్కన కొనుగోలు చేసి, దిగుమతి చేసుకుంటారు. ఏటా ముడి సరకు ధరలు పెరుగుతున్నా కొడవళ్ల ధరలు పెరగడం లేదు. బేల్‌ బద్దల లోడు గత ఏడాది రూ.58 వేల నుంచి రూ.60 వేలు ఉండగా ఈ సంవత్సరం రూ.65 వేలకు పెరిగింది. దీంతో పాటు కొడవలి తయారీకి అవసరమైన బొగ్గులు, చెక్కతో పాటు రవాణా చార్జీలు కూడా పెరుగుతున్నాయి. 

తమ శ్రమ వృథా అవుతోందని, వస్తున్న డబ్బులు గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. తయారైన కొడవళ్లకు అ­మర్చేందుకు చెక్కతో చేసిన పిడులు అవసరమవుతా­యి. ఈ పిడులు తయారు చేసేందుకు గతంలో గ్రామంలోనే ప్రత్యేకంగా కార్మికులుండేవారు. వేరే ఉపాధి అవకాశాలతో కొంత మంది, శ్రమకు తగిన ఫలితం దక్కక మరి కొంతమంది ఈ వృత్తికి దూరమయ్యారు. 

కొలిమిలో కాలి.. కొడవలిగా మారి.. 
కొడవళ్లు తయారు చేసే కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుంటూంటారు. తొలుత ముడి ఇనుప బద్దీలను కొలిమిలో ఎర్రగా కాలుస్తారు. అనంతరం, ఆ ఇనుప బద్దలను మలాటులతో బలంగా కొట్టి, కొడవలి ఆకృతిలోకి మలుస్తారు. ఆ తర్వా­త దానికి సాన పట్టి, నొక్కులు కొట్టి, చెక్క పిడులు అమరుస్తారు. ఒక్కో కొలిమిలో రోజుకు సుమారు 200 కొడవళ్లు తయారు చేస్తూంటారు. వీటిని రూ.­40, రూ.60, రూ.80, రూ.120 ధరల్లో నాణ్య­తా ప్రమాణాలు పాటిస్తూ తయారు చేస్తారు. 

గతంలో నడకుదురు గ్రామంలో సీజన్‌లో 80 వేల­కు పైగా కొడవళ్లు తయారు చేసేవారు. ప్రస్తు­తం వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ పెరగడంతో కొడవళ్లకు గిరాకీ తగ్గింది. దీంతో ఈ కార్మికులు వ్యవసాయ, ఇంటి పనులకు ఉపయోగించే గునపాలు, పారలు, కత్తిపీటల వంటి వాటితో పాటు పంచాయతీ కార్మికులు వినియోగించే వివిధ రకాల వస్తువులు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

యాంత్రీకరణతో తగ్గిన డిమాండ్‌ 
వ్యవసాయంలో కొన్నేళ్లుగా పెరుగుతున్న యాంత్రీకరణ కొడవళ్ల తయారీపై కొంత మేర ప్రభావం చూపింది. గతంలో నడకుదురు నుంచి వేలాదిగా కొడవళ్ల అమ్మకాలు జరిగేవి. ప్రస్తుత్తం వీటికి డిమాండ్‌ బాగా తగ్గిందని, దీంతో పని వారు కూడా రావడం లేదని తయారీదార్లు చెబుతున్నారు. తమ కార్ఖానాల్లో ఏడాదంతా కొడవళ్లు తయారు చేసినా.. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైన నాలుగు నెలలూ పని ఒత్తిడి అధికంగా ఉండేదని అంటున్నారు. 

ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గిందని, దీంతో ఉపాధి తగ్గి, తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమకు వివిధ రకాల సంక్షేమ పథకాలతో ఆర్థికంగా ఆదుకొనేవారని, ప్రస్తుత ప్రభుత్వం ఆవిధంగా ఆదుకోకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు. 

సబ్సిడీపై రుణాలివ్వాలి 
గతంతో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితులు ఎంతగానో మారిపోయాయి. నాటికి, నేటికి ముడి సరకుల ధరల్లో ఎంతో వ్యత్యాసం ఉంది. మేము చేసే కొడవళ్లకు గిరాకీ ఉన్నా.. గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రభుత్వం మాపై దృష్టి సారించి, కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలి. సబ్సిడీపై రుణాలు అందించడంతో పాటు ముడి వస్తువులకు సబ్సిడీ కూడా ఇవ్వాలి.  
– కణిత నాగేశ్వరరావు, కొడవళ్ల తయారీదారు, నడకుదురు 

నాణ్యత పాటిస్తాం 
నడకుదురులో మా మూడు కుటుంబాలకు చెందిన వారు కొడవళ్ల తయారీలో నిరంతరం శ్రమిస్తూంటారు. నాణ్యమైన ముడి ఇనుమును ఉపయోగించటంతో పాటు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కొడవళ్లు తయారు చేస్తాం. దీంతో అవి ఎక్కువ కాలం రైతులకు ఉపయోగపడతాయి. అందువల్లనే మా నడకుదురు కొడవళ్లకు మంచి పేరు ఉంది. పంట కోత యంత్రాలు రావడంతో కొన్నాళ్లుగా కొడవళ్లకు డిమాండ్‌ తగ్గింది. 
– కణితి రాంబాబు, కొడవళ్ల తయారీ కార్మికుడు, నడకుదురు  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
Farming
Farmers
sickle
kakinada
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.