Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కట్టెడు దుఖం
ADVERTISEMENT

కట్టెడు దుఖం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 6, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
Wood-Stove.jpg

మన్యంలో పొగబారుతున్న విద్యారంగం 

పాఠశాలల్లో కట్టెల పొయ్యిలే దిక్కు 

గ్యాస్‌ సిలిండర్ల మాటే లేదు 

వంట చేసే వారికి అవస్థలు

విద్యార్థులకు వడ్డించే ఆహారం తయారీకి మన్యంలో ఇంకా కట్టెల పొయ్యిలనే వినియోగిస్తున్నారు. తరగతి గదుల పక్కనే వంటలు చేయడంతో పొగతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఏళ్లకాలంగా పరిస్థితిలో మార్పురాక పొగమాటున విద్యాభ్యాసం సాగుతోంది. చంద్రబాబు సర్కారులో విద్యారంగానికి గ్రహణం పట్టింది. ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్టు తయారైంది. వంట తయారు చేసే వారికి ‘కట్టె’డు దుఖం మిగులుతోంది.  

రంపచోడవరం: ఎన్నో ఆశల నడుమ కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని అందరూ భావించారు. కానీ ఇక్కడ వి ద్యార్థుల కష్టాలు తీర్చే నాథుడే లేకపోయారు. పాఠశాలలు, వసతి గృహాల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జిల్లాలో 79 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 16,238 మంది విద్యా ర్థులు చదువుతున్నారు. ఇక 15 వసతి గృహాల్లో 1,281 మంది విద్యను అభ్యసిస్తున్నారు. అయితే జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో కట్టెల పొయ్యిలపైనే విద్యార్థులకు భోజనాలను తయారు చేస్తున్నారు. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు గ్యాస్‌ సిలిండర్లను ఉయోగించి వంటలు చేసుకుంటున్నా, ఇక్కడ మాత్రం ఇంకా కట్టెల పొయ్యిలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏళ్ల కాలంగా ఈ పరిస్థితి ఉంది.  

కంట్లో పొగ.. ఇదో సెగ 
పాఠశాలల భవనాల పక్కనే కట్టెల పొయ్యిపై విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. వంట సమయంలో వెలువడుతున్న పొగతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉన్నా ఉన్నతాధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. పొగ కారణంగా చదువులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వంట షెడ్లను నిర్మించకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. చాలా చోట్ల తరగతి గదులకు దగ్గరలోనే వంట చేయడంతో విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని ఐటీడీఏల పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు గ్యాస్‌ సరఫరా చేయడం లేదు. అన్ని చోట్లా కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. 

ఇష్టారాజ్యం 
వంట కోసం గ్యాస్‌ అందించాలని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే నాలుగో తరగతి ఉద్యోగులు  కోరుతున్నా, ఫలితం లేకుండా పోతోంది. కట్టెల పొయ్యి కారణంగా పొగచూరి ఆహార పదార్థాలకు పట్టడంతో ఒక్కోసారి తినడానికి ఇబ్బందిగా ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. గతంలో ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేశారు. కొన్ని నెలలు తర్వాత ఎక్కడా అవి కనిపించలేదు.

కనీసం ఆయా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో గ్యాస్‌ సిలిండర్లకు సంబంధించిన లెక్కలే లేవు. కాగా.. ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలకు సంబంధించిన ఖాళీ గోనె సంచులు, విద్యార్థులు ఉపయోగించి, పాడైన ఐరన్‌ పెట్టెలు, పాత పుస్తకాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఫలసాయం డబ్బులను ట్రెజరీ ద్వారా గిరిజన సంక్షేమ శాఖ పద్దులో జమ అయ్యేటట్లు బ్యాంకు ద్వారా చెల్లించాలి. కానీ ఎక్కడా ఇదీ జరగడం లేదు. తమ ఇష్టారాజ్యంగా వార్డెన్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

ప్రతిపాదనలు పంపించాం 
ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో గ్యాస్‌పైనే వంట చేసే విధంగా సిలిండర్ల సరఫరాకు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌కు ఇక్కడి పరిస్థితిపై నివేదిక అందజేశాం. ప్రస్తుతం అన్ని చోట్లా గ్యాస్‌ సరఫరా చేసేందుకు అవకాశం ఉంది. జీసీసీ ద్వారానే గ్యాస్‌ సరఫరా చేసే అంశాలను ఆలోచన చేస్తున్నాం. 
– రుక్మాంగదయ్య, డీడీ, రంపచోడవరం

ఇబ్బంది పడుతున్నాం 
ఎంపీపీ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండేందుకు నెలకు ఒక్క సిలిండర్‌ మాత్రమే ఇస్తున్నారు. దీంతో రెండు వారాలకే అది ఖాళీ అవుతోంది. ఆ తర్వాత కట్టెల పొయ్యిపైనే వంట చేయాలి. కట్టెల పొయ్యిపై వంట చేయడం వలన పొగ వచ్చి ఇబ్బంది పడుతున్నాం. నెలకు సరిపడా గ్యాస్‌ సిలిండర్లు సరఫరా చేస్తే బాగుంటుంది. – లక్షి్మ, వంటమనిషి, ఎంపీపీ స్కూల్, ఎర్రంపాలెం

పొగతో ఆరోగ్యానికి ముప్పు 
ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు కట్టెల పొయ్యిపై వంట చేసి భోజనం పెడుతున్నాం. దీని వల్ల పొగతో చాలా ఇబ్బంది పడుతున్నాం. కళ్లు పాడైన వారు, ఊపిరితిత్తులు పాడైన వారు కూడా ఉన్నారు. కట్టెల పొయ్యిపై వంట చేసే బాధను తప్పించాలి.   – జమయమ్మ, ఆశ్రమ పాఠశాల, గంగవరం 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Students
Food processing
Wood stove
preparing
meals
Andhra Pradesh
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.