Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. AP Floods: పట్టెడన్నం కోసం పరితపిస్తూ..
ADVERTISEMENT 

AP Floods: పట్టెడన్నం కోసం పరితపిస్తూ..

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 10, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
256.jpg

ఆహారం, తిండి, తాగునీటి కోసం ఎదురు చూస్తున్న వరద బాధితులు 

ట్రాక్టర్, కారు ఏదొచ్చినా ఆహారం పొట్లాలు 

ఇచ్చేందుకేననే ఆతృతతో వాటిచుట్టూ పరుగులు

జక్కంపూడి, ఆంధ్రప్రభ కాలనీల్లో దయనీయ పరిస్థితులు 

ముంపు నుంచి కోలుకునే వరకు ప్రభుత్వమే ఆహారం అందించాలని వేడుకోలు

పటమట/చిట్టినగర్‌ (విజయవాడ): బుడమేరు వరద ముంచెత్తడంతో కట్టుబట్టలతో బయటపడి ప్రాణాలను కాపాడుకున్న జక్కంపూడి కాలనీ, ఆంధ్రప్రభ కాలనీ ప్రజలు ఆహారం అందక అలమటిస్తున్నారు. సర్వం కోల్పోయిన వారంతా తిండి, తాగునీరు, పాల కోసం అర్రులు చాస్తున్నారు. ట్రాక్టర్, కారు వంటి వాహనం ఏది వచ్చిన ఆహారం పొట్లాలు ఇచ్చేందుకు వచ్చాయని భావించి వాటివెంట పరుగులు పెడుతున్నారు. జక్కంపూడి కాలనీలో సోమవారం ఉదయానికి కాలనీలో వరద నీరు అడుగు మేర తగ్గింది. బాధితులు తమ ఇళ్లు, దుకాణాలు శుభ్రం చేసుకుంటూ భోజనం కోసం ఆతృతగా ఎదురు చూశారు.

ఉదయం ఆల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం కూడా అందకపోవడంతో కాలనీ వాసులు రోడ్డెక్కారు. కాలనీలోకి ట్రాక్టర్, కారు వచ్చినా అందులో తమ కోసం భోజనం తీసుకొచ్చారేమోనని భావిస్తూ ఆతృతతో ఆ వాహనాలను చుట్టుముడుతున్నారు. దాతలు ఇచ్చే ఆహారం కోసం సంచులు పట్టుకుని పిల్లలతో కలిసి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేసినా అవి తాగేందుకు ఉపయోగించవద్దని ముందుగానే కార్పొరేషన్‌ అధికారులు మైక్‌లో ప్రచారం చేయడంతో వాటర్‌ బాటిళ్ల కోసం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం నుంచి స్వచ్ఛంద సంస్థలు సైతం తమ సేవలను నిలిపివేశాయి.


జక్కంపూడి కాలనీలో కారు వెంట పరుగులు పెడుతున్న వరద బాధితులు 

ఒకటి, రెండు స్వచ్ఛంద సంస్థలు కాలనీ వాసులకు భోజనం అందించేందుకు రాగా మహిళలు, యువకులు ఆహార పదార్థాలు తీసుకొచ్చిన వాహనాలను చుట్టుముట్టి కదలనివ్వడం లేదు. సోమవారం కాలనీ మెయిన్‌ రోడ్డులో నివాసం ఉండే వారికే ఆహారం అందింది. శివారు ప్రాంతాలతో పాటు బుడమేరు కాలువకు అవతలి వైపున ఉన్న వారికి ఎలాంటి ఆహారం అందలేదు. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు కాలనీలో నివాసం ఉండే కుటుంబాలకు ఆహారం అందించాలని అక్కడి వారంతా వేడుకుంటున్నారు.

ఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితి
ఆంధ్రప్రభ కాలనీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కూలి పనులు, ఆటోలు నడుపుకుంటేనే కానీ పొట్టగడవని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సర్వం కోల్పోయిన తామంతా యాచకుల మాదిరిగా తాగునీరు, ఆహారం కోసం అవస్థలు పడాల్సి వస్తోందని ఈ ప్రాంత పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రభ కాలనీలో పేద, మధ్య తరగతికి చెందిన 600 కుటుంబాల్లో కనీసం రెండు వేల మంది నివాసం ఉంటున్నారు. 

వరద కారణంగా ఉండే వంట సామాగ్రితో, వస్త్రాలు, జీవనో«పాధి కల్పంచే ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు వరదలో కొట్టుకుపోగా.. మరికొన్ని మరమ్మతులకు గురయ్యాయి. మహిళల స్వయం ఉపాధి ఆసరాగా నిలిచే కుట్టు మెషిన్లు, టిఫిన్‌ బండ్లతోపాటు ఇళ్లల్లోని గ్రైండర్లు, మిక్సీలు, గ్యాస్‌ పొయ్యిలు మరమ్మతులకు గురయ్యాయి. ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా దాతలిచ్చే ఆహార పొట్లాలపైనే ఆధారపడ్డారు. పరిస్థితులు చక్కబడ్డాయని భావించి స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఆహారం సరఫరాను చాలా వరకు తగ్గించేశాయి. దీంతో ఆహారం, పాలు, తాగునీరు దొరక్క ఇక్కడి పేదలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ముంపు నుంచి పూర్తిగా తేరుకునే వరకు ఈ రెండు కాలనీల్లోని కుటుంబాలకు ప్రభుత్వమే ఆహారం అందించాలని ముంపు బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

అన్నీ కోల్పోయాం  
ఇదేం వరదో. కనీ­సం ఇంట్లో సామాన్లు సర్దుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. మా కాలనీలోని ప్రతి ఇంట్లో అన్నీ కొట్టుకుపోయాయి. ఆహారం దొరక్క చాలామంది అవస్థలు పడుతున్నారు. పేదలు పూర్తిగా తేరుకునే వరకు ప్రభుత్వమే ఆహారం, పాలు, నీళ్లు అందించాలి. ఇంటిసామగ్రి నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కనీసం రూ.2 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి. 
– వసంత, ఆంధ్రప్రభ కాలనీ  

జగనన్న ఇళ్లపట్టా కూడా కొట్టుకుపోయింది  
మాది చిన్న కుటుంబం. గృహోపకరణాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి. కట్టుబట్టలతో మిగిలాం. ఆధార్, రేషన్, పాన్‌ కార్డులు, పిల్లల బర్త్‌ సర్టిఫికెట్లు, పుస్తకాలతోపాటు జగనన్న ఇచ్చిన ఇంటిపట్టా కూడా కొట్టుకుపోయింది. మా వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. ఇప్పుడు వరద బాధితులకు ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ తీసుకోవాలన్నా కార్డులు అడుగుతున్నారు. మా పరిస్థితి ఏమిటో అర్థం కావటం లేదు. అన్నీ కోల్పోయిన వారి గురించి కూడా ప్రభుత్వం ఆలోచించాలి.  
– వెంకటదుర్గా సూర్యకుమారి, 

ఆంధ్రప్రభ కాలనీ 
అర్థగంటలో అంతా నాశనమయ్యింది. అర్థగంటలో మా జీవితాలన్నీ తారుమారయ్యాయి. ఊహించలేనంత ముప్పు మా ఇంటిలోకి వచ్చింది. మా కష్టం అంతా బుడమేరులో కొట్టుకుపోయింది. మమ్మల్ని ప్రభుత్వమే రక్షించాలి. 
– లక్ష్మీ సరోజ, ఆంధ్రప్రభ కాలనీ 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Vijayawada Floods
Meal
Andhra Pradesh
Budameru
flood effected areas
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.