Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘వల’దన్న చోటా వేట
ADVERTISEMENT 

‘వల’దన్న చోటా వేట

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 7, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
boat.jpg

ఇకపై సముద్ర లోతు జలాల్లోనూ చేపల వేటకు అవకాశం  

గెజిట్‌ విడుదల చేసిన కేంద్ర మత్స్యశాఖ  

సాక్షి, అమరావతి: చేపల వేటే జీవనాధారంగా బతికే మత్స్యకారులకు నిజంగా ఇది శుభవార్త. ఇక నుంచి సముద్ర లోతు జలాల్లోకీ నిశ్చంతగా వెళ్లి వేటాడుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే 200 నాటికల్‌ మైళ్లు (తీరం నుంచి 370 కిలోమీటర్ల) వరకు వెళ్లి వేటాడుకునే వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం గురువారం గెజిట్‌ విడుదల చేసింది.  

ఇప్పటి వరకు లోతు జలాల్లోకి వేటకు వెళ్తే.. 
సముద్ర జలాల్లో తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల(22 కి.మీ.) వరకు రాష్ట్రాల పరిధిలో ఉండగా, ఆ తర్వాత 200 నాటికల్‌ మైళ్ల (370 కి.మీ.) వరకు ఉండే లోతు జలాలు కేంద్ర పరిధిలో ఉంటాయి. ఈ పరిధిని దేశానికి సంబంధించిన ప్రత్యేక ఆర్ధిక మండలి (ఈఈజెడ్‌)గా పరిగణిస్తారు. ఆ తర్వాత అంతా అంతర్జాతీయ జలాలుగా పరిగణిస్తారు. ఇప్పటివరకు మత్స్యకారులు తమ రాష్ట్రాల పరిధిలో 12 నాటికల్‌ మైళ్ల లోపు మాత్రమే చేపలు వేట చేసుకునేందుకు అవకాశం ఉండేది. 

కేంద్ర పరిధిలో ఉండే జలాల్లోకి అనుమతి ఉండేది కాదు.  పొరపాటున లోతు జలాల్లోకి వెళ్తే ఓ వైపు పొరుగు రాష్ట్రాల నుంచి సరిహద్దు సమస్యలు, మరొక వైపు అక్రమంగా లోతు జలాల్లోకి వచ్చారంటూ కోస్టు గార్డు, నేవీ నమోదు చేసే కేసుల్లో ఇరుక్కోవడం వంటి సమస్యలతో గంగపుత్రులు ఇబ్బందిపడేవారు.  

సముద్ర వనరులను సద్వినియోగమే లక్ష్యంగా.. 
ప్రస్తుతం కాలుష్య ప్రభావంతో తీర ప్రాంతంలో మత్స్యసంపద అడుగంటిపోవడంతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆశించిన స్థాయిలో వేట లభించడం లేదు. దీంతో గంగపుత్రులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మత్స్యకారులు వెళ్లిపోతున్నారు. వేటపైనే ఆధారపడి జీవించే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. 

ఈ నేపథ్యంలో ఈఈజెడ్‌ పరిధిలోని సముద్ర వనరులను సమర్థంగా సద్వినియోగం చేసుకోవాలన్న సంకల్పంతో కేంద్రం లోతు జలాల్లో మత్స్యకారుల వేటకు అనుమతినిచి్చంది. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన నియమ, నిబంధనలతో కూడిన గెజిట్‌ విడుదల చేసింది. ఈ నిర్ణయం వేటపై ఆధారపడి జీవనం సాగించే మత్స్య కారులు, మత్స్యకార సహకార సంఘాలకు ఎంతో తోడ్పడనుంది.

స్వీయరక్షణ చర్యలు తప్పనిసరి
అయితే వేటకు వెళ్లే మత్స్యకారులు స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్రం షరతు విధించింది. కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం.. మెకనైజ్డ్, మోటరైజ్డ్‌ బోట్లు తప్పనిసరిగా లైసెన్సు, యాక్సెస్‌ పాస్‌ కలిగి ఉండాలి. ప్రాణ రక్షణ పరికరాలు కలిగి ఉండటంతో పాటు జీపీఎస్‌ ట్రాన్స్‌పాండర్స్‌ అమర్చి ఉండాలి. లైసెన్సులను  కనీసం మూడేళ్ల కాలపరిమితితో జారీ చేస్తారు.

ఈఈజెడ్‌లో చేపల వేటకు సంబంధించిన రాష్ట్రాల మధ్య సరిహద్దు, నిర్వహణా వివాదాల పరిష్కారానికి లైసెన్సులు ఉపకరిస్తాయి. లోతు జలాల్లో వేటాడే మత్స్యకారులు, సహకార సంఘాలకు కేంద్రమే ఆరి్థక, సాంకేతిక మద్దతు అందిస్తుంది. లోతు జలాల్లో ఏదైనా సమస్యలకు గురైతే.. కోస్ట్‌ గార్డు, నేవీ  నుంచి అవసరమైన తోడ్పాటు లభిస్తుంది. కాగా విధ్వంసకర మత్స్యవేట, చిన్న చేపల వేట, అక్రమ, నిషేధించిన, నియంత్రణలో లేని నిషేధిత ప్రాంతాల్లో వేటాడితే మాత్రం కఠిన చర్యలు తప్పవని కేంద్రం తాజా ఆదేశాల్లోహెచ్చరించింది.  

మత్స్యకారులకు వరం
లోతు జలాల్లో వేటాడే అవకాశం కల్పిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్‌ మత్స్యకారులు, మత్స్యకార సహకార సంఘాలకు నిజంగా ఓ వరం. మత్స్యవనరుల సుస్థిరత, జీవ వైవిధ్య పరిరక్షణకు ఇది ఎంతగానో దోహదపడనుంది. సాంకేతిక పద్ధతుల్లో మత్స్య వనరులను సేకరించడం వలన మత్స్య కారులకు ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సముద్ర మత్స్య ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ప్రొసెసింగ్, ఎగుమతికి అవకాశాలు మెరుగుపడతాయి.  –రామ్‌శంకర్‌నాయక్, కమిషనర్, రాష్ట్ర మత్స్యశాఖ 

కేసుల బాధ ఉండదు
ఇప్పటివరకు సముద్రంలో 22 కిలోమీటర్లకు పైబడి లోపలికి వెళ్తే కోస్ట్‌ గార్డ్స్‌ ఆంక్షలు పెట్టేవారు. కేసులు నమో­దు చేసేవారు. తీర ప్రాంతాల్లో మత్స్యసంపద సరిగా పడక డీజిల్‌ ఖర్చులు కూడా రావడం లేదు. ఇప్పుడు 370 కిలోమీటర్లు  లోపలికి వెళ్లే అవకాశం రావడం నిజంగా వరం. ఎక్కువ మత్స్య సంపద వేటాడే అవకాశం లభించింది. జీపీఎస్‌ ట్రాన్స్‌పాండర్స్‌ బిగించడం వల్ల ఎంత లోతు జలాల్లోకి వెళ్లాం, ఎక్కడ మత్స్యసంపద ఎక్కువగా ఉందో తెలుస్తుంది.  – తిరుమాని బలరామ్మూర్తి, మత్స్యకారుడు, కృష్ణా జిల్లా 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
fishermen
Fisheries Department
fishing
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.