Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. లేని నీళ్లతో కనికట్టు
ADVERTISEMENT 

లేని నీళ్లతో కనికట్టు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Apr 24, 2026 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
water.jpg

ఏపీ, తెలంగాణల్లో కొత్త ప్రాజెక్టులతోపాటు పాత ప్రాజెక్టుల విస్తరణ 

భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులకు అనుమతులు తిరస్కరణకు గురికావచ్చు 

సీడబ్ల్యూసీకి కృష్ణాబోర్డు లేఖ 

సాక్షి, అమరావతి: కృష్ణానదీ జలాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేపట్టిన పలు ప్రాజెక్టులపై కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తీవ్ర అభ్యంతరాలను లేవనెత్తింది.  నికర జలాలతో పాటు మిగులు జలాల కేటాయింపుపై కృష్ణానదీ జలాల వివాదాల ట్రిబ్యునల్‌–2 (కేడబ్ల్యూడీటీ–2) విచారణ ఒకపక్క కొనసాగుతుంటే, మరోపక్క ‘ట్రిబ్యునల్‌ ఇంకా కేటాయించని జలాలను ఆధారంగా చేసుకుని’ రెండు రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులను అడ్డగోలుగా నిర్మిస్తున్నాయని,  అలాగే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతున్నాయని బోర్డ్‌ పేర్కొంది.  

ఇలాంటి ప్రాజెక్టులకు భవిష్యత్తులో అంతర్రాష్ట్ర అనుమతులు, పెట్టుబడి అనుమతులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. నీటి లభ్యతతో పాటు అంతర్రాష్ట్ర పర్యవసానాలపై నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇలాంటి ప్రాజెక్టులకి అనుమతుల జారీ విషయాన్ని పరిశీలించడం సైతం భవిష్యత్తులో సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఇలాంటి అనుమతి లేని ప్రాజెక్టులకు అనుమతుల జారీ విషయంలో మార్గనిర్దేశం చేయాలని కేంద్ర జలసంఘాని (సీడబ్ల్యూసీ)కి విజ్ఞప్తి చేసింది.  అలాగే ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు  ఏ మేరకు విస్తరించాలో నిర్థారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 

ఇందుకు గాను ఆయా ప్రాజెక్టులకు గతంలో టీఏసీ (సాంకేతిక సలహా కమిటీ) అనుమతులను ఏ మేరకు జారీ చేశారన్న వివరాలను తమకు అందజేయాలని కోరింది.  ‘కేడబ్ల్యూడీటీ–2 కేటాయింపులు జరిపే వరకు మిగులు జలాల నిర్థారణపై అనిశ్చితి కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ట్రిబ్యునల్‌ కేటాయింపులు జరిపేవరకు  కొత్త ప్రాజెక్టులకు ప్రణాళికల తయారీ, వాటికి అనుమతుల జారీ సరైంది కాదు’ అని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మధింపు విభాగం చీఫ్‌ ఇంజినీర్‌కు లేఖ రాసింది.  

లేఖలో ప్రధానాంశాలు... 
»  ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 85(8)(డీ) ప్రకారం 2014, జూన్‌ 2కి ముందు నిర్మాణం పూర్తైన, నిర్మాణం ప్రారంభించిన ప్రాజెక్టుల నీటి లభ్యతపై కొత్త ప్రాజెక్టు ఎలాంటి దుష్ప్రభావం చూపకూడదు.  

» కేంద్రం 2021 జూలై 15న జారీ చేసిన గజిట్‌ నోటిఫికేషన్‌లోని పెరా 2(ఎఫ్‌), 2(జీ) ప్రకారం .. నిర్మాణంలోని అనుమతి లేని ప్రాజెక్టులతో పాటు విస్తరణకు లోనైన ప్రాజెక్టులకి నిర్దేశిత గడువుల్లోగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. లేనిపక్షంలో వాటి వినియోగాన్ని నిలుపుదల చేయాలి. 

» అయితే ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ వేసిన కేసు న్యాయస్థానం పరిధిలో ఉండడంతో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితిలో కృష్ణా బోర్డు లేదు.  

»  కచ్చితమైన నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టులను నీటి వినియోగం కోసం ఏదైనా నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడం సాధ్యం కాదు.  

»  ఇరు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులు విస్తరణకు లోనైనట్టు బోర్డు పరిశీలనకు వచ్చింది. ఆయా ప్రాజెక్టులకు గతంలో సీడబ్ల్యూసీలోని టీఏసీ జారీ చేసిన అనుమతులకు విరుద్ధంగా  వాటిపై అదనపు ఎత్తిపోతల పథకాలను నిరి్మంచడం, కాల్వల సామర్థ్యం పెంచడం, ఆయకట్టు సామర్థ్యం పెంచడం, ఒక పరీవాహక ప్రాంతం నుంచి మరో పరీవాహక ప్రాంతానికి నీళ్ల తరలించడం వంటి చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రాజెక్టులకు మళ్లీఅనుమతులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.  

»   కొత్త ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు టీఏసీ అనుమతులకు విరుద్ధంగా ఇలా విస్తరణకు గురైన ప్రాజెక్టులను సైతం అనుమతులు లేని ప్రాజెక్టులుగా పరిగణించాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Telangana
Andhra Pradesh
krishna board
KRMB
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

బండి సంజయ్‌ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

18న సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు: కేటీఆర్‌

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.