Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ‘పరీక్ష’ తప్పింది!
ADVERTISEMENT 

‘పరీక్ష’ తప్పింది!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Aug 15, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
schl.jpg

ఎస్సీఈఆర్టీ చర్యలతో గాడితప్పిన పరీక్ష విధానం 

ఎఫ్‌ఏ–1తో తెల్లబోయిన టీచర్లు

కొత్తవిధానంపై అవగాహనకల్పించకుండా అమలు  

అక్షరాలు నేర్చుకునే విద్యార్థులు పదాలు రాయాలనడంపై విస్మయం  

‘ఏ మేధావులు తయారుచేశారో ఈ ఒకటో తరగతి పరీక్ష పేపర్లు! పేరాగ్రాఫ్‌ విని ఇంగ్లిష్ లో ఆన్సర్‌ చేయాలంట. వర్డ్స్‌ రాయాలంట. పదాలు తయారు చేయాలంట. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ పరీక్షలతో ఏం ఉపయోగం? పాఠశాలలో ప్రయోగశాల ఉండాలి తప్ప, పాఠశాలనే ప్రయోగశాలగా మార్చడం పద్ధతి కాదు..’ ఎఫ్‌ఏ–1 ఒకటో తరగతి ఇంగ్లిష్‌ పేపర్‌ తీరుపై ఉపాధ్యాయుల అభిప్రాయం ఇది.  

నాలుగు, ఐదో తరగతి పరిసరాల విజ్ఞానం 8 పేజీల ప్రశ్నపత్రంలో ప్రశ్నలను ‘నాట్‌ కండిషన్‌’తో అడిగారు. డీఎస్సీ పరీక్షకి తయారుచేసిన ప్రశ్నల్లో మిగిలిన వాటిని ఏమైనా ఈ పేపర్లో ఇచ్చారా అన్నట్టుగా ఉన్నాయి ప్రశ్నలు? ఇవి విద్యార్థి సామర్థ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సరిగ్గా అంచనా వేయలేవు..’ మంగళవారం జరిగిన ఈ పరీక్షపై కొందరు సీనియర్‌ ఉపాధ్యాయుల అభిప్రాయం.  

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖ ఈ విద్యాసంవత్సరం అమల్లోకి తెచ్చిన పరీక్ష విధానం ఫెయిలైంది. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు పెట్టిన మొదటి పరీక్ష ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ)–1 ఉపాధ్యాయులకే అర్థంగానిరీతిలో ఉందని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థులకు అసెస్‌మెంట్‌ పుస్తకాలిచ్చి, అన్ని పరీక్షలను వాటిలోనే రాయాలన్న నిబంధన పెట్టారు. పరీక్ష విధానంలో పలు మార్పులు తీసుకొచి్చన రాష్ట్ర విద్య, పరిశోధన, శిక్షణమండలి (ఎస్సీఈఆర్టీ) ఈ పరీక్షలపై అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు అవగాహన కల్పించలేదని చెబుతున్నారు. 

విద్యార్థులు ఒకమార్కు ప్రశ్నలకు ఓఎంఆర్‌ షీట్లపై జవాబులు బబ్లింగ్‌ చేయడం, మరోపక్క వ్యాసరూప ప్రశ్నలకు పుస్తకంలో జవాబులు రాయడం ఒక ఎత్తయితే, పేపర్ల వాల్యూయేషన్‌ ఉపాధ్యాయులకు కొత్త పరీక్ష పెట్టింది.  మొత్తం వాల్యూయేషన్‌ ప్రక్రియను రెండు, మూడురోజుల్లో పూర్తిచేసి ఓఎంఆర్‌ షీట్లను లీప్‌ యాప్‌లో స్కాన్‌చేసి అప్‌లోడ్‌ చేయాల్సి రావడం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తోంది.  

ప్రాథమిక స్థాయిలోనే కఠిన పరీక్ష  
సాధారణంగా ఒకటో తరగతిలోనే అత్యధికమంది విద్యార్థులు అక్షరాలు నేర్చుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కూడా ఈ స్థాయిలోనే ఉంటాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో నేర్చుకునేది చాలా స్వల్పం. కానీ ఒకటో తరతి ఎఫ్‌ఏ–1 ఇంగ్లిష్‌ పరీక్షలో అడిగిన ప్రశ్నలు చూసి ఉపాధ్యాయులే విస్తుపోయారు. ఇందులో 8, 9, 10 ప్రశ్నలకు ఇంగ్లిష్‌ పేరాగ్రాఫ్‌ విని జవాబులు రాయాలన్నారు. అలాగే ఇంగ్లిష్‌ పదం ఇచ్చి దానికి సరిపోయే బొమ్మను కనుక్కునేలా ప్రశ్నలు అడిగారు. రెండో తరగతి ఇంగ్లిష్‌ మొదటిప్రశ్న ఆంగ్లంలోని అచ్చులకు వ్యాకరణం పరీక్షిస్తూ అడిగారు. 

పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు కాకముందే అత్యంత లోతైన సామర్థ్యాలను పరీక్షించేలా ఎస్సీఈఆర్టీ నిపుణులు ప్రశ్నపత్రాలు తయారు చేయడం ఏంటని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 35 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో సగం ప్రశ్నలు విషయపరిజ్ఞాన (అనలైటికల్‌) ప్రశ్నలే కావడంతో ఎలా రాయాలో తెలియక విద్యార్థులు తికమకపడినట్టు తెలిసింది. మరోపక్క ఒకమార్కు జవాబులను ఓఆర్‌ఎం షీట్లపై బబ్లింగ్‌ చేయడం చేతగాక ప్రాథమికస్థాయి విద్యార్థులు పరీక్ష రాయలేకపోయినట్టు సమాచారం. చాలా ప్రశ్నలు సిలబస్‌ నుంచిగాక పూర్తిగాని పాఠ్యాంశాల నుంచి ఇచ్చారని తెలిసింది.  

ఉపాధ్యాయులకూ కఠిన పరీక్షే..  
విద్యార్థులు మొత్తం ఆరు పరీక్షలను అసెస్‌మెంట్‌ పుస్తకంలో రాయాలి. మార్కులను ఉపాధ్యాయులు బబ్లింగ్‌ చేయాలి. అసెస్‌మెంట్‌ బుక్‌లో ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయుడు నివేదిక రాయాలి. విద్యార్థుల జవాబుపత్రాల ఓఎంఆర్‌ షీట్లను స్కాన్‌చేసి లీప్‌యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ప్రాథమిక తరగతుల్లో ప్రతి విద్యార్థికి నాలుగు చొప్పున, ఉన్నత తరగతుల్లో ఆరు చొప్పున స్కాన్‌ చేయాలి. ఇప్పటికే రోజూ యాప్‌లు, ఆన్‌లైన్‌ వర్క్, అర్జెంట్‌ ఫైళ్లతో బోధనకు దూరమైన తమకు ఇది మరో భారమైందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.  

ప్రైవేటులో సొంతంగా పేపర్లు!  
ఎఫ్‌ఏ–1 పరీక్షలు ఈనెల 11 నుంచి 14 వరకు జరుగుతాయని షెడ్యూల్‌ విడుదల చేశారు. ఫార్మెటివ్‌ పరీక్షలను ఎవరికివారు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించడంతో ప్రైవేటు యాజమాన్య స్కూళ్లు ఈనెల 11వ తేదీకి ముందే నిర్వహించాయి. ఇప్పటికే తలాతోకా లేని విధానాలకు సంస్కరణల పేరు పెట్టిన కూటమి ప్రభుత్వం సర్కారు బడులను, ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసింది. ఇప్పుడు ఈ తరహా పరీక్షల్లోను విద్యార్థులు ఫెయిలైతే.. ప్రభుత్వ స్కూళ్లకంటే ప్రైవేటు స్కూళ్లే మేలు అని తల్లిదండ్రులు భావించి పిల్లల్ని మార్చే అవకాశాలున్నాయి. కేవలం కార్పొరేట్‌ విద్యాసంస్థలకు మేలుచేసేందుకే ప్రభుత్వం ఇలాంటి విధానాలు అనుసరిస్తోందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.    

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
School Education Department
examinations
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.