Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
ADVERTISEMENT 

తిరుమలలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 30, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ttd111.jpg

సాక్షి, తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ధనుర్మాస కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసిన అనంతరం వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించారు.రాత్రి 12:05 గంటలకు అర్చకులు, జీయర్ స్వాముల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వారాలను తెరిచారు. అనంతరం నిత్య కైంకర్యాలు పూర్తి చేసి వేకువజాము 1:25 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నట్లు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి దర్శనాలు పక్కా ప్రణాళిక ప్రకారం సజావుగా సాగుతున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సోమవారం ఒక్కరోజే సుమారు 60 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించామని వెల్లడించారు. దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా కేవలం 2–3 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వీవీఐపీల దర్శనాలు కేవలం మూడు గంటల పాటు మాత్రమే నేరుగా వచ్చిన వీవీఐపీలకు దర్శన టికెట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు రోజుల కోసం ఆన్‌లైన్ లక్కీ డిప్ ద్వారా సుమారు 1.89 లక్షల టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.

ఉదయం 4:30 గంటల నుంచి టోకెన్లు ఉన్న భక్తులకు వారి కేటాయించిన టైమ్ స్లాట్ల ప్రకారం సర్వదర్శనం ప్రారంభించనున్నట్లు ఈవో వివరించారు. టోకెన్లు లేని భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సోషల్ మీడియా, రేడియో అనౌన్స్‌మెంట్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేపట్టామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి 8వ తేదీ మధ్య తిరుమలకు వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాలని సూచించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా దర్శనానికి పట్టే సమయం, రద్దీ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు తాజా అప్‌డేట్స్ అందిస్తున్నామని తెలిపారు. భద్రత పరంగా సుమారు 3,500 మంది పోలీస్, విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.

వైకుంఠ ద్వార దర్శనంలో ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా అనేక మంది ప్రముఖులు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనంలో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజలతో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, సినీ నిర్మాత డివివి దానయ్య దర్శనం చేసుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసులు రెడ్డి, తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కూడా దర్శనం చేసుకున్నారు.

నిర్మాత బండ్ల గణేష్, కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్ దర్శనం చేసుకున్నారు. మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు మిథున్ రెడ్డి, గురుమూర్తి, క్రికెటర్ తిలక్ వర్మ, చాముండేశ్వరినాథ్, ఎమ్మెల్సీ భరత్, దేవినేని అవినాష్ తదితరులు వైకుంఠ ద్వార దర్శనంలో తరించారు. భక్తులు తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Vaikuntha Ekadashi
tirumala
TTD
Anil kumar singhal
devotees
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుమలలో పవన్ కు అవమానం.. రగిలిపోతున్న జనసేన

తిరుమల శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ తేజ (ఫొటోలు)

తిరుమల శ్రీవారి సేవలో నందమూరి మోక్షజ్ఞ తేజ (ఫొటోలు)

తిరుమల శ్రీవారి సేవలో 'మా ఇంటి బంగారం' టీమ్ (ఫోటోలు)

తిరుమల శ్రీవారి సేవలో 'మా ఇంటి బంగారం' టీమ్ (ఫోటోలు)

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!

హెలికాప్టర్ సంచారం.. తిరుమలలో కలకలం!

తిరుమలలో పవన్ కళ్యాణ్ పుస్తకం ఆవిష్కరణ

తిరుమలలో పవన్ కళ్యాణ్ పుస్తకం ఆవిష్కరణ

తిరుమలలో జన సైనికుల ఓవరాక్షన్‌

తిరుమలలో జన సైనికుల ఓవరాక్షన్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.