Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Fact Check: ఏపీలో రోజుకు 2,000 ఇళ్ల నిర్మాణాలు.. రామోజీ బురద వార్తలు
ADVERTISEMENT 

Fact Check: ఏపీలో రోజుకు 2,000 ఇళ్ల నిర్మాణాలు.. రామోజీ బురద వార్తలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jul 3, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
factcheck.jpg

సాక్షి, అమరావతి: ఒకేసారి 30 లక్షల మందికిపైగా మహిళలకు ఇళ్ల పట్టాలను అందించడం దేశ చరిత్రలోనే ఓ రికార్డు కాగా అడ్డంకులను అధిగమిస్తూ పేదల గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సాకారం చేస్తోంది. పేదల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో ఏపీ దేశంలో నాలుగో స్థానంలో ఉంది. అత్యధికంగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ (12.85 లక్షలు), గుజరాత్‌ (8.78 లక్షలు), మహారాష్ట్ర (8.10 లక్షలు) ఉండగా ఏపీలో 7.93 లక్షలు పూర్తైనట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ గణాంకాల్లోనే స్పష్టంగా ఉంది.



నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా సీఎం జగన్‌ చేస్తున్న గృహ యజ్ఞంపై కేంద్ర మంత్రులు సైతం పలు సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న రామోజీ మాత్రం అట్టడుగున ఉందంటూ యథా­విధిగా వక్రీకరణ కథనాలను ప్రచురించారు.



దేశంలోనే అత్యధిక ఇళ్లు

పేదలకు పక్కా గృహాల కల్పనలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.75 వేల కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన 71,811.49 ఎకరాల భూమిని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పంపిణీ చేసింది. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా పారదర్శకంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. దీంతో ఏపీలో అత్యధిక ఇళ్ల నిర్మాణానికి అనుమతులు వచ్చాయి.



మంజూరైన ఇళ్ల పనులను మొదలు పెట్టడంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. వేగంగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అవసరమైన వనరులను వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో కల్పించడం, లబ్ధిదారులకు సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సరఫరా చేయడం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంది. పేదల ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రభుత్వం కనబరుస్తున్న చిత్తశుద్ధిని చూసి ఇటీవలే సీఆర్‌డీఏ పరిధిలో 47వేల ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ అనుమతులు ఇచ్చింది.  

కుట్రలను అధిగమించి

నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కోర్టులను ఆశ్రయించి న్యాయ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నించింది. ఈ అవరోధాలను అధిగమించి 2020 డిసెంబర్‌లో 30.6 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. రిజిస్ట్రేషన్, జియో ట్యాగింగ్‌ పూర్తి చేసి ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించే సమయంలో కోవిడ్‌ రెండో విడత ప్రారంభం అయింది. దీంతో కొన్ని నెలల పాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి.



2021 జూలైలో మెగా గ్రౌండింగ్‌ మేళా నిర్వహించి తొలి దశలో 15.6 లక్షల గృహ నిర్మాణాలను ప్రారంభించారు. నిర్మాణాలు చురుగ్గా సాగుతున్న సమయంలో మరోమారు టీడీపీ కోర్టుల్లో కేసులు వేయడంతో కొద్ది నెలలు పనులు నిలిచిపోయాయి. విశాఖ, సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల పట్టాల పంపిణీని కూడా కోర్టుల ద్వారా అడ్డుకోవాలని ప్రయత్నించారు. విశాఖ కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో గత ఏడాది ఏప్రిల్‌ నెలలో 1.24 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి నిర్మాణాలు ప్రారంభించారు.  

రోజుకు రెండు వేలకు తగ్గకుండా

రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం చురుగ్గా కొనసాగుతున్నాయి. నిత్యం రెండు వేల ఇళ్లకు తగ్గకుండా నిర్మాణాలు పూర్తవుతున్నాయి. పనుల్లో వేగాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయడంతో పాటు యూనిట్‌కు రూ.1.80 లక్షల చొప్పున ఇంటి నిర్మాణానికి అందచేస్తోంది. మరోవైపు పావలా వడ్డీకి రూ.35 వేలు చొప్పున బ్యాంకు  రుణం ఇస్తు­న్నారు. దీంతోపాటు ఉచితంగా ఇసుక ఇవ్వడం ద్వారా రూ.15 వేలు, ఇతర నిర్మాణ సామగ్రిని సబ్సిడీపై అందించడంతో రూ.40 వేల మేర లబ్ధి చేకూరుస్తున్నారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Housing construction
Government of Andhra Pradesh
housing department
Ramoji Rao
YSR Jagananna Colonies
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గృహమస్తు

గృహమస్తు

నివారించదగినవే అయినా...

నివారించదగినవే అయినా...

268 టన్నుల ఇనుమును కొట్టేశారు

268 టన్నుల ఇనుమును కొట్టేశారు

డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్‌ గోల.. యూటర్నే శరణ్యం

డీఎస్సీతో డీలా.. కోఎంప్ట్‌ గోల.. యూటర్నే శరణ్యం

చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!

చేను రాష్ట్రానిది చట్టం కేంద్రానిది!

ఎన్‌పీఎస్‌పీఎల్‌కు నజరానా

ఎన్‌పీఎస్‌పీఎల్‌కు నజరానా

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.