Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Fact Check: ఆతృతతో రామోజీ వికృత రాతలు 
ADVERTISEMENT 

Fact Check: ఆతృతతో రామోజీ వికృత రాతలు 

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 20, 2023 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
crop.jpg

సాక్షి, అమరావతి: రాక్షస ఆలోచనలతో నిండిపోయిన రామోజీ మెదడుకు వాస్తవాలు బయటికొస్తాయనే భయం ఏకోశానా లేదు. రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలకు సంబంధించి సాగుచేసిన ప్రతీ ఎకరాకు ఈ–క్రాప్‌ ఆధారంగా బీమా కవరేజ్‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే ఆ పండు ముసలి ప్రాణం కడుపుమంటతో రగిలిపోతోంది. యూనివర్సిల్‌ కవరేజ్‌ విషయంలో ఏపీని స్ఫూర్తిగా కేంద్రం కూడా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ముందుకొచ్చి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో కలిసి ఫసల్‌ బీమాను అమలుచేస్తోంది.



పలు రాష్ట్రాలు కూడా ఈ విషయంలో ఏపీ బాటపట్టాయి. కానీ, క్షుద్ర రాతలతో అబద్ధాలను అడ్డగోలుగా అచ్చేసే రామోజీకి ఇవన్నీ తెలిసినా కణకణాన ఓర్వలేనితనం ఆయన్ను రోజురోజుకీ దిగజారుస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 44.66 లక్షల మందికి రూ.6,684.84 కోట్ల పరిహారం అందించింది. కానీ, ఇవన్నీ చూసి తట్టుకోలేకపోతున్న రామోజీ నిత్యం ఈ పథకంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు. రైతులను గందరగోళ పర్చేలా ‘ఏది బీమా?’ అంటూ తాజాగా ఈనాడు ఎంతో ఆతృతతో మరో అబద్ధాల సంకలనాన్ని అచ్చేసింది.



నిజానికి.. ఖరీఫ్‌–21 సీజన్‌కు సంబంధించి 15.61 లక్షల మందికి రూ.2,977.82 కోట్ల పరిహారం అందించిన రాష్ట్ర ప్రభుత్వం.. పరిహారం ఇంకా అందని వారెవరైనా మిగిలి ఉన్నారేమోనని దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హులను గుర్తించి ఈ నెల 14న మరో 9 వేల మందికి రూ.90 కోట్ల పరిహారం జమచేసి రైతులపట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంది. కానీ, ఇవేమీ పట్టించుకోని ఈనాడు విషం కక్కడమే పనిగా పెట్టుకుంది. ఫిల్‌్మసిటీ కోటలో కాలుజాపుకుని ఇంకెన్నాళ్లు ఈ ఎల్లో జర్నలిజం చేస్తారు? మీ కథల్ని ప్రజలు నమ్మే రోజులు పోయాయని తెలుసా? ‘ఏది బీమా?’పై ఇదీ నిజం.. చదవండి రామోజీ.. 



ఆరోపణ: బీమా హుళక్కేనా?

వాస్తవం: ఈ–పంట నమోదు జరిగిన వెంటనే రైతుల మొబైల్‌కు ఎస్‌ఎంఎస్‌ రూపంలో మెస్సేజ్‌లు పంపడమే కాదు.. ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తికాగానే ప్రతీ రైతుకు భౌతిక రశీదులు అందించారు. వీటి ప్రామాణికంగానే పంట ఉత్పత్తుల కొనుగోళ్లతో పాటు వ్యవసాయ రుణాలు, సున్నా వడ్డీ రాయితీ, పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి ఇతర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. సాగు చేసిన పంటలలో నోటిఫై చేసిన పంటలకు బీమా రక్షణ కల్పిస్తున్నారు. ఈ వివరాలన్నీ ఆ రశీదుల్లో స్పష్టంగా పొందుపరుస్తున్నారు. ఈ విషయంలో రైతుల్లో ఎలాంటి గందరగోళంలేదు. ఈనాడుకు తప్ప.



ఆరోపణ: ఆ పంటలకు బీమా కవరేజ్‌ ఏదీ?

వాస్తవం: నాసిరకం విత్తనాలవల్ల పంటలు దెబ్బ­తిన్నా, ఆశించిన దిగుబడులు రాకపోయినా, వాతా­వరణం వల్ల పంటలు దెబ్బతిన్నా నోటిఫై పంటలకు బీమా పరిహారం అందిస్తారు. పత్తి, మిరప, ఉల్లి తది­తర పంటలన్నీ నోటిఫైడ్‌ పంటలే. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ప్రీమియం చెల్లించిన రైతులకు మాత్రమే కవరేజ్‌ ఉండేది. అధికారులు, బీమా కంపెనీల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే కానీ పరి­హారం సొమ్ములు దక్కేవి కావు. అది కూడా అరకొరగానే. కానీ, నేడు రైతులపై పైసా భారం పడకుండా నాలుగేళ్లుగా పంటల బీమా పరిహారం ఇస్తున్నారు.



ఆరోపణ : అన్నదాతను ఆదుకోవడంలో అలసత్వమేలా?

వాస్తవం: పంటల పరిహారం చెల్లింపులో ఈనాడు చెబుతున్నట్లుగా ఎలాంటి గందరగోళంలేదు. యూనివర్సల్‌ కవరేజ్‌ విషయంలో కేంద్రం దిగిరావడంతో ఖరీఫ్‌–22 సీజన్‌కు సంబంధించి దిగుబడి ఆధారిత పంటలకు పీఎంఎఫ్‌బీవై–డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలుచేస్తుండగా వాతావరణ ఆధారిత పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వైఎస్సార్‌ ఉచిత బీమా పథకం కింద కవరేజ్‌ కల్పిస్తోంది. నోటిఫై చేసిన దిగుబడి ఆధారిత పంటలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ వాటాతో పాటు రైతుల వాటాను కూడా ప్రభుత్వం చెల్లించింది.



మే నెల వరకు వాతావరణ ఆధారిత పంటల బీమా కవరేజీ కొన్ని పంటలకు మిగిలి వున్నందువలన బీమా పరిహారం లెక్కింపు తదనుగుణంగా పూర్తికావస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ మొదలై రెండు వారాలైనా ఖరీఫ్‌–2022 సీజన్‌కు సంబంధించి పంటల బీమా పరిహారం చెల్లింపుపై రైతులకు ఎలాంటి సమాచారం లేదనడంలో వాస్తవంలేదు. ఈ విషయంలో ప్రభుత్వం అసలు కసరత్తు చేయడంలేదని ఆరోపించడం హాస్యాస్పదం.



ఆరోపణ: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?

వాస్తవం: జూలై 8న ఖరీఫ్‌–22 సీజన్‌కు సంబంధించిన పంటల బీమా పరిహారాన్ని జమచేస్తామని సీఎం జగన్‌ స్వయంగా రైతుభరోసా ఇచ్చిన జూన్‌ 1నే ప్రకటించారు. ఎందుకంటే జూలై 8న రైతు దినో­త్సవంతో పాటు వైఎస్సార్‌ జయంతి కూడా. కనుక ఇది ఇస్తారన్న సంగతి అందరికీ తెలుసు.



అయినా, ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ దానిని ఏమా­త్రం పట్టించుకోకుండా ఇంకా ఇవ్వలేదని రాయ­డం సబబేనా? ఇక.. ముందే చెప్పినట్లుగా ఆ తేదీకి సీఎం ఇచ్చేస్తే మేం చెప్పాం కాబట్టే ఇచ్చారని డబ్బా కొట్టుకునేందుకేనా ఈ రాతలు? మరోవైపు.. పంటల బీమాకు అర్హుల జాబితా మదింపు జరుగుతోంది.



ఈ నెలాఖరులోగా జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో అభ్యంతరాలను స్వీకరించి వాటిని జూలై మొదటి వారంలో పరిష్కరిస్తారు. ఆ వెంటనే తుది జాబితాలను ఆర్బీకేల ద్వారా ప్రదర్శిస్తారు. 



ఆరోపణ: అమ్మఒడి కోసం జాప్యం చేస్తున్నారు..

వాస్తవం: 2016 నుంచి పీఎంఎఫ్‌బీవై అమలవుతోంది. అంతకుముందు వ్యవసాయ బీమా పథకం కింద బీమా కవరేజ్‌ కల్పించేవారు. గడిచిన సీజన్‌కు సంబంధించి చెల్లించాల్సిన బీమా పరిహారాన్ని గతంలో ఆగస్టు నెలాఖరులోపు ఇచ్చిన దాఖలాలే లేవు. పలు సీజన్‌లలో సెప్టెంబర్‌లో కూడా ఇచ్చారు. అది కూడా కంపెనీల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తేకానీ పరిహారం దక్కేది కాదు.



కానీ, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గడిచిన సీజన్‌కు సంబంధించిన పరిహారాన్ని మరుసటి ఏడాది ఆ సీజన్‌ ప్రారంభమయ్యేలోగా అర్హుల జాబితాలను ప్రకటించి జూన్‌–జూలైలో పరిహారం అందిస్తున్నారు. ఈ వాస్తవాలను విస్మరించి అమ్మఒడి కార్యక్రమం ఉన్నందున పంటల బీమా పరిహారం జూలై లేదా ఆగస్టులో ఇచ్చే అవకాశం ఉందంటూ చేతికొచ్చినట్లు రాయడం ఈనాడుకే చెల్లింది.

ఆరోపణ : ఈకేవైసీ అంటూ కొత్త మెలిక పెట్టారు..

వాస్తవం: మొదట్లో ఈ–క్రాప్‌లో నమోదు చేయించుకుంటే చాలని, ఆ తరువాత ఈ–కేవైసీ చేయించుకుంటేనే పరిహారం ఇస్తామని మెలిక పెట్టిందనడంలో కూడా వాస్తవంలేదు. నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపజేసేందుకు జారీచేసిన నోటిఫికేషన్‌లో రైతు తన ఆధార్‌ బయోమెట్రిక్‌ ధ్రువీకరణ చెయ్యాలని స్పష్టంగా పేర్కొన్నారు.



ఈ విషయాన్ని పలుమార్లు పత్రికాముఖంగా రైతులకు విజ్ఞప్తి చేయడమే కాదు.. ఆర్బీకేల ద్వారా ఈ–కేవైసీ నమోదు చేసుకోవాలని రైతులకు వివరించారు. చెల్లించాల్సిన క్లెయిమ్స్‌ను ఆధార్‌ ఆధారిత నగదు బదిలీ ద్వారా నేరుగా రైతు ఖాతాలకు జమచేస్తున్నందున ఈ–కేవైసీని ప్రామాణికంగా తీసుకుంటున్నారు.ఈ వాస్తవాలను కప్పిపుచ్చి రైతులను గందరగోళ పరిచేలా తప్పుడు వార్తలు రాయడం, విషం కక్కడం ఈనాడుకు నిత్యకృత్యమైపోయింది.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Farmers
Ramoji Rao
Crop insurance
Government of Andhra Pradesh
Insurance Coverage
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

పొలం.. కదలని హలం!

పొలం.. కదలని హలం!

బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!

బాబు ప్రేమ బూటకం.. మోసం నిజం!

అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణలు: వైఎస్‌ జగన్‌

అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు దారుణలు: వైఎస్‌ జగన్‌

‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’

‘రైతులపై బాబు ప్రేమ బూటకం- మోసం.. నిజం’

ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!

ప్రతి గింజా కాదు.. 'కోటా మేరకే'!

మక్క రైతుకు మార్క్‌ఫెడ్‌ టెన్షన్‌

మక్క రైతుకు మార్క్‌ఫెడ్‌ టెన్షన్‌

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.