Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. Fact Check: తొందరపడి తప్పుడు రాతలు
ADVERTISEMENT 

Fact Check: తొందరపడి తప్పుడు రాతలు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Dec 29, 2023 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
fake.jpg

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సాధారణ విస్తీర్ణం 55.27 లక్షల ఎకరాలు. ఇప్పటి వరకు 18.84 లక్షల ఎ­కరాల విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. రబీ సీ­జన్‌ అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ చివరి వరకూ వ­రి­నా­ట్లు వేస్తారు. ఒకవేళ వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే జ­నవరి 15 వరకు వేసుకోవచ్చన్నది ఆచార్య ఏన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తల సూ­­చన. సాధారణంగా ఖరీఫ్‌ వరికోతలు పూ­ర్త­యి­న తర్వాత అదే పొలంలో జొన్న, నువ్వులు, కొర్ర పంటలను జనవరి నెలవరకు వేసుకోవచ్చు.

ప్రాంతా­ల వారీగా చూస్తే కోస్తా జిల్లాల్లో ఖరీఫ్‌ వరి కో­త­లు పూర్తయిన తర్వాత అదే పొలంలో అపరాలు, మొ­క్కజొన్న, జొన్న, రాగి పంటలను డిసెంబర్‌ చివరి వరకూ వేయడం ఆనవాయితీ. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వేరుశనగకు ప్రత్యామ్నాయంగా మినుములు, మేత మొక్కజొన్న, మేత జొన్న, మేత అలసంద డిసెంబర్‌ చివరి వరకూ విత్తుతారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వరికి ప్రత్యామ్నాయంగా శనగ, అపరాలు, ప్రొద్దుతిరుగుడు, మొక్కజొన్న డిసెంబర్‌ చివరి వరకూ సాగు చేస్తారు.

తిరుపతి జిల్లాలో మొక్క జొన్నకు ప్రత్యామ్నాయంగా సజ్జ, రాగి, కొర్ర పంటలను జనవరి 2వ వారం వరకు వేస్తారు. నెల్లూరు జిల్లాలో నువ్వులకు ప్రత్యామ్నాయంగా పెసర పంటను జనవరి 3వ వారం వరకు వేస్తారు. ఈ లెక్కన వచ్చే మూడు వారాల్లో వరి, జొన్న, రాగి, మొక్కజొన్న, అపరాలు, సజ్జ పంటల విస్తీర్ణం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇంతలోనే రబీ విస్తీర్ణం 12 లక్షల ఎకరాలు తగ్గిందంటూ ఓ కథనాన్ని ఈనాడు వండి వార్చింది.

అడ్డగోలు రాతలు... అబద్ధాలు 

వండివార్చడం... ప్రభుత్వంపై దుష్ప్రచారానికి పూనుకోవడం... ఇవి ఈనాడుకు అలవాటుగా మారింది. ఎంత చేస్తున్నా... ఏమీ చేయలేదన్నట్టు తప్పుడు కథనాలు అల్లడం రామోజీకి నిత్యకృత్య మైపోయింది. ఇప్పుడు తాజాగా రబీపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందంటూ మరో కట్టుకథ అచ్చేశారు. రబీ సీజన్‌ గడువు ఇంకా ముగిసి పోలేదు... ఇప్పటివరకూ పండిన పంటలపై ఇంకా లెక్క తేలలేదు. అయినా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందంటూ అడ్డగోలు రాతలు.

రబీ సాగుపై ఒక్కసారి కూడా సమీక్ష జరపలేదంటూ దొంగ ఏడుపులు. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యామ్నాయ పంటల రాయితీ విత్తనంపై సర్కార్‌ సన్నాయి నొక్కులు నొక్కుతోందంటూ  విషపు రాతలు. ‘రబీలోనూ సర్కార్‌ మొద్దు నిద్రే’ అంటూ వండివార్చిన ఈ అడ్డగోలు కథనంపై వాస్తవాలు ఒక్కసారి పరిశీలిద్దాం.

నష్టపరిహారం పంపిణీకి చర్యలు

♦  ఖరీఫ్‌ పంట కాలంలో కరువు పరిస్థితులు, మిచాంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల దెబ్బతిన్న çపంటలకు నష్టపరిహారం అందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 

♦నష్టపోయిన రైతులకు మెరుగైన సాయం అందించాలన్న సంకల్పంతో నష్టపరిహారాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేంద్రం ఇచ్చే పెట్టుబడి రాయితీ కంటే మెరుగైన రీతిలో ఇచ్చేలా మార్పులు చేసింది.

♦ పంట నష్టం ప్రాధమిక అంచనా వివరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్ల

డంతో కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి కేంద్రానికి నివేదిక కూడా సమర్పించాయి. 

♦ ఖరీఫ్‌ సీజన్‌లో ప్రకటించిన కరువు మండలాల పరిధిలో పంట దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చేందుకు, కరువు, తుఫాన్‌ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

♦  తుఫాన్‌ ప్రభావం వల్ల ధాన్యం రంగు మారినా, పాడైనా, తేమ శాతంలో నిబంధనలను సడలించి మరీ కొనుగోలుచేసింది. ఇలా డిసెంబర్‌ 1 నుంచి 14 వరకు తుఫాన్‌ తర్వాత నిబంధనలు సడలించి 12.70లక్షల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేశారు.

♦ వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా రైతులను గందరగోళ పర్చేలా బురద రాతలు రాయడం ఈనాడుకే చెల్లింది.

ఎప్పటికప్పుడు సాగుపై సమీక్షలు

♦ఈ సీజన్‌లో సాగు పరిస్థితులపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి నవంబర్‌ 3న, 23న వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులతో ఉన్నత స్థాయిలో సమీక్షించారు.

​​​​​​​♦ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తరఫున ఆయన కార్యదర్శి నవంబర్‌ 8న, ముఖ్యకార్యదర్శి నవంబర్‌ 9, 25, డిసెంబర్‌ 15న, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి నవంబర్‌ 3, 17, 20, 29, డిసెంబర్‌ 18న సమీక్షించారు. 

​​​​​​​♦ శాస్త్రజ్ఞులు సిఫార్సు చేసిన ప్రత్యామ్నాయాలను రైతులు పాటించేందుకు వీలుగా నవంబర్‌ 10 నుంచి 28 వరకు జాయింట్‌ ఇరిగేషన్‌ – వ్యవసాయ అడ్వైజరీ బోర్డు సమావేశాలు నిర్వహించారు. 

​​​​​​​♦ దెబ్బతిన్న నారు మళ్ళు, లేత దశలో వున్న రబీ పంటలకు తిరిగి విత్తుకునేందుకు 80 శాతం రాయితీపై ప్రత్యామ్నాయ పంటల విత్తనాల (86వేల క్వింటాళ్లు) సరఫరాకు ఏర్పాటు చేశారు. 

​​​​​​​♦ ఇప్పటి వరకు 24 జిల్లాల్లోని అర్హులైన రైతులకు 31వేల క్వింటాళ్ల వరి, వేరుశనగ, శనగ, మినుములు, పెసర, నువ్వులు, ఉలవలు విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం రూ.16.63 కోట్ల రాయితీ రూపంలో ప్రభుత్వం అందించింది.

​​​​​​​♦ కానీ ఇవేవీ పట్టించుకోకుండా అసలు ప్రభుత్వం సమీక్షలే నిర్వక్షించలేదంటూ తప్పుడు ఆరోపణలు ఈనాడు చేసింది.

ఖరీఫ్‌కు అనుకూలించని వర్షాలు

​​​​​​​♦ ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఖ­రీ­ఫ్‌­కు తీవ్ర జాప్యం ఏర్పడింది. సెప్టెంబర్‌ చివరి వ­ర­కు పంటలు వేసుకోవడం వల్ల, పంట కోతలు ఇç­³్పటికీ జరుగుతూనే ఉన్నాయి. దానివల్ల రబీ పంటల సాగులోనూ ఆలస్యం అయింది. ఖరీఫ్‌ సా­ధారణ విస్తీర్ణం 84.94 లక్షల ఎకరాలకు 61.70 లక్షల ఎకరాల్లోనే వేశారు. అంటే 23. 24లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. కానీ ఖరీఫ్‌లో 31 లక్షల ఎకరాల్లో పంటలు వే­య­లేదంటూ ఈనాడు ఆరోపించింది.

​​​​​​​♦ ఖరీఫ్‌ సాగు చేయ లేని చోట ప్రత్యామ్నాయంగా వరి, మొక్క జొన్నతో పాటు చిరుధాన్యాలు, అ­ప­రా­లు సాగు చేసేందుకు ముందుకొచ్చిన 1.16 ల­క్షల మంది రైతులకు 80 శాతం సబ్సిడీపై 30,977 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. ఇందుకోసం  రూ.26.46 కోట్లు వె­చ్చించారు. మరో వైపు రబీ ముందస్తు ప్ర­ణా­ళి­క­లో భాగంగా 2.70 లక్షల క్వింటాళ్ల శనగ, వే­రు­శ­న­గ,వరి, మినుములు, పెసర పంటల విత్తనాలను సరఫరా చేశారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
rabi
YS Jagan Mohan Reddy
kharif
Ramoji Rao
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.