Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కుదేలవుతున్న కర్షకుడు
ADVERTISEMENT 

కుదేలవుతున్న కర్షకుడు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jun 18, 2026 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
rytu.jpg

కంపెనీలు, హోల్‌సేలర్లు, డీలర్లు, అధికారుల మధ్య నలిగిపోతున్న వైనం 

రైతులకు బలవంతంగా బయో ప్రొడెక్ట్స్ ను అంటగడుతున్న డీలర్లు

ఈ అమ్మకాలు ఆపేయాలంటూ వ్యవసాయ శాఖ ఆదేశాలు 

కంపెనీలు, హోల్‌సేలర్స్‌ ఒత్తిడి మేరకే విక్రయిస్తున్నామంటున్న డీలర్లు

ముందు వాళ్లను నిలువరించాలని డిమాండ్‌ 

లేదంటే యూరియా, డీఏపీ అమ్మకాలు నిలిపివేస్తామని అల్టిమేటం 

ఏమి జరిగినా.. చివరికి ఆరి్థక నష్టం తమకే అంటున్న అన్నదాత

సాక్షి, అమరావతి: పెరిగిన ఖర్చులు, గిట్టుబాటు ధర అందని అనిశ్చిత వాతావరణం నేపథ్యంలో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న అన్నదాత.. ఇప్పుడు బయో ప్రొడక్ట్స్  వివాదంలో మరోసారి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కంపెనీలు, హోల్‌సేలర్లు, డీలర్లు, అధికారుల మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో రైతే బలిపశువుగా మారుతున్న పరిస్థితి కనబడుతోంది.ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తుల కొనుగోలుకు రైతును బలవంతం చేయొద్దని డీలర్లకు స్పష్టంచేస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలపై డీలర్లు మండిపడుతున్నారు.  

మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉండే యూరియా, డీఏపీ కావాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ బయో ప్రొడక్ట్స్  తీసుకోవాలని కంపెనీలు, హోల్‌సేలర్స్‌ తమపై ఒత్తిడి తీసుకొస్తారని, విధిలేని పరిస్థితుల్లోనే వాటిని రైతులకు అవసరం లేకున్నా అంటగట్టాల్సి వస్తోందని డీలర్లు చెబుతున్నారు. తమపై ఇలాంటి ఒత్తిడి వద్దని కంపెనీలు, హోల్‌సేలర్స్‌కు తొలుత స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేకుంటే యూరియా, డీఏపీ అమ్మకాలు నిలిపివేస్తామని తేల్చి చెబుతున్నారు.  ఈ వివాదం ఎటు తిరిగినా చివరికి ఆర్థికంగా నష్టపోయేది రైతేనన్న ఆందోళన అన్నదాతల్లో వ్యక్తమవుతోంది.  

రైతుల నుంచి రూ.1,000 కోట్లకుపైగా దోపిడీ
» రాష్ట్రంలో ఖరీఫ్‌ సీజన్‌లో 18 లక్షలు, రబీలో 23 లక్షల టన్నుల ఎరువుల వినియోగం ఉంటుంది. కాంప్లెక్స్‌ ఎరువులతో పోలిస్తే కాస్త చౌకగా లభించే యూరియాతో పాటు డీఏపీ ఎరువుల వినియోగం కాస్త ఎక్కువగా ఉంటుంది.  
»  ఇందులో ప్రధానంగా ఖరీఫ్‌లో 7 లక్షల టన్నులు యూరియా, 2.50 లక్షల టన్నులు డీఏపీ, రబీలో 9.38 లక్షల టన్నుల యూరియా, 2.20 లక్షల టన్నుల డీఏపీ ఎరువులు వినియోగిస్తారు. వీటి కోసం సీజన్‌లో ఎనలేని డిమాండ్‌ ఉంటుంది.  
»  ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకొని సాగులో పెద్దగా అవసరం లేని బయో ఫెర్టిలైజర్లు, బయో స్టిమ్యులెంట్లు, పురుగుమందులు, సూక్ష్మపోషకాలు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను రైతులకు బలవంతంగా అంట గట్టడం పరిపాటిగా మారింది.  
» యూరియా, డీఏపీ బస్తాలు కొనుగోలు చేసే పరిమాణంలో కనీసం 40–50 శాతం ఈ బయో ప్రొడెక్ట్స్‌ను కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి తీసుకొస్తారు. చేసేది లేక చేతిచమురు వదులుతున్నా విధిలేని పరిస్థితుల్లో వీటిని కొనుగోలు చేసి, అవసరం లేకున్నా మోతాదుకు మించి  అన్నదాతలు వినియోగిస్తుంటారు. 
»  ప్రతీ ఏటా ఈ చట్ట వ్యతిరేక లింక్‌ ప్రొడెక్ట్స్‌ వ్యాపారం అక్షరాల రూ.1000 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా.  
»  ఈ తరహా అమ్మకాలను నిలిపివేయాలన్న రైతుల డిమాండ్‌ను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రెండేళ్లుగా ఓ వైపు యూరియా, డీఏపీ అదునుకు దొరక్క రైతులు పడరాని పాట్లు పడిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నుంచి ఏపీ వ్యవసాయ సమాచార, నిర్వహణా వ్యవస్థ (ఏపీఏ ఐఎంఎస్‌) యాప్‌ ద్వారా విక్రయాలకు శ్రీకారం చుట్టగా, లింక్‌ ప్రొడెక్ట్స్‌ ట్యాగింగ్, అమ్మకాలపై రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.   
» 100 బస్తాల యూరియా కావాలంటే వాటితో పాటు కనీసం 10 బస్తాల సల్ఫర్, 5 బాక్సుల బయో ప్రొడెక్ట్స్‌ తీసుకోక తప్పని పరిస్థితి కల్పించడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
»  కొన్ని కంపెనీలు తమ డీలర్లకు సబ్సిడీ ఎరువుల కేటాయింపును ఇతర ఉత్పత్తుల కొనుగోలుతో అనుసంధానం చేస్తున్నారు. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.  
» దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం, విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించే వారిపై లైసెన్స్‌ రద్దు, క్రిమినల్‌ కేసుల నమోదు వంటి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.  
» దీంతో రాష్ట్ర వ్యవసాయశాఖ డీలర్లకు స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ఆదేశాలు జారీ చేసింది.  
» చట్ట వ్యతిరేక బలవంతపు విక్రయాలకు పాల్పడే వారిపై సంబంధిత వ్యవసాయ అధికారి, ఎరువుల ఇన్‌స్పెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి లేదా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులకు వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ ఆదేశాలు ఇచ్చారు.  

కంపెనీలు, హోల్‌సేలర్లకు కూడా ఆదేశాలు ఇవ్వండి 
యూరియా, డీఏపీతో పాటు లింక్‌ ప్రొడెక్ట్స్‌ బలవంతపు విక్రయాలపై వ్యవసాయ శాఖ జారీ చేసిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం. బలవంతపు ట్యాగింగ్‌ను ఆపాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాం.  అయితే కంపెనీల ఒత్తిడి మేరకే విధిలేని పరిస్థితుల్లో రైతులకు అమ్మాల్సి వస్తోంది. తమపై ఒత్తిడి తెచ్చే ముందు తయారీ దారులు, హోల్‌సేల్‌ వ్యాపారులతో సమావేశం ఏర్పాటు చేసి వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 
– వజ్రాల వెంకటనాగిరెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్ర ఎరువులు, పురుగు మందులు, విత్తన డీలర్ల సంక్షేమ సంఘం 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Agriculture Department
Farmers
kharif
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.