Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఇక నుంచి 60% విద్యాబోధన ప్రయోగశాలల్లోనే
ADVERTISEMENT 

ఇక నుంచి 60% విద్యాబోధన ప్రయోగశాలల్లోనే

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 23, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
ng_20ranga.jpg

6వ డీన్స్‌ కమిటీ సిఫార్సుల అమలుతో మారనున్న బోధనా పద్ధతులు

తొలి రెండేళ్లూ ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, యోగా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత

నాలుగేళ్లలో 10 ఆన్‌లైన్‌ కోర్సులు నేర్చుకునే అవకాశం

ఏదైనా కారణంతో కోర్సు పూర్తి చేయలేకపోతే.. తొలి రెండేళ్లకు డిప్లొమా సర్టిఫికెట్‌

మిగిలిన కోర్సును ఎప్పుడైనా పూర్తిచేసే అవకాశం

6వ డీన్స్‌ కమిటీ సిఫార్సులు సంపూర్ణంగా అమలు చేసిన తొలి వర్సిటీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం

సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యలో ఒకే విధ­మై­న విద్యా ప్రమాణాలతో పాఠ్యాంశాలు, విద్యా­బో­ధన అమల్లోకి వచ్చింది. ఇకపై 60 శాతం విద్యాబోధన ప్రయోగశాలల్లోనే జరగనుంది. భారత వ్యవసాయ పరి­శోధనా మండలి (ఐసీఏఆర్‌) 6వ డీన్స్‌ కమిటీ సిఫా­ర్సులను ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తూ దేశంలోనే తొలి విశ్వవిద్యాలయంగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిలిచింది. 

దేశవ్యా­ప్తం­గా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఒకే రకమై­న విద్యాబోధన తీసుకురావాలన్న లక్ష్యంతో ఐసీఏ­ఆర్‌ 2021లో ఏర్పాటు చేసిన 6వ డీన్స్‌ కమిటీ ఇటీ­వలే తన నివేదికను సమర్పించింది. 

కమిటీ సిఫా­ర్సులను జాతీయ, రాష్ట్ర వ్యవసాయ విశ్వ­విద్యాల­యాలు, డీమ్డ్‌ వ్యవసాయ వర్సిటీల్లో అమ­ల్లోకి తీసుకురావాలని ఐసీఏఆర్‌ సంకల్పించింది. దీంతో ఈ నూతన విద్యా విధానంలో పాఠ్యాంశాలతో పాటు బోధనా పద్ధతులు మారిపోను­న్నాయి.

కోర్సు మధ్యలో ఆపేస్తే..
నూతన విద్యావిధానం ప్రకారం కళాశాలల్లో చేరిన విద్యార్థులలో బెరకును పోగొట్టి, వివిధ కోర్సులపై అవగాహన కల్పించడం, విద్యార్థుల మధ్య తారత­మ్యాలు తొలగించేందుకు తొలుత రెండు వారాల ‘దీక్షారంభ్‌’ నిర్వహిస్తారు. వ్యవసాయ కోర్సులలో తొలి రెండేళ్లూ నిర్దేశించిన ప్రాథమిక కోర్సుల బోధ­న­తో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులలో శిక్షణకు ప్రాధాన్యతిస్తారు. 

తరగతి గది బోధనతో పాటు తొలి ఏడాది ఎన్‌ఎస్‌ఎస్‌/ఎన్‌సీసీ/ఫిజికల్‌ ఎడ్యుకే­షన్‌/యోగా వంటి వాటిని అభ్యసించేలా ప్రోత్సహి­స్తారు. 3వ ఏడాది పూర్తిగా వ్యవసాయ శాస్త్రానికి చెందిన కోర్సులు బోధిస్తారు. నాలుగో ఏడాదిలో ఎంపిక చేసిన కోర్సులలో విద్యాబోధన సాగిస్తారు. 8వ సెమిస్టర్‌లో ఇండస్ట్రియల్‌ అటాచ్‌మెంట్, అను­భవంతో కూడిన బోధన, హ్యాండ్‌–ఆన్‌ ట్రైనింగ్, ప్రాజెక్ట్‌ వర్క్, ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యత ఇస్తారు. 

4వ ఏడాది వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలతో పాటు 10 ఆన్‌లైన్‌ కోర్సులను నేర్చుకునే వెసులు­బాటు కల్పిస్తారు. పైగా నాలుగేళ్ల కోర్సులో ప్రయో­గాత్మక అంశాలను నేర్చుకోవడా­నికి 60 శాతం సమయాన్ని కేటాయిస్తారు. విద్యార్థి కోర్సుని పూర్తి చేయలేకపోతే.. తొలి రెండేళ్లకు గానూ డిప్లొమా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. మిగిలిన కోర్సును విద్యార్థి తనకు ఎప్పుడు అవకా­శం దొరి­కితే అప్పుడు.. దేశంలో ఏ వ్యవసాయ కళాశాలలో అయినా పూర్తిచేసే వెసులుబాటు కల్పించారు. 

అమలులో తొలి వర్సిటీగా ఎన్జీ రంగా
6వ డీన్స్‌ కమిటీ సిఫార్సుల అమలు కోసం యూని­వ­ర్సిటీ ఫ్యాకల్టీ బోర్డ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్, 113వ అకడమిక్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఆమోద ముద్ర వేయడం ద్వారా సిఫార్సులు అమలు చేస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా ఎన్జీ రంగా వర్సిటీ నిలిచింది. 

బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ ప్రోగ్రామ్‌ అందించే 7 వ్యవసాయ ప్రభుత్వ కాలే­జీలు, 6 అనుబంధ కళాశాలలు, 2 ఫుడ్‌ సైన్స్‌ కళా­శా­లలు, 2 అగ్రి ఇంజనీరింగ్‌ కళాశా­లలతో పాటు కమ్యూనిటీ సైన్స్‌ కళాశాలలో కూడా వీటిని అమల్లోకి తెచ్చింది. డిజిటల్‌ టెక్నాల­జీకి తగినట్టుగా విద్యార్థులను సన్న­ద్ధం చేసే లక్ష్యంతో బయో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్‌ లెర్నింగ్‌ తదితర కోర్సులతో పాటుగా వ్యక్తిత్వ వికాసం కోర్సులను చేర్చారు. 

విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మ­కతను మెరుగుపరిచే విధంగా ప్రోగ్రెసివ్‌ మూల్యాంకనం ద్వారా ప్రతిభను గుర్తిస్తారు. ఆన్‌లైన్, ఓపెన్‌ డిస్టాన్స్‌ లెర్నింగ్‌ (ఓడీఎల్‌), బ్లెండెడ్‌ లెర్నింగ్‌ వంటి వినూత్న బోధనా విధానాలను ఆచరణలోకి తీసుకొచ్చారు.

తొలి విశ్వవిద్యాలయం మనదే
జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఐసీఏఆర్‌ ఏర్పాటు చేసిన 6వ డీన్స్‌ కమిటీ సిఫా­ర్సులు సంపూర్ణంగా అమ­­లు చేసిన తొలి వర్సిటీగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలిచి­నందుకు గర్వంగా ఉంది.

ఏటా పెద్ద సంఖ్య­లో నూతన వంగడాలను మార్కెట్‌లోకి వి­డు­దల చేస్తూ పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న వర్సి­టీని నూతన విద్యావిధానం అమల్లో కూడా అదే స్థానంలో నిలుపుతాం. – డాక్టర్‌ శారద జయలక్ష్మి, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
NG Ranga University
Physical Education
online courses
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.