Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఆశాజనకంగా ఖరీఫ్ సాగు
ADVERTISEMENT 

ఆశాజనకంగా ఖరీఫ్ సాగు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 21, 2023 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
khariff.jpg

సాక్షి, అమరావతి: మూడు వారాలుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్‌ సాగు కాస్త ఊపందుకుంది. జూన్‌లో రుతుపవనాలు మొహం చాటేయడం.. ఆగస్టులో వర్షాల జాడే లేక కలవరపాటుకు గురైన రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల పుణ్యమాని ఊపిరి పీల్చుకుంటున్నారు. లోటు వర్షపాతం భర్తీ కావడంతో వేసిన పంటలను కాపాడుకోవడంతోపాటు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై ఇస్తున్న విత్తనాలతో అవకాశం ఉన్నంత మేర పంటలను సాగు చేస్తున్నారు.

 ఫలితంగా 58 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగు పూర్తయింది. సీజన్‌ ముగిసే నాటికి కనీసం 65 లక్షల నుంచి 70 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో 26 జిల్లాలకు గాను 18 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా.. కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో మాత్రం స్వల్పంగా లోటు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ జిల్లాల్లో కూడా నెలాఖరు నాటికి లోటు వర్షపాతం భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

31 లక్షల ఎకరాలు దాటిన వరి నాట్లు

వరి సాధారణ విస్తీర్ణం 38.80 ఎకరాలు కాగా.. ఇప్పటికే 30.75 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. అపరాలు సాధారణ విస్తీర్ణం 7.87 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 4.20 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటిలో ప్రధానంగా 3.60 లక్షల ఎకరాల్లో కందులు, 40 వేల ఎకరాల్లో మినుములు సాగవుతున్నాయి. నూనెగింజల సాగు విస్తీర్ణం 17.40 లక్షల ఎకరాలు కాగా.. ఇప్పటికే 8.80 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. వీటిలో ప్రధానంగా 7.35 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 97వేల ఎకరాల్లో ఆముదం పంటలు సాగయ్యాయి.

ఇతర పంటల విషయానికి వస్తే 10 లక్షల ఎకరాల్లో పత్తి, 2.50 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 95 వేల ఎకరాల్లో చెరకు ఇతర పంటలు సాగవుతున్నాయి. గతేడాది సాగు విస్తీర్ణంతో పోల్చుకుంటే ఈసారి వేరుశనగ, పత్తి తగ్గాయి. వరి సహా ఇతర పంటలు సాధారణ విస్తీర్ణంలోనే సాగవుతుండగా.. ఆముదం, సోయాబీన్, చిరుధాన్యాల సాగు కాస్త పెరిగింది.

పరిస్థితిని ముందుగా అంచనా వేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలు చేసింది. తొలుత 5.15 లక్షల క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేసిన ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై మరో 77,880 క్వింటాళ్ల విత్తనాన్ని పంపిణీకి సిద్ధం చేసింది. రైతులు 7,521 క్వింటాళ్ల విత్తనాన్ని ఇప్పటికే రైతులు తీసుకున్నారు. 

లక్ష్యం దిశగా సాగు

సెప్టెంబర్‌లో కురుస్తున్న వర్షాలతో లోటు వర్షపాతం భర్తీ అయి సాధారణ స్థాయికి చేరుకుంది. 3 వారాల్లో 15 లక్షల ఎక­రాలకు పైగా సాగులోకి వచ్చాయి. సీజన్‌ ముగిసే నాటికి కనీసం మరో 5 నుంచి 8 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద ఆర్బీకేల్లో 80 శాతం సబ్సిడీపై విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయి. 8 లక్షల టన్నులకు పైగా ఎరువులు  అందుబాటులో ఉన్నాయి. – చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Kharif cultivation
Monsoons
rains
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఎల్‌ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!

ఎల్‌ నినోను బ్లేమ్ చేయొద్దు.. అసలు కారణాలు వేరే!

నైరుతి రుతుపవనాలు ఆగిపోయాయా? మాన్ సూన్  ఎందుకు ఆగింది

నైరుతి రుతుపవనాలు ఆగిపోయాయా? మాన్ సూన్ ఎందుకు ఆగింది

ఏపీకి భారీ వర్ష సూచన మరో 5 రోజులు వానలే వానలు

ఏపీకి భారీ వర్ష సూచన మరో 5 రోజులు వానలే వానలు

ఏపీకి వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌

ఏపీకి వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ కీలక సూచనలు

64 శాతం భారీ లోటు : విస్తృత వర్షాలెక్కడ? షాకింగ్‌ అంచనాలు

64 శాతం భారీ లోటు : విస్తృత వర్షాలెక్కడ? షాకింగ్‌ అంచనాలు

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.