Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. మనవడు మహా ముదురు
ADVERTISEMENT 

మనవడు మహా ముదురు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Oct 12, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
696.jpg

కంచరపాలెంలో దోపిడీ ఇంటి దొంగ పనే.. 

క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తలదన్నేలా స్కెచ్‌ వేసిన కృష్ణకాంత్‌ 

ఇంటి దొంగతో పాటు సహకరించిన ముగ్గురు స్నేహితుల అరెస్ట్‌ 

రూ.2.1 లక్షలు, 12 తులాల బంగారం ఆభరణాలు, కారు స్వాధీనం  

విశాఖ సిటీ : క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను మించిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. కంచరపాలెంలో బామ్మ, మనవడిని కట్టేసి.. బంగారం, నగలు దోచుకున్నది ఇంటి దొంగే అని గుర్తించారు. ఈ దోపిడీలో మాస్టర్‌ మైండ్‌ మనవడే అన్నదే ఇక్కడ అసలు ట్విస్ట్‌. అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు థ్రిల్లర్‌ సినిమాను తలదన్నెలా ముగ్గురి స్నేహితులతో కలిసి సొంతింట్లోనే దోపిడీకి పక్కాగా ప్లాన్‌ చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచేశాడు. సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయాన్ని తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. తన సొంత ఇంటికే కన్నం వేసిన కృష్ణకాంత్‌ (19)తో పాటు అతని ముగ్గురు స్నేహితులు పరపతి ప్రమోద్‌ కుమార్‌ (30), షేక్‌ అభిష్‌క్‌ (21), అవసరాల సత్యసూర్యకుమార్‌ (24)లను అరెస్టు చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. శుక్రవారం పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..  

జీవీఎంసీలో కాంట్రాక్టు పనులు చేసే ఆనంద్‌రెడ్డి కుటుంబంతో కలిసి కంచరపాలెంలో ఇంద్రానగర్‌ 5వ వీధిలో నివాసముంటున్నాడు. ఇతడు ఈ నెల 4వ తేదీన శుభకార్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లాడు. 5వ తేదీ రాత్రి సుమారు 12.30 గంటలకు గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనుక తలుపు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంట్లో ఆనంద్‌రెడ్డి తల్లితో పాటు కుమారుడు ధర్మాల కృష్ణకాంత్‌ నిద్రలో ఉన్నారు. ఆ అగంతకులు బామ్మ, మనవుడ్ని ప్లాస్టర్, ప్లాస్టిక్‌ ట్యాగ్‌ వైర్లతో కట్టేసి నిర్బంధించారు. ఆమె ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు ఆభరణాలు, మనవడి చేతికి ఉన్న డైమండ్‌ రింగ్, బీరువాలో ఉన్న రూ. 50 వేలు దోచుకున్నారు. తర్వాత ఇంటి ముందు పార్క్‌ చేసిన మహీంద్ర ఎక్స్‌యూవీ వాహనాన్ని కూడా దొంగలించి అక్కడ నుంచి పరారయ్యారు.  

నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు 
కేసు దర్యాప్తు కోసం నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్‌ (క్రైమ్స్‌) లతా మాధురి ఆధ్వర్యంలో ఇన్‌చార్జ్‌ క్రైమ్‌ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి పర్యవేక్షణలో వెస్ట్‌ క్రైమ్‌ సీఐ మీసాల చంద్రమౌళి, ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ మరూఫ్, సీసీఎస్‌ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుల కోసం ఒకవైపు నగరంలో గాలిస్తూనే మరోవైపు వారి మొబైల్‌ డేటాలో అనుమానాస్పద యాప్‌లు, ట్రేడింగ్‌కు సంబంధించిన హిస్టరీ, ప్లాస్టర్‌ సెర్చ్‌ హిస్టరీ వంటి ఆధారాలను గుర్తించారు. దీంతో పోలీసులు నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్‌లలో గాలించారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితులు తిరిగి విశాఖకు వచ్చి బంగారం, నగదు పంచుకుంటుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి రూ.2.1 లక్షలు, 12 తులాల బంగారు ఆభరణాలు, మహీంద్రా కారును స్వా«దీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.  

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో అప్పులపాలు
ప్రధాన నిందితుడు కృష్ణకాంత్‌ తండ్రి ఆనంద్‌రెడ్డిలా వ్యాపారంలో సక్సస్‌ అవ్వాలని ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేశాడు. ఇందులో భారీగా నష్టపోయాడు. అప్పులు తీర్చేందుకు స్నేహితులు పీఎం పాలెంకు చెందిన పరపతి ప్రమోద్‌ కుమార్, కేఆర్‌ఎం కాలనీకి చెందిన షేక్‌ అభిõÙక్, మధురవాడకు చెందిన అవసరాల సత్య సూర్యకుమార్‌లతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలని ప్రణాళిక చేశాడు. వారం రోజుల ముందు వీరు సెల్‌ కాన్ఫరెన్స్‌లో నేరానికి ఏం ఉపయోగించాలి.. ఎలా తప్పించుకోవాలో ప్లాన్‌ చేశారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పని చెయ్యకపోవడంతో ఆ విషయం కూడా మాట్లాడుకుని నేరం చేస్తున్న సమయంలో హిందీ తప్ప మరే భాష మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు.

 ఈ సమయంలో కృష్ణకాంత్‌ తండ్రి ఆనంద్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లడంతో వీరు ఈ నెల 5వ తేదీ రాత్రికి ప్లాన్‌ అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్న విధంగా బామ్మతో పాటు కృష్ణకాంత్‌ను కట్టేసి బంగారం, నగదు దోచుకున్నారు. అనంతరం ఇంటి ముందు పార్క్‌ చేసి ఉన్న ఆనంద్‌రెడ్డి కార్‌లో పరారయ్యారు. అక్కడి నుంచి ఎన్‌ఏడీ, గోపాలపట్నం, ప్రహ్లాదపురం, అడవివరం, హనుమంతవాక వైపు నుంచి మారికవలస వెళ్లి అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో రోడ్డు పక్కన కారు వదిలి ఆటో ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చారు. బస్సులో ముందు విజయవాడ, అక్కడి నుంచి హైదరాబాద్‌ పారిపోయారు.

 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Crime thrillers
Crime News
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్‌

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

ప్రశాంతంగా చనిపోయాడు.. కాల్చి కాల్చి చంపాల్సింది..!

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

షాబాద్‌ హత్యకేసుల నిందితుడు రాజ్‌కుమార్‌ మృతి

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

శంషాబాద్‌ వద్ద ఘోర ప్రమాదం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

మరో ఎన్‌కౌంటర్‌: నకిలీ నోట్ల అక్రమ రవాణాదారు అజయ్‌పై కాల్పులు

మేడారంలో విషాదం..

మేడారంలో విషాదం..

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.