Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. రామ్‌ లక్ష్మణ్‌.. హ్యాపీ బర్త్‌ డే
ADVERTISEMENT 

రామ్‌ లక్ష్మణ్‌.. హ్యాపీ బర్త్‌ డే

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 31, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cow-birthday.jpg

కవలలుగా పుట్టిన రామ్‌ లక్ష్మణ్‌ లకు ఆ గ్రామంలో గురువారం మొదటి పుట్టిన రోజు (Birthday) వేడుక ఘనంగా జరిపారు. చప్పట్ల మధ్య పెద్ద కేక్‌ కట్‌ చేసి తినిపించారు. బంధుమిత్ర సపరివారంగా ఆ చిన్నారులను ఆశీర్వదించి, చివరిగా విందారగించారు. ఈ హడావుడి చూసి ఇదేదో చిన్న పిల్లల జన్మదిన వేడుక అనుకుంటున్నారేమో! ఇదంతా ఓ కుటుంబం సొంత బిడ్డల్లా సాకుతున్న దూడల జన్మదిన వేడుక. కాకినాడ జిల్లా (Kakinada District) ప్రత్తిపాడు మండలం చినశంకర్లపూడి గ్రామంలోని మిరియాల వెంకట్రాజు ఇల్లు ఈ వేడుకకు వేదిక అయ్యింది. వెంకట్రాజుకు చెందిన ఆవు (Cow) ఏడాది కిందట సరిగ్గా ఇదే తేదీన రెండు కవల దూడలకు జన్మనిచ్చింది. వాటికి రామ్, లక్ష్మణ్‌ (Ram Laxman) అని పేర్లు పెట్టారు. అవి పుట్టి ఏడాది పూర్తి కావడంతో ఘనంగా జన్మదిన వేడుక జరిపారు.      
– ప్రత్తిపాడు

కిలో మీటరు మేర డోలీ మోత 
గిరిజన ప్రాంతంలో గర్భిణులకు డోలీ  కష్టాలు తప్పడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక గిరి బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయతీ చెరువువీధి గ్రామానికి చెందిన కిల్లో వనితకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి కిలోమీటరు వరకు రహదారి సౌకర్యం లేదు. ఎటువంటి వాహనాలు రాలేని పరిస్థితి. దీంతో చేసేదేమీ లేక వనిత భర్త మోహన్‌రావు, కుటుంబ సభ్యుల సహాయంతో డోలీ కట్టి రహదారి సౌకర్యం ఉన్న బొడ్డగొంది గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి సంతోష్‌, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. 

ఈ సందర్భంగా చెరువువీధి గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో తమ గ్రామానికి రహదారి ఉండేదని, భూ సమస్య కారణంగా ఒక వ్యక్తి మధ్యలో పెద్ద గొయ్యి తవ్వేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. రహదారి సమస్య పరిష్కరించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా ఫలితంలేకుండాపోతోందని వాపోయారు.  
– ముంచంగిపుట్టు

చివరి మజిలీలో ‘దారి’ చిక్కులు
తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి మండలం, జింగిలిపాళెం దళితవాడకు చెందిన వెంకటేశ్‌ (34) మృతి చెందడంతో గురువారం ఆయన అంతిమ యాత్రకు చిక్కులు ఎదురయ్యాయి. రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్‌ మృతి చెందడంతో బంధువులు పాడె ఎత్తుకుని శ్మశానానికి బయల్దేరారు. అయితే దారి లేకపోవడంతో నానా అగచాట్లు పడుతూ పంట పొలాల గట్లు మీద నడుచుకుంటూ శ్మశాన వాటికకు చేరుకున్నారు. దీంతో ప్రశాంతంగా జరగాల్సిన అంత్యక్రియలు అవస్థల మధ్య జరగడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు.     
– రేణిగుంట

విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కాలేజీ మైదానంలో రెండు ఎద్దులు అధిపత్యం కోసం పోరాడాయి. వీటి మధ్య జరిగిన పోరును స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఓ దశలో ఇవి వారివైపునకు రాగా... స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. 
– సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం
 


ఒకవైపు పెట్రోలింగ్‌కు వాహనాలు లేవని చెబుతున్న పోలీసులు..చిన్న మరమ్మతులైన వాటినీ రిపేర్‌ చేయించకుండా మూలన పడేస్తున్నారు. దానికి ఈ చిత్రమే నిదర్శనం. విశాఖలోని మద్దిలపాలెం అవుట్‌పోస్ట్‌ వద్ద మరమ్మతులకు గురైన పోలీస్‌ పెట్రోలింగ్‌ బైక్‌ను నెలల తరబడి ఇలాగే వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. 
– సాక్షి ఫోటోగ్రాఫర్, విశాఖపట్నం

 
ఇది తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన ప్రసాదం కౌంటర్‌. లడ్డూలు లేకపోవడంతో ఇలా నో స్టాక్‌ బోర్డును టీటీడీ ఏర్పాటు చేసింది. దీంతో అక్కడికి వచ్చిన భక్తులు లడ్డు ప్రసాదం దొరక్క నిరాశతో వెనుదిరిగారు. 
– సాక్షి ఫోటోగ్రాఫర్, తిరుపతి

చ‌ద‌వండి: స‌ర్ప‌మా.. మేఘ‌మా!      

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
cow calf
birthday
kakinada
prathipadu
Photo feature
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

దమ్ముంటే నాపై పోటీచేయి నానాజీ.. MLC త్రిమూర్తులు సవాల్

దమ్ముంటే నాపై పోటీచేయి నానాజీ.. MLC త్రిమూర్తులు సవాల్

సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్‌( ఫొటోలు)

సౌత్ సినిమా నయా సెన్సేషన్.. మమితా బైజు బర్త్‌డే స్పెషల్‌( ఫొటోలు)

సుగాలి ప్రీతి కేసుపై పవన్‌ కల్యాణ్‌ పచ్చి అబద్ధాలు

సుగాలి ప్రీతి కేసుపై పవన్‌ కల్యాణ్‌ పచ్చి అబద్ధాలు

కొత్త మలుపు తిరిగిన చిన్నారి జానూ కేసు!

కొత్త మలుపు తిరిగిన చిన్నారి జానూ కేసు!

జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు సీసీ కెమెరాలో కుక్క కీలక క్లూ..?

జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు సీసీ కెమెరాలో కుక్క కీలక క్లూ..?

కాజల్ అగర్వాల్ బర్త్ డే.. ఫ్యామిలీతో క్యూట్ (ఫొటోలు)

కాజల్ అగర్వాల్ బర్త్ డే.. ఫ్యామిలీతో క్యూట్ (ఫొటోలు)

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.