Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. నిరుపేద కుటుంబంలో వెలుగులు 
ADVERTISEMENT 

నిరుపేద కుటుంబంలో వెలుగులు 

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 25, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
boy.jpg

తొమ్మిదేళ్ల మహమ్మద్‌కు కొత్త జీవితాన్ని ప్రసాదించిన సీఎం జగన్‌

పాఠశాలలో ప్రమాదవశాత్తు కిందపడి పూర్తిగా చితికిపోయిన బాలుడి  స్వరపేటిక, శ్వాసనాళం.. అరుదైన శస్త్ర చికిత్సకు రూ.6 లక్షలకు పైగా ఖర్చు

ఇటుక బట్టీలో కూలి పనులు చేసుకునే ఆ కుటుంబానికి స్థోమతకు మించిన భారం

పూర్తి ఖర్చులు భరించిన రాష్ట్ర ప్రభుత్వం 

మరో శస్త్ర చికిత్సతో త్వరలో మాటలు వస్తాయన్న వైద్యులు

సాక్షి, అమరావతి: నిరుపేద కుటుంబాన్ని పెద్దకష్టం చుట్టుముట్టింది. ఊహించని ప్రమాదంలో తొమ్మి­దేళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడి నోట మాటలేక, శ్వాసకూడా తీసుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. బాలుడి చికిత్సలకు రూ.లక్షల్లో ఖర్చవుతాయని వైద్యులు చెప్పడంతో అంత డబ్బును సమకూర్చలేని నిస్సహాయత వారిది. ఆపద సమయంలో సీఎం జగన్‌ ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇవ్వడమే కాకుండా.. ఖరీదైన చికిత్సను చేయించింది. ఆ నిరుపేద కుటుంబంలో వెలుగులు నింపింది. 



స్వరపేటిక, శ్వాసనాళం చితికిపోయి.. 

పల్నాడు జిల్లా నకరికల్లులోని పాతూరుకు చెందిన షేక్‌ బాజీ, ఖాజాబీ ఇటుక బట్టీల్లో కూలీ పనులు చేసుకుంటుంటారు. వీరికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తొమ్మిదేళ్ల అనాస్‌ మహమ్మద్‌ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.

ఈ ఏడాది ఫిబ్రవరి 29న పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ కిందపడిపోయాడు. ప్రమాదంలో బాలుడి గొంతుకు ఇనుపరాడ్‌ బలంగా గుచ్చుకుపోయింది. స్వరపేటిక, శ్వాసనాళం పూర్తిగా చితికిపోయాయి. హుటాహుటిన నరసరావుపేట ప్రభుత్వా్రస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించిన వైద్యులు అంబులెన్స్‌లో వెంటిలేటర్‌పై హైదరాబాద్‌ తరలించారు. 



మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం 

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద 3,257 ప్రొసీజర్‌లతో లక్షలాది మంది బాధితులకు అండగా సీఎం జగన్‌ నిలిచారు. అక్కడితో ఆగకుండా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాని అరుదైన జబ్బుల బారినపడి రూ.లక్షలు, కోట్లలో వైద్యానికి ఖర్చయ్యే వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహమ్మద్‌ విషయంలోనూ సీఎం జగన్‌ మానవతా ధృక్పథంతో స్పందించారు.

బాలుడి చికిత్సకు ఎంత ఖర్చయినా వెనుకాడొద్దని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎంవో అధికారులు హైదరాబాద్‌లోని ఆస్పత్రి యాజమాన్యానికి ఫోన్‌చేసి బాలుడి శస్త్ర చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని, వెంటనే శస్త్ర చికిత్సలు నిర్వహించాలని సూచించారు. దీంతో వైద్యులు అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్‌ రీకన్‌స్ట్రక్షన్‌ శస్త్ర చికిత్సను చేపట్టారు.

చికిత్స అనంతరం వైద్యుల పరిశీలన ముగించుకుని ఈ నెల 14న బాలుడు డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లా­డు. మరో మూడు నెలల అనంతరం ఇంకొక సర్జరీ చేస్తే బాలుడు ముందులా మాట్లాడగలుగుతాడని వై­ద్యు­లు చెబుతున్నారు. ఆపద కాలంలో సీఎం జగన్‌ చేసి­న మేలును ఎప్పటికీ మరువలేమని ఖాజా­బీ దంపతులు కన్నీటి పర్యంతం అవుతు­న్నారు. తమ బిడ్డ తమకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యామని భావోద్వేగానికి గురవుతున్నారు.

ఒక్క ట్వీట్‌తో స్పందించిన ప్రభుత్వం     

దెబ్బతిన్న స్వరపేటిక, శ్వాసనాళానికి అత్యంత క్లిష్టమైన లెరింగోట్రైకెల్‌ రీకన్‌స్ట్రక్షన్‌  శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారించారు. ఆ చికిత్స నిర్వహణ, వైద్య పరీక్షలు, మందులకు రూ.6 లక్షలకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. రెక్కలు ముక్కలయ్యేలా కష్టం చేసే ఖాజాబీ దంపతులకు అంత పెద్ద­మొత్తంలో అప్పు పుట్టని పరిస్థితి.

వారి నిస్సహాయ స్థితిని చూసిన గ్రామస్తులంతా తలా కొంత ఇవ్వడానికి ముందుకొచ్చారు. అయినప్పటికీ.. చికిత్సకు సరిపోయేంత డబ్బు సమకూరకపోవడంతో మహమ్మద్‌ను ఆదుకోవాలంటూ ఓ డాక్టర్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై ఏపీ సీఎంవో అధికారులు స్పందించారు. ఈ విషయాన్నివెంటనే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. 



దేవుడిలా ఆదుకున్నారు 

రోజూ పనికెళ్లి కూలి డబ్బులతో జీవిస్తున్నాం. తెచ్చుకుంటే తినాలి.. లేదంటే పస్తులుండాలి. ఇది మా జీవితం. అలాంటి మాపై ఉపద్రవంలా పెద్ద కష్టం వచ్చిపడింది. వెంటిలేటర్‌పై బాబును చూసి మాకు దక్కుతాడో లేదోనని ఎంతో ఆందోళనకు గురయ్యాను. ఆపరేషన్‌కు రూ.6 లక్షలు ఖర్చవుతుందనగానే నా నోట మాట లేదు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో కూడా దిక్కుతోచని పరిస్థితి. ఆ సమయంలో దేవుడిలా సీఎం జగన్‌ ఆదుకున్నారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా భరిస్తామని చెప్పారు. ఈ రోజు మా బాబు సీఎం జగన్‌ దయవల్లే దక్కాడు.     – షేక్‌ ఖాజాబీ, బాలుడి తల్లి 



మా పిల్లల చదువులకు అండగా నిలిచారు 

ఆ దేవుడు మా బిడ్డకు జన్మ ఇస్తే. సీఎం జగన్‌ పునర్జన్మ ఇచ్చారు. మా కుటుంబంలో వెలుగులు నింపారు. ఏమిచ్చినా ఆయన రుణం మేం తీర్చుకోలేం. అమ్మ ఒడి రూపంలో మా బిడ్డల చదువులకు చేదోడుగా ప్రభుత్వం నిలిచింది. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రభుత్వం మాకు ఇంటిస్థలం కూడా మంజూరు చేసింది.     – షేక్‌ బాజీ, బాలుడి తండ్రి

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Mohammed
Surgery
cm relief fund
YS Jagan Mohan Reddy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

రేపు, ఎల్లుండి వైఎస్సార్‌ జిల్లాలో వైఎస్‌ జగన్‌ పర్యటన

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.