Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. YSRCP.. జయహో ‘బీసీ’
ADVERTISEMENT 

YSRCP.. జయహో ‘బీసీ’

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 18, 2024 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BC-12R.jpg

అసెంబ్లీ, లోక్‌సభ కలిపి 59 స్థానాలను ఆ వర్గాలకు కేటాయించిన సీఎం జగన్‌

గత ఎన్నికల కంటే ఇప్పుడు 11 స్థానాలు అధికం

దేశ చరిత్రలో బీసీలకు ఈ స్థాయిలో సీట్లు కేటాయించిన దాఖలాలు లేవంటున్న సామాజికవేత్తలు

గత 58 నెలల పాలనలో వారిని సమాజానికి వెన్నెముకగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి

2019, ఫిబ్రవరి 17న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన దానికంటే ఆ వర్గాలకు అధికంగా న్యాయం

మంత్రివర్గం నుంచి నామినేటెడ్‌ పదవుల వరకూ సమున్నత స్థానం

డీబీటీ, నాన్‌ డీబీటీ రూపంలో వారికి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనం 

ఇలా చెప్పిన దానికంటే అధికంగా న్యాయం చేసిన జగన్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్న బీసీలు

భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభల్లో అది తేటతెల్లం

అదే 2012లో బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటికీ చంద్రబాబు పాతర

కనీసం కేబినెట్‌లో కూడా ప్రాధాన్యత లేదు.. పైగా ఒక్క బీసీని రాజ్యసభకు పంపని టీడీపీ అధినేత

బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని.. తోకలు కత్తిరిస్తానంటూ ఆ వర్గాలను హేళన చేసిన బాబు

ఇప్పుడు కేవలం 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో మరోసారి ఆయన తమను వంచించారంటూ ఫైర్‌.. తమ వెన్నువిరిచిన చంద్రబాబు నాయకత్వంపై బీసీల్లో ఆగ్రహావేశాలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ,అగ్రవర్ణ పేదలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తుండటంతో ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే అంటున్న విశ్లేషకులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత 58 నెలలుగా సమాజానికి వెన్నెముకగా బీసీలను తీర్చిది­ద్దుతున్న ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వారికి 48 శాసనసభ, 11 లోక్‌సభ స్థానాలు వెరసి మొత్తం 59 స్థానాలు కేటాయించి వారికి పెద్దపీట వేశారు. తద్వారా తన భవిష్యత్తు ప్రణాళికను కూడా ఆయన సుస్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 294 శాసనసభ, 48 లోక్‌సభ స్థానాలు ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో బీసీలకు ఎవరూ అవకాశం ఇచ్చిన దాఖలాల్లేవు.



ఉత్తరప్రదేశ్‌లో బీసీ నేత అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), తమిళనాడులో స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కూడా సీఎం జగన్‌ ఇచ్చిన రీతిలో బీసీలకు అవకాశం ఇవ్వలేదని.. దేశ చరిత్రలో ఇదో రికార్డు అని సామాజికవేత్తలు ప్రశంసిస్తున్నారు. నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీనీ ఆయన అధికారంలోకి వచ్చాక అమలుచేయకుండా తమను వంచించారని బీసీలు రగలిపోతున్నారు.



అదే వైఎస్‌ జగన్‌ గత ఎన్నికలకు ముందు 2019, ఫిబ్రవరి 17న ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో తమకు చెప్పిన దానికంటే అధికంగా చేస్తుండడంపై బీసీలు హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు చంద్రబాబును ఛీకొట్టగా.. బీసీలు కూడా తమను రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అక్కున చేర్చుకున్న సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు.



భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలకు తరలివచ్చిన జనసందోహం ఇందుకు నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలు వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడేనని వారు స్పష్టంచేస్తున్నారు. మొత్తం మీద శాసనసభ, లోక్‌సభ స్థానాలు కలిపి గత ఎన్నికల కంటే ఇప్పుడు అదనంగా 11 స్థానాలను సీఎం జగన్‌ తమకు కేటాయించడంపై వారు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

అవమానించి, అవహేళన చేసిన బాబు..

నిజానికి.. రాష్ట్ర విభజనకు ముందు 2012, జూలై 9న చంద్రబాబు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇస్తామని.. బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఏటా రూ.పది వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని.. చేనేత, పవర్‌లూమ్స్‌ రుణా­లను మాఫీ చేస్తానని అందులో ప్రకటిం­చారు. కానీ.. 2014 ఎన్నికల్లో అభ్య­ర్థుల ఎంపికలోనే బీసీలకు వెన్నుపోటు పొడి­చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారి సబ్‌ప్లాన్‌కు పాతరేశారు.



అలాగే, ఐదేళ్లలో బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా రూ.50 వేల కోట్ల వరకు ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి.. అందులో సగం కూడా ఖర్చుచేయలేదు. పైగా.. మంత్రివర్గంలో వారికి సముచిత స్థానం కల్పించని చంద్రబాబు.. 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అంతేకాక..  న్యాయమూర్తులుగా బీసీలు పనికి­రారంటూ వారిని అవహేళన చేశారు.



ఇచ్చిన హామీలు అమలుచేయాలని అడిగిన బీసీలను తాట­తీస్తా.. తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తమపై వల్లమాలిన ప్రేమను ఒలకబోస్తున్న చంద్ర­బాబు.. ఇప్పటిదాకా ఖరారు చేసిన 128 అ­సెంబ్లీ స్థానాల్లో కేవలం 24 స్థానాలనే తమకు కేటాయించడంపై బీసీలు భగ్గుమంటున్నారు.   

ఇచ్చిన మాటకంటే అధికంగా..

ఇక గత ఎన్నికలకు ముందు వైఎస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు. అందులో వారికిచ్చిన మాట కంటే గత 58 నెలలుగా అధికంగానే న్యాయం చేశారు. ఉదా..

► గత ఎన్నికల్లో 41 శాసనసభ స్థానాలు, ఏడు లోక్‌సభ స్థానాల్లో బీసీ వర్గాల అభ్యర్థులను బరిలోకి దించిన జగన్‌.. అధికారంలోకి వచ్చాక కేబినెట్‌లో ఆ వర్గాలకు చెందిన 11 మందికి మంత్రి పదవులిచ్చారు. ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించడంతోపాటు ప్రధానమైన రెవెన్యూ, విద్యా, పౌరసరఫరాలు, వైద్యం, ఆరోగ్యం లాంటి ప్రధానమైన శాఖలను ఆ వర్గాలకే అప్పగించి పరిపాలనలో వారికి సముచిత భాగస్వామ్యం కల్పించారు. శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్‌కు అవకాశమిచ్చారు. 

► ఈ వర్గాలకే చెందిన నలుగురిని రాజ్యసభకు పంపిన సీఎం జగన్‌ శాసనమండలిలో సైతం సింహభాగం పదవులు వారికే ఇచ్చారు. 

► ఇక స్థానిక సంస్థల్లో వైఎస్సార్‌సీపీకి దక్కిన 13 జెడ్పీ చైర్మన్‌ పదవులకుగాను ఆరు బీసీలకే ఇచ్చారు. 

► 84 మున్సిపల్‌ చైర్మన్‌ పదవులకుగానూ 44 వారికే కేటాయించారు. 14 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకుగానూ తొమ్మిది బీసీలకే దక్కేలా చేశారు. 

► అలాగే, నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు కేటాయించేలా ఏకంగా చట్టం చేసి మరీ ఇచ్చారు. 

► మరోవైపు.. గత 58 నెలలుగా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.1.23 లక్షల కోట్లు, నాన్‌ డీబీటీ రూపంలో రూ.50 వేల కోట్లు వెరసి రూ.1.73 లక్షల కోట్ల ప్రయోజనాన్ని బీసీలకు చేకూర్చారు. దీంతో.. రాజకీయ, ఆర్థిక, విద్యా, మహిళా సాధికారత ద్వారా బీసీలు సామాజిక సాధికారతను సాధించారు.  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
YSR Congress Party
YS Jagan Mohan Reddy
bc declaration
General Elections 2024
AP Elections 2024
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

వైఎస్సార్‌సీపీ మ‌హిళా విభాగం నిర‌స‌న‌లు

వైఎస్సార్‌సీపీ మ‌హిళా విభాగం నిర‌స‌న‌లు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

టెట్‌లో వీళ్లూ పాస్‌ కావాలనడం ఎంతవరకు కరెక్టు?: వైఎస్‌ జగన్‌

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

YS Jagan Gave The Assurance To The Leaders Of Teachers Associations

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.