Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులిస్తాం
ADVERTISEMENT 

ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులిస్తాం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Mar 9, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cbn.jpg

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు  

మార్కాపురం/తర్లుపాడు:  ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఇకపై ఎన్ని కాన్పులైనా ప్రసూతి సెలవులు ఇస్తా­మని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో తానే జనాభా నియంత్రణ పాటించాలని చెప్పానని, అయితే భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో ఎంతమంది పిల్లలను కన్నా మహిళా ఉద్యోగుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు  బదులిచ్చారు. ఆయన ఏమన్నారంటే.. మహిళలను లక్షాధికారులుగా మారుస్తా. ఈ ఏడాదిలో లక్ష మంది మహిళా పారిశ్రా­మికవేత్తలను తయారుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాను.

రాష్ట్రంలో వంద మంది మహిళా పారిశ్రామికవేత్తలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలి. పాతికేళ్ల క్రితం నేను డ్వాక్రా గ్రూపులను తయారుచేస్తే అందరూ విమర్శించారు. కానీ, ఇప్పుడు వారు రాజకీయ, ఆర్థిక శక్తిగా మారడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళా దినోత్సవం రోజున రాష్ట్ర ప్రభుత్వం 21 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్వాక్రా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ప్రపంచ­స్థాయి గుర్తింపు, మార్కెటింగ్‌ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. పరిశ్రమలు స్థాపించే మహిళలకు 45 శాతం రాయితీ కల్పించి ప్రోత్సహిస్తాం.

ఈరోజున రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు రూ.లక్ష కోట్ల అప్పు తీసుకునే స్థాయికి వచ్చాయి. మహిళల కోసమే ర్యాపిడో, అరకు కాఫీ, ఫ్లిప్‌కార్ట్‌ వంటిసంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ప్రతి మేజర్‌ పంచాయతీలో అరకు కాఫీ కేంద్రాన్ని మహిళలు ఏర్పాటుచేయాలి. టెక్నాలజీని ఉపయోగించుకుని వర్క్‌ ఫ్రం హోం ద్వారా మహిళలు రాణించాలి.  

ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం  
ఈ ఏడాది నుంచి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తాం. మే నుంచి అన్నదాత సుఖీభవ పథకాలను అమలుచేస్తాం. ప్రపంచంలో ఉండే ప్రముఖ కంపెనీలు, వ్యక్తులను మన రాష్ట్రానికి తీసుకొస్తా. ఈ రోజున డ్వాక్రా మహిళలకు రూ.1,826.43 కోట్ల రుణాలు అందిస్తున్నాం. 

డ్వాక్రా మహిళలు సొంత ఊరిలోనే ఉండి వ్యాపారాలు చేయాలి. టీవీల్లో, బయట, సోషల్‌ మీడియాల్లో మహిళల గురించి ఎవరైనా అసభ్యంగా మాట్లాడితే క్షమించేది లేదు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ నిరోధానికి ఈగల్‌ వ్యవస్థను ఏర్పాటుచేశాం. దీపం పథకం కింద ఏడాదికి మూడు సిలిండర్లు అందిస్తున్నాం.  

వెలిగొండకు గోదావరి, కృష్ణా నీళ్లు పారిస్తా.. 
ఈ సమావేశంలో ఒక మహిళ, విద్యారి్థని అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిస్తూ.. తానే వెలిగొండకు శంకుస్థాపన చేశానని, తానే పూర్తిచేసి గోదావరి, కృష్ణా జలాలను వెలుగొండ ద్వారా ఈ ప్రాంతానికి పారిస్తానని చెప్పారు. అలాగే, బనకచర్ల–గోదావరి ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని తరలిస్తామన్నారు. త్వరలో మార్కాపురం జిల్లాను ఏర్పాటుచేస్తానని, అప్పుడు ఈ ప్రాంత సమస్యలు తీరతాయని ఆయన చెప్పారు.  

మహిళా లబ్ధిదా­రులకు చంద్రబాబు ఈ–ఆటోలు, బైక్‌లు అందించారు. మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన శక్తియాప్‌ను డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా, మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఐజీపీ రాజకుమారి, ఎస్పీ దామోదర్‌ల సమక్షంలో సీఎం ప్రారంభించారు. 

ఎమ్మెల్యే పనితీరు ఆశాజనకంగా లేదు.. 
అనంతరం టీడీపీ కార్యకర్తలతో జరిగిన ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడుతూ ఇక్కడి ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు ఆశాజనకంగాలేదన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి అండగా ఉంటానన్నారు. ఇక మహిళా దినోత్సవం రోజున జరుగుతున్న ఈ సమావేశంలో 50 శాతం మహిళలు ఉండాల్సి ఉండగా, కేవలం ఒక్క శాతమే ఉన్నారంటే పరిస్థితిని ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. 

సామాజికంగా, రాజకీయంగా ఓటు బ్యాంకు పెంచే బాధ్యత తనదని తెలిపారు. ఇదిలా ఉంటే.. సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు ఎండ వేడికి తట్టుకోలేకపోయారు. ఒంగోలు ఏఆర్‌ కానిస్టేబుల్‌ రమణయ్య స్పృహతప్పి పడిపోయారు.  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Women's Day 2025
International Women's Day 2025
Chandrababu Naidu
Andhra Pradesh
Maternity leave
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.