Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. దుర్మార్గం.. మహాపచారం
ADVERTISEMENT 

దుర్మార్గం.. మహాపచారం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 19, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
bhumana.jpg

తిరుమల మహా ప్రసాదంపై సీఎం చంద్రబాబు ఉన్మాద వ్యాఖ్యలు

ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం క్షమార్హం కాదు

టీటీడీ మాజీ చైర్మన్‌లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మండిపాటు

ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి.. ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారుతానని మరోమారు నిరూపించారు

అలిపిరి ఘటనలో దేవదేవుడి దయ వల్లే బతికి బయటపడి ఇప్పుడిలా దారుణ వ్యాఖ్యలు

ఇలా అన్యాయంగా అభాండాలు వేస్తే సర్వనాశనమవుతారు

తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావు

సాక్షి, అమరావతి: ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడు తిరుమల మహా ప్రసాదమైన లడ్డూపై చేసిన ఉన్మాద వ్యాఖ్యల పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వందల కోట్ల భక్తులు విస్తుపోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బ తినే రీతిలో విస్మయకరమైన వ్యాఖ్యలు నిరా­ధారంగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. జంతువుల నూనెలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారని ఒక హిందువుగా చంద్రబాబు నోటి వెంట అలాంటి మాటలు ఎలా వచ్చాయని నివ్వెరపోతున్నారు. అత్యంత సున్నితమైన అంశాన్ని కావాలని వివాదంగా మార్చి, రాజకీ­యంగా లబ్ధి పొందాలనే దుగ్ధకు తిరుమలను వాడుకోవడం దారుణం, దుర్మార్గమని నిప్పులు చెరుగుతున్నారు. 

మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ ఇంత దారుణంగా మాట్లాడరని, రాజకీయాల కోసం దేవదేవుడినీ వదలక పోవడం పెద్ద పాపమని చెబుతున్నారు. కొంత కాలంగా చంద్రబాబు మానసిక పరిస్థితి పలు సందేహాలకు తావిస్తోందంటున్నారు. ఒక్క ప్రభుత్వ మెడికల్‌ కళాశాల తేకపోగా, వచ్చిన సీట్లను కూడా వద్దని కాలదన్నడం.. వరదల్లో అమరావతి మునగడం ప్రత్యక్షంగా అందరి కళ్లకు కనిపిస్తున్నా, ఆ మాటంటే నోటికి తాళమేస్తానని హెచ్చరించడం.. వరద బాధితులను ఆదుకోవడంలో విఫలమవ్వడం.. వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే తాజాగా తిరుమల ప్రసాదాన్ని వివాదం చేశారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు. 

ఏమాత్రం విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అని, ఇలాంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హతే లేదని మండిపడుతున్నారు. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రంగా మార్చి లబ్ధి పొందాలనుకుంటే సర్వనాశం అవుతారని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు మాజీ చైర్మన్‌లు భూమన కరుణాకర్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు నిప్పులు చెరిగారు.  

పరాకాష్టకు బాబు బురద రాజకీయాలు 
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై చంద్రబాబు చేసిన ఆరోపణలు అత్యంత దుర్మార్గం. రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ స్వార్థం కోసం భగవంతుడ్ని వాడుకుంటే.. అలాంటి ఆరోపణలు చేసినవాడ్ని భగవంతుడు క్షమించడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వేంకటేశ్వరస్వామి దుష్టశిక్షణ చేస్తాడని స్వయంగా చంద్రబాబే పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇలాంటి నీచమైన ఆరోపణలు చేసిన వ్యక్తిని భగవంతుడు చూస్తూ ఊరుకోడు. 


రాజకీయ ప్రత్యర్థులను దృష్టిలో ఉంచుకుని భగవంతుడి పేరుమీద ఆరోపణలు చేయడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో వైఎస్సార్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలు చేసిన సందర్భాలున్నాయి. దీనికి అప్పుడు భగవంతుడు శిక్ష కూడా విధించాడు. అయినా చంద్రబాబు మారలేదు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలే చేస్తున్నాడు. వాస్తవం ఏంటంటే, తిరుమలలో అన్న ప్రసాదాలు తయారు చేసే విషయంలో అధికారులకు ఎలాంటి ప్రమేయం ఉండదు. పవిత్రమైన శ్రీ వైష్ణవుల అమృత హస్తాల మీదుగా ఈ పదార్థాలు తయారవుతాయి. 

ప్రసాదాల్లో పదార్థాల వినియోగం వారి చేతుల మీదుగా ఉంటుంది. అలాంటి వారి హస్తాల మీదుగా తయారయ్యే ప్రసాదాల మీద చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడంటే ఆయన బురద రాజకీయాలు పరాకాష్టకు చేరాయి. ఈ దఫా అధికారంలోకి వచ్చింది మొదలు తిరుమల వేదికగా చంద్రబాబు చేసిన విష ప్రచారాలు అన్నీ ఇన్నీకావు. చివరకు ఏమీ దొరక్క పోవడంతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. – భూమన కరణాకర్‌రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్‌  

చంద్రబాబు పెద్ద పాపమే చేశాడు
దివ్య క్షేత్రం తిరుమల పవిత్రతను, వందల కోట్ల మంది హిందువుల విశ్వాసాలను చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బ తీసి పెద్ద పాపమే చేశాడు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం. మనిషి పుట్టుక పుట్టిన వారెవ్వరూ కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇలాంటి ఆరోపణలు చేయరు. 

రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనుకాడడని మరోమారు నిరూపించుకున్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదం విషయంలో నేను, నా కుటుంబం ఆ దేవ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాం.  చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా?   – వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ బోర్డు మాజీ ఛైర్మన్‌

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
Andhra Pradesh
tirumala
Chandrababu Naidu
Bhumana Karunakar Reddy
YV Subba Reddy
laddu prasadam
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.