Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. ఐదు భాషల్లో అనర్గళంగా!
ADVERTISEMENT 

ఐదు భాషల్లో అనర్గళంగా!

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Feb 18, 2025 Sakshi Read Time Read Time: 3 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
AP-Govt-School-Student.jpg

బహుభాషలు నేర్చుకోవడంపై ఆసక్తి

శాంతిపురం: ఒక దీపం అనంత దీపాలను వెలిగించినట్టు.. తపన ఉన్న ఓ ఉపాధ్యాయుడు తలిస్తే వందల, వేల మంది విద్యార్థులను ప్రతిభావంతులుగా ఎలా తీర్చిదిద్దవచ్చన్నది చిత్తూరు జిల్లా (Chittoor District) శాంతిపురం, శెట్టేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల చాటుతోంది. మారుమూల గ్రామంలో ఉన్న ఈ స్కూలు విద్యార్థులు బహుభాషలపై తమ ప్రత్యేకతను చాటుకొంటున్నారు. పాఠ్యాంశాల్లోని తెలుగు (Telugu), ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు కన్నడం, తమిళం, మలయాళీ (Malayalam) భాషలు ఇక్కడి విద్యార్థులు సులువుగా రాయటం, చదవడం, మాట్లాడడం చేస్తున్నారు. ఒక భాషలోని పద్యాలు, రచనలను మరో భాషలోకి అనువాదం చేయగలుగుతున్నారు.  

ప్రత్యేక పరీక్షల్లో ఉత్తీర్ణత 
అధికారుల అనుమతితో ఆయా భాషల్లో ప్రావీణ్యులైన ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చి విద్యార్థుల భాషాపరిజ్ఞానంపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. గుడుపల్లి ఏపీ మోడల్‌ స్కూలు ఉపాధ్యాయుడు షిజో మైకెల్‌ మలయాళంపై, గుడుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం ఎస్‌కే.మణి తమిళంపై, కర్ణాటకలోని వేమన విద్యా సంస్థల ఉపాధ్యాయురాలు ఎస్‌వనజాక్షి కన్నడ భాషపై మొత్తం 94 మంది విద్యార్థుల స్థాయిలను ఇటీవల పరీక్షించారు. వీరిలో కన్నడంలో 93 మంది, మలయాళంలో 45 మంది, తమిళంలో 36 మంది సంతృప్తికర ప్రతిభను చాటుకున్నారు.  

ప్రధానోపాధ్యాయుని సంకల్పం 
ఇక్కడ ప్రధానోపాద్యాయుడుగా ఉన్న తీగల వెంకటయ్య భాషల పట్ల ఆసక్తితో రూపకల్పన చేసిన కార్యక్రమం విద్యార్థులను బహుభాషా కోవిదులుగా తయారు చేస్తోంది. తీరిక వేళల్లో హెచ్‌ఎం ఇస్తున్న తర్ఫీదు, మిగతా ఉపాధ్యాయుల సహకారం అందిపుచ్చుకుని అన్ని బాషల్లోనూ తమ పట్టును పెంచుకొంటున్నారు. మాతృభాష (Mother Tongue) వస్తే మరెన్ని భాషలైనా నేర్వవచ్చనే ఆలోచనతో హెచ్‌ఎం తీగల వెంకటయ్య ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి తన ప్రత్యేక బోధనా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

చ‌ద‌వండి: సోలో లైఫే సో బెట‌రూ అంటున్న యువ‌తులు!  

6, 7, 8, 9 తరగతుల వారికి భాషల గురించి చెప్పి, కేవలం 26 సరళమైన పదాలతో బోధన ప్రారంభించారు. ఎవరైనా ఉపాధ్యాయులు లేని సమయంలో వారి తరగతులను తీసుకుని విద్యార్థులకు దీనిపై పాఠాలు చెప్పారు. విద్యార్థులు కూడా ఇతర భాషలు నేర్చుకోవటంపై ఆసక్తి చూపడంతో సొంత ఖర్చులతో వారికి మలయాళం, తమిళం, కన్నడ పుస్తకాలను కొనిచ్చారు. ఈ ఆసరాను అందిపుచ్చుకున్న పిల్లలు ఆయా భాషలపై సులువుగా పట్టు సాధిస్తున్నారు.  

నా విశ్వాసం పెరిగింది  
ప్రైమరీ స్కూలు రోజుల నుంచి భాషలే నాకు ఇబ్బందిగా ఉండేవి. అక్కడ తెలుగు, ఇంగ్లీషు ఉంటే 6వ తరగతిలో చేరగానే వాటికి హిందీ కూడా తోడయ్యి అంతా అయోమయంగా ఉండేది. కానీ సులువుగా భాషలు నేర్చుకునే టెక్నిక్‌ తెలుసుకున్న తర్వాత తెలుగు, ఇంగ్లీషు, హిందీతో పాటు కన్నడ, తమిళం కూడా నేర్చుకొంటున్నాను. నాపై నాకు విశ్వాసం పెరిగింది.  
– బీ.రామాచారి, 8వ తరగతి

ఎన్ని భాషలైనా నేర్వవచ్చు 
నేను రూపొందించిన ప్రాజెక్టు నమూనాతో 20–25 రోజుల్లోపు ఏ బాషలైనా నేర్చుకోవచ్చు. అందరు విద్యార్థులకు దక్షిణ భారత భాషలను నేర్పితే వారి నిత్య జీవనంలో అది ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుంది 
– తీగల వెంకటయ్య, హెచ్‌ఎం

5 భాషలు నేర్చుకొంటున్నా  
కొత్త భాషలను సులువుగా నేర్చుకోవటం భలే సరదాగా ఉంది. ఏడాది క్రితం వరకూ తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లోని పాఠ్యాంశాలు నేర్చుకోవటానికే కష్ట పడేదాన్ని. కానీ మా హెడ్మాస్టర్‌  చెప్పిన విధానం పాటించటంతో ఆ భాషలతో పాటు మలయాళం, తమిళం, కన్నడ కూడా సులువుగా నేర్చుకున్నాను. ఇదే ప్రేరణతో భవిష్యత్తులో నేను భాషా పండిట్‌ అవుతాను. 
– కె.ధరణి, 9వ తరగతి

విస్తరిస్తే బాగుంటుంది 
వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని, విద్యార్థుల మిగతా పాఠ్యాంశాలకు ఇబ్బంది కలగకుండా మా హెచ్‌ ఎం చేసిన ప్రయోగం సత్ఫలితాలను ఇచ్చింది. విద్యాశాఖ ఉన్నత అధికారులు ఈ నమూనాను పరిశీలించి మిగతా స్కూళ్లకు కూడా విస్తరిస్తే బాగుంటుంది. ఇంగ్లీషు, హిందీలకు అదనంగా పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడిని కేటాయించినా కనీసం మరో మూడు భాషలు పిల్లలకు నేర్పవచ్చు. పోటీ ప్రపంచంలో కేవలం భాషలపై అవగాహన లేకపోవటం వల్లే చాలా మంది సరైన ఉద్యోగాలు పొందలేక పోతున్నారు.  
– నాగభూషణం, ఇంగ్లీష్‌ టీచర్‌  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
govt school
chittoor
multi langual
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

‘ఆ డబ్బులతోనే నలుగురి అంత్యక్రియలు చేయండి’

‘ఆ డబ్బులతోనే నలుగురి అంత్యక్రియలు చేయండి’

సర్కారు బడా.. వద్దులే సారూ!

సర్కారు బడా.. వద్దులే సారూ!

మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

పలమనేరు కారు రోడ్డు ప్రమాదం CCTV దృశ్యాలు

పలమనేరు కారు రోడ్డు ప్రమాదం CCTV దృశ్యాలు

కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

కారును ఢీకొట్టిన లారీ.. ఐదుగురు మృతి

Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

Chittoor: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.