Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. శీతాకాలంలో ఇంధన కరువు
ADVERTISEMENT 

శీతాకాలంలో ఇంధన కరువు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Sep 21, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
SOLAR-AND-WIND.jpg

ఏటా 9 రోజులు వాతావరణ పరిస్థితుల్లో మార్పులు  

42 సంవత్సరాల్లో పరిస్థితులపై అధ్యయనం  

1979–2022 మధ్య రెండుసార్లు ఇంధన కరువు 

భవిష్యత్‌లో తరచూ వచ్చే అవకాశం

సాక్షి, అమరావతి: ‘పునరుత్పాదక ఇంధన కరువు’ వినడానికి కొత్తగా ఉన్న ఈ పదం ఇప్పుడు వాతావరణ, ఇంధన రంగ నిపుణులను కలవరపరుస్తోంది. నీటి కరువు, ఆహారం కరువు, ఎరువుల కరువు.. అంటూ అనేక కరువుల గురించి వింటుంటాంగానీ.. ఈ ఇంధన కరువు ఏమిటనే సందేహం సహజంగానే కలుగుతుంది. ఇంధన కరువు కూడా వస్తుంది. ఇది వస్తే విద్యుత్‌ కొరత ఏర్పడుతుంది.

బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్‌ను కొనాల్సి వస్తుంది. వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పులే ఇంధన కరువుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పైగా పునరుత్పాదక ఇంధన పెట్టుబడులను వాతావరణ మార్పు ఫలితాలు భవిష్యత్తులో ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు, ఇంధన, పర్యావరణరంగ నిపుణుల సలహాలు, సూచనల మేరకు గతంలో చోటుచేసుకున్న వాతావరణ మార్పులు, చరిత్రలో ఎదురైన ఇంధన కరువు వంటి సంఘటనలపై పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.  

సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తి తగ్గుతుంది  
పునరుత్పాదక ఇంధన కరువు వంటి ఘటనలను అంచనా వేయడానికి పరిశోధకులు మన దేశ చారిత్రక వాతావరణ నమూనాలను విశ్లేషించారు. 1979 నుంచి 2022 వరకు 42 సంవత్సరాలను అధ్యయనం చేశారు. సౌర, పవన విద్యుత్‌ ఏ సమయంలో తక్కువగా ఉందనే సమాచారాన్ని సేకరించారు. ఇంగ్లండ్‌కు చెందిన కొందరు పరిశోధకులు జరిపిన అధ్యయనం మన దేశంలో 30 వేర్వేరు వాతావరణ నమూనాలను విశ్లేషించింది. పునరుత్పాదక ఇంధన కరువు సంభవించిన రోజుల్లో, వాటికి సంబంధించిన మూడు విభిన్నమైన అసాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది.

ఈ వాతావరణ పరిస్థితులు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని వివిధ మార్గాల్లో ప్రభావితం చేశాయి. ఈశాన్య రుతుపవనాలు పవన శక్తి ఉత్పత్తిని ప్రభావితం చేశాయి. శీతాకాలంలో సౌర ఉత్పత్తిని మరింత దిగజార్చాయి. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వాయవ్య భారతదేశంలో తక్కువ గాలి ఉత్పత్తికి దారితీసింది. పశి్చమ భారతదేశంలో మేఘాలు సౌర విద్యుత్‌ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయని అధ్యయనంలో తేలింది. ఇలా కొన్ని వాతావరణ పరిస్థితుల్లో సౌర, పవన శక్తి లభ్యత క్షీణిస్తుంది. సహజంగా శీతాకాలంలో తొమ్మిది రోజులు సౌర, పవన శక్తి లభ్యత తగ్గుతుంది. దీన్నే పునరుత్పాదక ఇంధన కరువు అంటారు.  

విద్యుత్‌ ప్లాంట్లలో ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాలు  
చారిత్రక వాతావరణ డేటాను ఉపయోగించి తక్కువ సౌర, పవన శక్తి ఉత్పత్తికి కారణమయ్యే వాతావరణ పరిస్థితులను పరిశోధకులు అంచనా వేశారు. నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు పునరుత్పాదక ఇంధన కరువులు ఎక్కువగా సంభవిస్తాయని తేల్చారు. 1979–2022 మధ్య రెండుసార్లు ఇంధన కరువు ఏర్పడింది. కానీ భవిష్యత్తులో తరచు ఇంధన కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అడ్డుకోవడానికి, ముందుగానే ఇంధన కరువును అంచనా వేయడానికి చారిత్రక వాతావరణ డేటా ఉపయోగపడనుంది.

మన దేశంలో ప్రస్తుతం ఉన్న 220 గిగావాట్ల పునరుత్పాదక శక్తిలో మొత్తం 106 గిగావాట్ల సౌరశక్తి, 50 గిగావాట్ల పవనశక్తి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2030 నాటికి 500 గిగావాట్ల వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనేది మన దేశం లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన గ్రిడ్‌ల కోసం వాతావరణ అంచనాను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్‌ ప్లాంట్లలో ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర విద్యుత్‌ అథారిటీ మార్గదర్శకాలను జారీచేసింది. 

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
winter
Fuel shortage
weather conditions
Andhra Pradesh
power plants
Power generation
solar energy
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.