Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. చలికాలం.. కాస్త ఎండపడనిద్దాం
ADVERTISEMENT 

చలికాలం.. కాస్త ఎండపడనిద్దాం

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Jan 4, 2025 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
11.jpg

లేదంటే మానసిక ఒత్తిడి తప్పదంటున్న వైద్యులు

సీజనల్‌ అఫెక్టివ్‌ సిండ్రోమ్‌(ఎస్‌ఏడీ)గా నామకరణం 

కొన్ని పదాలు పలకలేకపోవడం.. తెలిసిన విషయాన్నీ మర్చిపోయే ప్రమాదం 

ఇతరులతో కలిసేందుకు ఇష్టపడకపోవడమూ దీని ప్రభావమే 

ఉదయం 10లోపే అరగంట ఎండలో ఉండాలని సూచన 

హార్వర్డ్‌ హెల్త్‌ పబ్లిషింగ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ హోవార్డ్‌ లీవైన్‌ వెల్లడి  

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: చలికాలమని ముసుగుతన్ని ఇంట్లోనే పడుకుని కాలక్షేపం చేద్దామనుకుంటున్నారా? చలికి భయపడి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లడం మానేశారా? ఇంట్లోంచి నేరుగా ఉదయం 10 తర్వాత కార్యాలయానికి బయలుదేరుతున్నా­రా? ఉదయం బాగా చలేస్తోందని.. సాయంత్రం వాకింగ్‌ చేస్తున్నారా? చలి పేరుతో ఇలా చేస్తుంటే వెంటనే మీ అలవాటును మార్చుకోండి. లేదంటే మానసిక ఒత్తిడి తప్పదని హార్వర్డ్‌ హెల్త్‌ పబ్లిషింగ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(సీఎంవో) హోవార్డ్‌ లీవైన్‌ చెబుతున్నారు. 

చలికాలంలో వచ్చే వాతావరణ మార్పులతో మెదడులో కొన్ని రసాయన మార్పులు జరిగి.. శారీరకంగా నీరసంగా ఉన్నామనే భావన వస్తుందని.. ఈ భావనతో బయటకు వెళ్లి ఇతరులను కలవడం కూడా తగ్గిపోతుందని ఆయన పేర్కొంటున్నారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తెలిసిన విషయాన్ని మర్చిపోవడం.. కొన్ని పదాలను అసలు పలికేందుకు ఇబ్బంది పడి.. వేరే పదాలను పలకడం వంటివి కూడా చేస్తారని ఆయన అధ్యయనం స్పష్టం చేస్తోంది. 

ఈ నేపథ్యంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటలలోపు అరగంట పాటు సూర్యరశ్మిలో ఉండాలని సూచిస్తున్నారు. ఒకవేళ సూర్యరశ్మి అందుబాటులో లేని రోజుల్లో ప్రత్యేకంగా కాంతిని ప్రసరింపచేసేందుకు ఉపయోగించే లైట్‌ బాక్సుల ద్వారా కూడా ఉపశమనం పొందవచ్చని ఆయన చెబుతున్నారు.

ఎస్‌ఏడీ.. ఎలా వస్తుందంటే..
చలికాలంలో కాంతి లేకపోవడం వల్ల మన మానసిక, శారీరక ప్రవర్తనపై ప్రభావం పడుతుంది. దీనిని సీజనల్‌ అఫెక్టివ్‌ సిండ్రోమ్‌ (ఎస్‌ఏడీ) అని.. వైద్య పరిభాషలో ‘సిర్కాడియల్‌ రిథమ్స్‌’ అని అంటారు. ఎస్‌ఏడీ మన మెదడులోని నిద్రను ప్రేరేపించే హార్మోన్‌ మెలటోనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే మరో ఎంజైమ్‌ సెరోటోనిన్‌ తక్కువ విడుదల కావడానికి దోహదం చేస్తుంది. 

ఈ రసాయన అసమతుల్యత వల్ల నీరసంగా మారిపోతాం. తద్వారా ఎక్కువగా తినడం.. ప్రధానంగా కార్బొహైడ్రేట్‌ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుని.. ప్రోటీన్‌ ఆహారాన్ని తక్కువగా తీసుకోవడం కూడా జరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఇతరులతో కలవడంపై దీని ప్రభావం ఉంటుందని అంటున్నారు. దీంతో ఇంటికే పరిమితమై మానసికంగా ఇబ్బంది పడతారని లీవైన్‌ స్పష్టం చేశారు. 

ఎస్‌ఏడీ అనేది కేవలం మానసిక స్థితి మాత్రమే కాదని అంతకుమించి ఏకాగ్రతను కూడా దెబ్బతీస్తుందని ఆయన పేర్కొంటున్నారు. జ్ఞాపకశక్తి వంటి సమస్యలతో పాటు మన పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఈ సిండ్రోమ్‌ మన ఉచ్ఛారణలో సరైన పదాలు పలకలేకపోవడంతో పాటు.. సరైన సమాచారం కూడా సకాలానికి గుర్తుకురాకపోవడం జరుగుతుందని ఆయన చెబుతున్నారు.  

సూర్యరశ్మి లేదా లైట్‌ థెరపీ
సీజనల్‌గా వచ్చే ఈ సిండ్రోమ్‌కు సాధారణంగా డోపమైన్‌ స్థాయిని పెంచే యాంటీ డిప్రెసెంట్స్‌ మందులను వాడతారు. అయితే, దీనికంటే మంచి మందు ఏమిటంటే.. ప్రతిరోజూ అరగంట పాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉండటమేనని హోవార్డ్‌ లీవైన్‌ చెబుతున్నారు. అది కూడా ఉదయం 10 గంటలలోపు అరగంటపాటు సూర్యుడి ఎండ తగిలేలా ఉంటే ఈ సిండ్రోమ్‌ నుంచి బయటపడవచ్చని ఆయన జరిపిన అధ్యయనంలో తేలింది. 

ఒకవేళ చలికాలంలో వాతావరణ ప్రభావంతో సూర్యరశ్మి లేనిపక్షంలో లైట్‌ థెరపీని ఆయన సూచిస్తున్నారు. తెల్లని కాంతిని ఉత్పత్తి చేసే లైట్‌ బాక్సులను కొనుగోలు చేసి ఉపయోగించడమే ఈ లైట్‌ థెరపీ. ఆన్‌లైన్‌లో ఈ లైట్‌ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. మీ లైట్‌ బాక్స్‌లో 10,000 లక్స్‌ (‘లక్స్‌’ అంటే నిర్దేశిత ప్రదేశంలో ఎంతమేర లైట్‌ పడుతుందని తెలిపేది. 

దీనిని కాంతి తీవ్రత/కాంతి ప్రకాశం అని పేర్కొంటారు) ఎక్స్‌పోజర్‌ ఉండాలి. సాధారణంగా సూర్యుడు బాగా ప్రకాశించే సమయంలో 50 వేల కాంతి ప్రకాశాలు ఉంటాయి. అందులో పదో వంతు కాంతి తీవ్రత ఉండేలా చూసుకుంటే చాలని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
winter
Andhra Pradesh
Mental stress
sun
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.