Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. కుంభకోణం కనికట్టు.. బాబే మద్యం సామ్రాట్టు
ADVERTISEMENT 

కుంభకోణం కనికట్టు.. బాబే మద్యం సామ్రాట్టు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time May 7, 2025 Sakshi Read Time Read Time: 8 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cbn_5D.jpg

మద్యం అక్రమ కేసు కుట్రకు మరింత పదును

బాబు ట్రేడ్‌ మార్క్‌ డైవర్షన్‌..  

అదిగో పులి.. ఇదిగో తోక అంటూ ఎల్లో మీడియా కోరస్‌ 

మద్యంతో సంబంధం లేని వ్యక్తులను ఇరికించే కుట్ర 

చెప్పని విషయాలను చెప్పినట్లుగా రిమాండ్‌ రిపోర్టులో అభూత కల్పనలు  

ఏది నిజం ?

సాక్షి, అమరావతి: సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల అమలుపై చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించేందుకు తన ట్రేడ్‌మార్కు డైవర్షన్‌ కుట్రకు మరింత పదును పెడుతుండగా... అందుకు ఎల్లో మీడియా కోరస్‌ పాడుతూ కుట్ర కథను రక్తి కట్టించేందుకు యతి్నస్తోంది. వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు కుట్రకు మరింత పదును పెడుతున్న పరిణామాలే ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్‌ రిపోర్టులో అభూత కల్పనలు చేరుస్తూ.. కస్టడీలో చెప్పని అంశాలను చెప్పినట్లుగా చిత్రీకరిస్తూ ఎల్లోమీడియా ద్వారా దు్రష్పచారానికి తెగబడుతున్నారు.  

అసలు జరగని స్కామ్‌లో కుట్రపూరితంగా ఇరికించేందుకు పన్నాగాలు పన్నుతున్నారు. అధికారంలోకి వచి్చనప్పటి నుంచి దీన్ని వైఎస్సార్‌ సీపీకి ఆపాదించేందుకు శతవిధాలా ప్రయతి్నస్తున్న టీడీపీ కూటమి సర్కారు కక్షగట్టి బెదిరిస్తూ అరెస్టులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ అక్రమ కేసు దర్యాప్తును మొదట సీఐడీకి అప్పగించిన చంద్రబాబు సర్కారు.. మూడు నెలలు విచారణ అనంతరం సీఐడీ చేతులెత్తేయడంతో సిట్‌ ఏర్పాటుతో కొత్త పన్నాగానికి తెరతీసింది. 

బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది. సిట్‌ వేధింపులపై డిస్టిలరీల ప్రతినిధులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో వారిని ఇంటి వద్దే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. రిమాండ్‌ రిపోర్టుల పేరుతో అభూత కల్పనలు సృష్టించడం, కస్టడీలో చెప్పని విషయా­లను చెప్పినట్లుగా ఎల్లో మీడియాకు లీకులివ్వడం సిట్‌ బరితెగింపునకు పరాకాష్ట. 

ఏది నిజం ?
ఓవైపు కొత్త డిస్టిలరీలకు పచ్చజెండా ఊపి.. తమవారికే దుకాణాలు కట్టబెట్టి.. బెల్టు షాపులకు గేట్లెత్తి.. ఇలా మద్యంలో అన్నివిధాల అడ్డగోలు దోపిడీ దందాకు దన్నుగా నిలుస్తూ.. మరోవైపు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం విధానంలో భారీగా అక్రమాలు జరిగాయంటూ వీరంగం వేస్తోంది టీడీపీ కూటమి ప్రభుత్వం. దీనికోసం వీర విధేయ అధికారులతో సిట్‌ వేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది. రిమాండ్‌ రిపోర్టుల పేరుతో కట్టు కథలు అల్లుతోంది.

మద్యం దందాకు మార్గాలుగా ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం. బెల్ట్‌ దుకాణాలు తొలగించింది కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. కొత్తగా ఒక్క డిస్టిలరీకి, మద్యం బ్రాండ్‌లకు అనుమతినివ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కరే. మద్యం అమ్మకాలను తగ్గించి దశలవారీ మద్యం నియంత్రణ విధానాన్నిసమర్థంగా అమలు చేసింది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. 

మరి మద్యం అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు ఎందుకు ఇస్తారు... ఇవ్వరు కదా అన్నది ఎవర్ని అడిగినా ఠక్కున చెప్పే సమాధానమే. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేయడం కచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వ రెడ్‌బుక్‌ కుట్రేనన్నది సుస్పష్టం. అందుకే పాలుకు పాలు నీళ్లకు నీళ్లుగా ప్రజలు వాస్తవాలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ, టీడీపీ ప్రభుత్వ మద్యం విధానాలపై సహేతుక విశ్లేషణ ఇదీ...

కుంభకోణం కాదు ఇదీ అసలు కోణం 
ఎవరి పాలనలో ఏం జరిగిందో నిగ్గు తేల్చేదే ఈ కథనం
సిండికేటు కడితే స్కామా? ప్రభుత్వమే దుకాణాలు నడిపితే స్కామా?
2014–19 మధ్యన, ప్రస్తుతం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల సిండికేట్‌ నెలకొంది. తమ పార్టీ నేతలకే దుకాణాల లైసెన్సులు కేటాయించారు. మద్యంలో లంచాలు తీసుకోవాలి అని అనుకుంటేనే ప్రైవేటు దుకాణాలు కేటాయిస్తారు. ఇక అప్పుడూ ఇప్పుడూ భారీగా అమ్మకాల టార్గెట్‌ ఉండనే ఉంది. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రివిలేజ్‌ ఫీజును తగ్గించారు. ఈ సమయంలో ప్రభుత్వ హయాంలో 4,380 ప్రైవేటు దుకాణాలు, వీటికి అనుబంధంగా అనధికారిక బార్లుగా 4,380 పర్మిట్‌ రూమ్‌లు ఉండేవి. నాడు 43 వేల బెల్ట్‌ దుకాణాలు కూడా నడిచాయి. 

గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటు మద్యం సిండికేట్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది. టీడీపీ కూటమి నేతలకే 3,394 దుకాణాలను కేటాయించింది. 55 వేల నుంచి 60 వేల బెల్ట్‌ దుకాణాల ద్వారా మద్యం ఏరులై పారిస్తోంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే 2,934 దుకాణాల ద్వారా అమ్మకాలు సాగించింది. నిర్దిష్ట వేళలతో అమ్మకాలను కూడా కట్టడి చేసింది. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేసింది. బెల్టు షాపులు అనే మాటే లేకుండా చేసి దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేసింది.

రూ.120ది నాసిరకమా? రూ.99 నాసిరకమా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వలో క్వార్టర్‌ బాటిల్‌కు రూ.120 కనీస ధరగా ఉంటేనే నాసిరకం మద్యం అని టీడీపీ దుష్ప్రచారం చేసింది. అందుకోసం చెన్నైకు చెందిన ఓ ల్యాబ్‌ పేరుతో తప్పుడు నివేదికను ప్రచారంలోకి తెచ్చింది. కానీ, అలాంటి నివేదికను తాము ఇవ్వలేదని ఆ ల్యాబ్‌ ఖండించింది. ఇక ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వంలో రూ.99కే క్వార్టర్‌ బాటిల్‌ విక్రయిస్తున్నారు.
క్వార్టర్‌ రూ.99కే వచ్చేది నాసిరకం మద్యమా? రూ.120కి అమ్మేది నాసిరకం మద్యమా??

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు నడిపితే స్కాం అంటున్నారు..? మరి నాడు, నేడు రాష్ట్రమంతా టీడీపీ నాయకులు సిండికేటు కట్టి దుకాణాలు నడిపిస్తున్నారు. టీడీపీ నేతలకు దుకాణాలు, బెల్టుషాపులు, పర్మిట్‌ రూమ్‌ల తలుపులు బార్లా తెరిచిన చంద్రబాబు పాలనలో స్కాంలకు అవకాశం ఉందా? ఇవేవీ లేని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కుంభకోణానికి ఆస్కారం ఉందా?

అమ్మకాలు తగ్గిస్తే కమీషన్లు వస్తాయా? పెరిగితే వస్తాయా??
మద్యం అమ్మకాలు ఎంతగా పెరిగితే అంతగా కమీషన్లు వస్తాయి. అదే టీడీపీ విధానంగానూ మారింది. అందుకనే 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహించింది. 2019 తర్వాత  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలను తగ్గించింది. దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేసింది. ధరలను షాక్‌ కొట్టేలా  పెంచి మద్యపానాన్ని నిరుత్సాహపరిచింది.

మరి ఎవరి హయాంలో స్కాంలకు అవకాశం ఉంటుంది. లావాదేవీలు పెరిగి.. డబ్బు చేతులు మారే చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా?

పాపాల పుట్టలు డిస్టిలరీలు పుట్టింది ఎవరి పాలనలో...?
మద్యం విధానంలో అవినీతి, దోపిడీ అంతా డిస్టిలరీల మసుగులోనే సాగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే గతంలో అనుమతినిచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతి­చ్చాయి. ఇక టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్‌ యాదవ్, ఎస్పీవై రెడ్డి, దివంగత డీకే ఆదికేశవులు కుటుంబాలకే డిస్టిలరీలు కేటాయించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు.కాగా, డిస్టిలరీ­లకు మద్యం తయారీ కోసం లైసెన్సులు జారీ చేసి.. బేవరేజెస్‌ కార్పొరేషన్‌  మద్యం కొనుగోళ్లు ఎంప్యానెల్‌ జాబితాలో 14 
డిస్టిలరీలను చేర్చింది చంద్రబాబు ప్రభుత్వమే.

డిస్టిలరీలన్నీ టీడీపీ నేతలవే అయితే అవినీతికి పాల్పడిందీ వారే అవుతారు కదా..? మరి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోని మద్యం విధానంపై నమోదు చేసింది అక్రమ కేసే కదా??

బెల్టు షాపులు లేకుండా చేస్తే స్కాం ఎలా?
అసలు డిస్టిలరీలు ఎప్పుడు కమీషన్లు ఇస్తాయన్నది కీలకం. మద్యం అమ్మకాలు పెరిగినకొద్దీ డిస్టిలరీలకు లాభాలు పెరుగుతాయి. కాబట్టి విక్రయాలు పెంచితే ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ఇస్తాయి. మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయన్నది పరిశీలించాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014–19లో మద్యం అమ్మకాలు భారీగా సాగగా... అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో 2019–24లో అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్‌ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి.

అంటే డిస్టిలరీల నుంచి కమీషన్లు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వ పెద్దలకే అన్నది సుస్పష్టం.

ఊరూపేరు లేని 200 బ్రాండ్లను ప్రవేశపెట్టింది ఎవరు?
మద్యం కుంభకోణంలో వినిపిస్తున్న మరో మాట ఊరూపేరూ లేని బ్రాండ్లు. అసలు ఇలాంటి బ్రాండ్లను ప్రవేశపెట్టడమే దోపిడీకి కారణమైతే ఆ అవినీతి పాపం కచ్చితంగా చంద్రబాబుదే. ఎందుకంటే 2014–19 మధ్యన రాష్ట్రంలో ఎన్నడూ వినిపించని దాదాపు 200 బ్రాండ్లను తెచ్చారు చంద్రబాబు. అందులో కొన్నిటి పేర్లు... ప్రెసిడెంట్‌ మెడల్, గవర్నర్‌ రిజర్వ్, పవర్‌ స్టార్, లెజెండ్, లెఫైర్‌ నెపోలిన్, ఓక్టోన్‌ బారెల్‌ ఏజ్డ్, సెవెన్త్‌ హెవెన్‌ బ్లూ, హైవోల్టేజ్, వోల్టేజ్‌ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్‌ అంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, బ్రిటీష్‌ ఎంపైర్‌ అల్ట్రా, రాయల్‌ ప్యాలస్, న్యూ కింగ్, సైన్‌ అవుట్, బీరా 91, టీఐ మ్యాన్షన్‌ హౌస్, టీఐ కొరియర్‌ నెపోలియన్‌.

తమవారికి దోచించి ఎవరు?
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయా­న్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్‌ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.

సగంపైగా మద్యం కొనుగోలు జరిగిన చంద్రబాబు జమానాలో అవినీతి ఉంటుందా..? అందరికీ ఆర్డర్లు వచ్చేలా చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అవినీతి చోటుచేసుకుంటుందా??

‘ప్రివిలేజ్‌’గా సిండికేట్‌తో ఖజానాకు గండి కొట్టింది ఎవరు?
మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్‌ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్‌ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్‌ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.

ఈ లెక్కన ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టింది ఎవరు? తమవారికి అడ్డగోలుగా దోచిపెట్టింది ఎవరు? ఎవరిపై కేసు నమోదు చేయాలి??

నాడు... కుంభకోణం బహిర్గతం
నేడు.. లేని కుంభకోణం ఉన్నట్టు చూపే కుతంత్రం
2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో కుంభకోణానికి తెగించారు. డిస్టిలరీలు, మద్యం దుకాణాలు, పర్మిట్‌ రూమ్‌లు, బార్లు, బెల్ట్‌ దుకాణాలు, ప్రివిలేజ్‌ ఫీజు మాఫీ.. ఇలా అన్నీ అందులో భాగమే. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ  కుంభకోణానికి పాల్పడ్డారు. ‘కంప్ట్రోలర్‌  అండ్‌ ఆడిటర్‌ జనరల్‌’(కాగ్‌) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ కూడా దీనిని స్పష్టం చేసింది. 2023లో కేసు నమోదు చేసిన సీఐడీ పూర్తి ఆధారాలతో అవినీతి నిగ్గు తేల్చి చంద్రబాబు ముఠాపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.  

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అసలు మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేటు మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశారు. బెల్ట్‌ దుకాణాలు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం కేవలం రెడ్‌బుక్‌ కుట్రే .

చట్టాన్ని సిట్‌ ఉల్లంఘిస్తోంది!?
డిస్టిలరీల నుంచి కమీషన్లు వసూలు చేశారు అంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు పన్నుతోంది. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఎంతగా వేధిస్తున్నా డిస్టిలరీల ప్రతినిధులు అబద్ధపు  వాంగ్మూలాలు ఇవ్వకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొందరిని సిట్‌ అధికారులు కిడ్నాప్‌ చేసి మరీ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని పోలీసు శైలిలో హింసించారు. దానిపై డిస్టిలరీల యజమానులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్‌ కుట్ర బయటపడింది. రెడ్‌బుక్‌ కక్ష సాధింపుతోనే చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసుతో వేధిస్తోందన్నది స్పష్టమైంది.

విచారణ పేరుతో సిట్‌ అధికారులు తమను వేధిస్తున్నారంటూ, బలవంతంగా విజయవాడ తీసుకొచ్చి ఇబ్బంది పెడుతున్నారని, వయో వృద్ధులమైన తాము శారీరకంగా తీవ్ర అవస్థలు పడుతున్నామని డిస్టలరీల ప్రతినిధులు హైకోర్టులో మొర పెట్టుకున్నారు. వీరి పిటిషన్లపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. సిట్‌ అధికారులకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. డిస్టిలరీల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చిన అనంతరం వారి నివాసాలలోనే విచారించాలని ఆదేశించింది.

నిజంగా స్కాం జరిగితే బెదిరింపులు ఎందుకు?
బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్యప్రసాద్, అనూష తదితరులను సిట్‌ రోజుల తరబడి వేధించి, బాధించి అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించింది. డిస్టిలరీల ప్రతినిధులను బెంబేలెత్తించి లొంగదీసుకుంది. ఇక కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేరుతో సిట్‌ అధికారులే వాంగ్మూలం రాసేసుకున్నారు. దానిపై సంతకం చేసేందుకు ఆయన నిరాకరించడం సిట్‌ కుట్రను బట్టబయలు చేసింది. ఇతర నిందితులు, సాక్షులు చెప్పని విషయాలను కూడా చెప్పినట్టు సిట్‌ అబద్దపు వాంగ్మూలాలు నమోదు చేస్తోంది.

అసలు జరగని మద్యం కుంభకోణంలో.. పొలిటికల్‌ బాస్‌ల ఆదేశాలకు అనుగుణంగా సిట్‌ పనిచేస్తోందా? 
నిజంగానే స్కాం జరిగితే ఈ వేధింపులు ఎందుకు? అంటే కేసులో బలం లేదు కాబట్టే టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచార కుట్రలకు పాల్పడుతోంది.

ఏది స్కాం..? ఎందుకిస్తారు లంచాలు?
⇒ మద్యం అమ్మకాలు కోట్ల కేసుల కొద్దీ పెరిగింది టీడీపీ హయాంలోనే..! –మరి మద్యాన్ని ఎక్కువగా అమ్మించినందుకు వారికే కదా లంచాలు రావాల్సింది? వైఎస్సార్‌సీపీ పాలనలో మద్యం అమ్మకాలు పడిపోయాయి (పట్టిక చూడండి). మరి  విక్రయాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ టీడీపీ గత ప్రభుత్వంలో, ప్రస్తుతం కూడా మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. ..అవి కూడా టీడీపీవారికి సంబంధించినవే.  బెల్టు షాపులూ ఊరూరా వెలిశాయి.
⇒ మరి..ప్రైవేటుగా మద్యం విక్రయిస్తే స్కాంకు అవకాశం ఉంటుందా..? లేక నేరుగా ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే స్కాం జరుగుతుందా?
⇒ తెల్లవారుతూనే తూగేలా చేస్తూ.. అర్ధరాత్రి దాకా ఎక్కువ సమయం అమ్మకాలు సాగించేలా చూస్తే లంచాలు ఇస్తారా?
⇒ విక్రయ వేళలను కుదించేసి, అమ్మకాలను పరిమితం చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ ఇబ్బడిముబ్బడిగా మద్యం దుకాణాలను పెంచితే లంచాలకు అవకాశం ఉంటుందా? వాటికి తోడు పర్మిట్‌ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా..?  మరి దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?.. బెల్టు షాపు­లు తీసేసి పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ ఎంపిక చేసుకున్న 4–5 డిస్టిలరీలకు మాత్రమే ఆర్డర్లలో 53 శాతం వరకు ఇస్తే లంచాలు ఇస్తారా? మద్యంపై తక్కువ ట్సాక్స్‌తో ఎక్కువ అమ్మకాలు చేసేలా మేలు చేస్తే లంచాలు వస్తాయా?
⇒ మరి..అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?
⇒ 2014–19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్‌ రేట్లను 
పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? ట్యాక్స్‌లు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?
⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక శాతం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా? 
⇒ లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతి ఇవ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు ఇస్తారా..?

మద్యం వ్యవహారంలో ఎక్కడైనా అక్రమం ఎలా జరుగుతుంది?
..ఎడాపెడా డిస్టిలరీలకు అనుమతులిచ్చే విధానపరమైన లోపాలతోనే! 
..అమ్మకాల్లో ఎప్పుడైనా అవకతవకలకు ఎలా ఆస్కారం ఏర్పడుతుంది?
..తమవారికే షాపులు దక్కేలా ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటేనే!
అందులోనూ నిలువు దోపిడీ ఎలా చోటుచేసుకుంటుంది?
...ఊరూరా బెల్టు షాపులతో ప్రజలను మత్తులో ఊగేలా చేస్తేనే!
ఎవరైనా అధర్మంగా జేబులు నింపుకొనేందుకు ఎలా వీలు కలుగుతుంది?
...సాక్షాత్తు ముఖ్య స్థానాల్లో ఉన్నవారే అవినీతికి తెగిస్తేనే!

మరి ఇవన్నీ జరిగింది ఎవరి హయాంలో..? చంద్రబాబు ప్రభుత్వంలోనా.. వైఎస్సార్‌సీపీ హయాంలోనా?  

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP government
coalition government
Super Six
YSRCP
Liquor Sales
Fact Check
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

 ‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

‘‘SIR ప్రక్రియలో కుట్రలు జరుగుతున్నాయి’’

‘ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

‘ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాల్సిందే’

కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం

కడపలో స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంపై వైఎస్ జగన్ హర్షం

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

నేడు పులివెందులకు వైఎస్‌ జగన్‌

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపండి

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.