Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT 
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. నిరుద్యోగ భృతి ప్రతిపాదనే లేదు
ADVERTISEMENT 

నిరుద్యోగ భృతి ప్రతిపాదనే లేదు

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Nov 23, 2024 Sakshi Read Time Read Time: 2 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
cbn.jpg

తేల్చి చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం

అసెంబ్లీలో రాతపూర్వకంగా వెల్లడి

యువతను దగా చేసిన సర్కారు

ఇంకా మార్గదర్శకాల రూపకల్పనలోనే ఉచిత బస్‌ ప్రయాణం

సాక్షి, అమరావతి: జాబ్‌ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు చంద్రబాబు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. డీఎస్సీ, గ్రూప్స్‌ పరీక్షలన్నింటినీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్న బాబు ప్రభుత్వం.. ఎన్నికల్లో ఇచి్చన నిరుద్యోగ భృతి హామీ అమలును సైతం గాలికి వదిలేసింది. నిరుద్యోగులకు భృతి అందించే ప్రతిపాదనే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని శుక్రవారం శాసన సభ సాక్షిగా ప్రభుత్వం రాతపూర్వకంగా తేల్చి చెప్పింది. 

పైగా రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు కాకి లెక్కలు చూపించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై నిరుద్యోగ యువత భగ్గుమంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకూ నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తీరా గద్దెనెక్కి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఆ హామీ అమలుపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. 

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సైతం నిరుద్యోగ భృతికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కొత్త ఉద్యోగాల భర్తీపై స్పష్టతా ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొక్కరు చొప్పున వేసుకున్నా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతికి రూ.4,800 కోట్లు ఖర్చు చేయాలి. 

అంటే ఏడాదికి సుమారు రూ.57,600 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి ఖర్చవుతుంది. అయితే రాష్ట్రంలో 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు బాబు ప్రభుత్వం వెల్లడించడం యువతను మోసగించడమేనని పలువురు చెబుతున్నారు.

ఉచిత బస్సు మరింత 
దూరం..!మరోవైపు రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలను కూడా బాబు ప్రభుత్వం దగా చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని మేనిఫెస్టోలో సూపర్‌ సిక్స్‌ హామీల్లో పేర్కొన్నారు. అధికారం చేపట్టి ఐదు నెలలు దాటినా ఈ హామీ అమలుపై కాలయాపన చేస్తున్నారు. దీనిపై ఇంకా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని శాసన సభలో రాతపూర్వకంగా ప్రభుత్వం ప్రకటించింది. 

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం, మార్గదర్శకాలు, విధివిధానాలు అంటూ హామీ అమలును దాటవేస్తున్నారు. ఇప్పుడూ ఇదే చెప్పడంపై మహిళాలోకం ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. మహిళలకు బస్‌ ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రత్యేక వ్యవస్థ అవసరం లేదని, ఉన్న బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించడానికి మార్గదర్శకాల రూపకల్పన అంటూ ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తారని నిలదీస్తున్నారు. 

ADVERTISEMENT 
ADVERTISEMENT 
Tags:
Andhra Pradesh
Legislative Assembly
Chandrababu Naidu
Unemployment benefit
free bus
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

ఏపీలో పెరుగుతున్న కోవిడ్‌ కేసులు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

‘లోకేష్‌ కరెక్ట్‌గా ఆ ఐదు మొక్కలు పేర్లు చెబితే..’

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

భారత మహిళా క్రికెట్‌ జట్టుకు వైఎస్‌ జగన్‌ అభినందనలు

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

‘‘పిడుగురాళ్ల’’కు 100 మెడికల్‌ సీట్లు.. ఫలించిన వైఎస్‌ జగన్‌ కృషి

 ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

ఈనెల 14న విశాఖకు వైఎస్‌ జగన్

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT 
ADVERTISEMENT 
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.