సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతో సమావేశమయ్యారు. సుమీల గుల్యాని, జూప్ స్టౌట్ జెస్డిజిక్, డాక్టర్ రాజగోపాల్సింగ్తో సమావేశమైనట్లు చంద్రబాబు ఎక్స్‌లో తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు, డ్యాముల భద్రత, రివర్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం అంశాలపై సహకరించాలని వారిని కోరినట్లు తెలిపారు. ప్రపంచబ్యాంకు బృందం ఇందుకు సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు.
ADVERTISEMENT
ADVERTISEMENT