Skip to main content
  • ePaper
  • |
  • Sakshi Post
  • |
  • Education
  • |
  • Sakshi Life
☰
Sakshi Home
ADVERTISEMENT
Sakshi Epaper Epaper Sakshi Live TV లైవ్ TV
Download App download ios download android
  • close
  • Home
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • బిజినెస్
  • ఫ్యామిలీ
  • ఫోటోలు
  • వీడియోలు
  • close
  • హోం
  • వార్తలు
    • పాలిటిక్స్
    • క్రైమ్
    • జాతీయం
    • ఎన్‌ఆర్‌ఐ
    • ప్రపంచం
    • సాక్షి ఒరిజినల్స్
    • గుడ్ న్యూస్
  • ఆంధ్రప్రదేశ్
    • ఏపీ వార్తలు
    • ఫ్యాక్ట్ చెక్
    • అమరావతి
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • చిత్తూరు
    • తిరుపతి
    • తూర్పు గోదావరి
    • కాకినాడ
    • డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • కర్నూలు
    • నంద్యాల
    • ప్రకాశం
    • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు
    • శ్రీకాకుళం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • వైఎస్సార్
    • అన్నమయ్య
  • తెలంగాణ
    • తెలంగాణ వార్తలు
    • హైదరాబాద్
    • ఆదిలాబాద్
    • కొమరం భీమ్
    • నిర్మల్
    • కరీంనగర్
    • మంచిర్యాల
    • జగిత్యాల
    • పెద్దపల్లి
    • రాజన్న
    • ఖమ్మం
    • భద్రాద్రి
    • మహబూబ్‌నగర్
    • జోగులాంబ
    • నాగర్ కర్నూల్
    • నారాయణపేట
    • వనపర్తి
    • మెదక్
    • సంగారెడ్డి
    • సిద్దిపేట
    • నల్గొండ
    • సూర్యాపేట
    • యాదాద్రి
    • నిజామాబాద్
    • కామారెడ్డి
    • రంగారెడ్డి
    • వికారాబాద్
    • వరంగల్
    • హన్మకొండ
    • జనగాం
    • జయశంకర్
    • మహబూబాబాద్
    • ములుగు
  • సినిమా
    • సమస్తం
    • టాలీవుడ్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ఓటీటీ
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • ఫొటోలు
    • వీడియోలు
  • క్రీడలు
    • ఐపీఎల్‌-2025
    • సమస్తం
    • క్రికెట్
    • ఇతర క్రీడలు
  • బిజినెస్
    • సమస్తం
    • మార్కెట్
    • టెక్నాలజీ
    • కార్పొరేట్
    • రియల్టీ
    • ఆటోమొబైల్
    • పర్సనల్‌ ఫైనాన్స్‌
    • ఎకానమీ
  • ఫ్యామిలీ
    • సమస్తం
    • ఉమెన్‌ పవర్‌
    • వింతలు విశేషాలు
    • ఫన్ డే
    • లైఫ్‌స్టైల్‌
    • ఎక్స్‌ట్రా
  • ఫొటోలు
    • న్యూస్
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైఎస్‌ జగన్‌
    • ఫ్యామిలీ
    • ఈవెంట్స్
    • భక్తి
    • మీకు తెలుసా?
    • మేటి చిత్రాలు
    • వెబ్ స్టోరీస్
  • వీడియోలు
    • వార్తలు
    • సినిమా
    • క్రీడలు
    • బిజినెస్
    • వైరల్ వీడియోలు
    • డింగ్ డాంగ్ 2.0
    • ఎన్‌ఆర్‌ఐ
    • గరం గరం వార్తలు
    • యూట్యూబ్ స్పెష‌ల్‌
    • తిరుప‌తి విషాదం
  • ఇంకా
    • ఎడిటోరియల్
    • గెస్ట్ కాలమ్
    • కార్టూన్
    • సోషల్ మీడియా
    • పాడ్‌కాస్ట్‌
    • దిన ఫలాలు
    • వార ఫలాలు
    • సాగుబడి
    • ఎడ్యుకేషన్
    • కర్ణాటక
    • తమిళనాడు
    • ఢిల్లీ
    • మహారాష్ట్ర
    • ఒడిశా
  • ఈ -పేపర్
  • హెల్త్‌
  • సాక్షిపోస్ట్
  • ఎడ్యుకేషన్
  • వైఎస్సార్‌
  • గేమ్స్
  • కెరీర్స్
  • Sakshi Search
    • facebook
    • whatsapp
    • twitter
    • instagram
    • youtube
    • google
  • Sakshi Live TV లైవ్ TV

Breadcrumb

  1. Home
  2. Andhra Pradesh
  3. బాబుకు ‘ఈడీ’ వేడి
ADVERTISEMENT 

బాబుకు ‘ఈడీ’ వేడి

Andhra Pradesh Sakshi User Sakshi Sakshi Time Apr 11, 2024 Sakshi Read Time Read Time: 4 mins
Share:
  • Sakshi Facebook
  • Sakshi Whatsapp
  • Sakshi Twitter
  • Sakshi Telegram
  • Sakshi Copy
  • Sakshi Print
Sakshi Facebook
BABU_ED.jpg

కేజ్రీవాల్‌ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముచ్చెమటలు

అక్రమ నిధులు పొందే పార్టీలపై ఈడీ కేసులకు కోర్టు గ్రీన్‌సిగ్నల్‌

సంబంధిత పార్టీ అధ్యక్షుడే అందుకు బాధ్యుడు.. ఢిల్లీ మద్యం కేసు తరహాలోనే ఏపీలో స్కిల్‌ స్కామ్‌

హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు.. పూర్తి ఆధారాలతో ఈడీకి ఇప్పటికే నివేదించిన ‘సిట్‌’  

సాక్షి, అమరావతి: మద్యం కుంభకోణంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిస్తోంది! హవాలా మార్గంలో అక్రమ నిధులు పొందే రాజకీయ పార్టీలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌­ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. అందుకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహిం­చాలని తేల్చి చెప్పింది. మద్యం కుంభ­కోణం ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధు­­లు పొందినట్లు ఆధారాలున్నందున ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌పై ఈడీ కేసు నమో­దు చేసి అరెస్ట్‌ చేయడం సరైనదేనని పేర్కొంది.



ఈ కేసులో హవాలా మార్గంలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి నిధులు చేరిన తరహాలోనే చంద్రబాబు హయాంలో స్కిల్‌ స్కామ్‌ ద్వారా కొల్లగొట్టిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి చేరినట్లు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఆధారాలతో సహా వెల్లడించింది. ఈ నేపథ్యంలో రెండు కేసుల మధ్య చాలా సారూప్యతలు న్నాయి. ఇప్పటికే స్కిల్‌ కుంభకోణంపై షెల్‌ కంపెనీలను విచారిస్తున్న ఈడీ ఇక చంద్రబాబును కూడా బోనెక్కించే అవకాశాలున్నాయి. 

‘ఆప్‌’ చేతికి రూ.50 కోట్లు

ఢిల్లీలో మద్యం కుంభకోణం ద్వారా కొల్లగొట్టిన నిధులను షెల్‌ కంపెనీల ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి మళ్లించినట్లు ఈడీ నిర్థారించింది. 2022లో గోవా ఎన్నికల సందర్భంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు హవాలా మార్గంలో రూ.50 కోట్లు చేరినట్లు ఆధారాలతో తేల్చింది. ఈ మేరకు గోవాలో ఆప్‌ వ్యవహారాలను పర్యవేక్షించిన ఓ అభ్యర్థి వాంగ్మూలం కూడా ఇవ్వడం గమనార్హం.  

కేజ్రీవాలే బాధ్యత వహించాలి

మద్యం కుంభకోణంపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టిన ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్‌ 70 ప్రకారం ఆమ్‌ ఆద్మీ పార్టీ, పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కేజ్రీవాల్‌ దీనికి బాధ్యత వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.



‘ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 2(ఎఫ్‌) ప్రకారం రాజకీయ పార్టీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సంఘం. కంపెనీల చట్టం ప్రకారం ఓ కంపెనీ అంటే కొందరు వ్యక్తులతో కూడిన సముదాయం. రెండు వేర్వేరు చట్టాల ద్వారా నమోదైన రాజకీయ పార్టీ, కంపెనీల నిర్వచనం మాత్రం ఒకటే. కాబట్టి అక్రమ నిధులు పొందిన ఓ కంపెనీపై ఈడీ మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తున్నట్లుగానే అక్రమంగా నిధులు పొందిన రాజకీయ పార్టీపై కూడా అదే విధంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు’ అని న్యాయమూర్తి ప్రకటించారు. ‘మద్యం కుంభకోణం ద్వారా ఆమ్‌ ఆద్మీ పార్టీ అక్రమంగా నిధులు పొందినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయి. ఆ పార్టీకి జాతీయ సమన్వయకర్త (అధ్యక్షుడు)గా ఉన్న కేజ్రీవాలే అందుకు బాధ్యత వహించాలి. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవచ్చు. ఆయన అరెస్ట్‌ సరైనదే’ అని తీర్పులో పేర్కొన్నారు.

స్కిల్‌ స్కామ్‌లో టీడీపీ ఖాతాల్లోకి రూ.65.86 కోట్లు

– బాధ్యత వహించాల్సింది చంద్రబాబే

చంద్రబాబు హయాంలో స్కిల్‌ స్కామ్‌లో కొల్లగొట్టిన నిధులు హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి చేరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. జర్మనీలోని సీమెన్స్‌ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్టు అంటూ నిధులు కొల్లగొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన రూ.371 కోట్లలో షెల్‌ కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చిన అవినీతి నెట్‌వర్క్‌ గుట్టును సిట్‌ బయట పెట్టింది. అందులో రూ.65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు పక్కా ఆధారాలతో గుర్తించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నాలుగు బ్యాంకుల్లో  టీడీపీ పేరిట ఉన్న నాలుగు బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం రూ.65,86,47,510 మళ్లించారు.



జూబ్లీహిల్స్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా బ్రాంచిలో టీడీపీకి మూడు ఖాతాలున్నాయి. వాటిల్లో వరుసగా రూ.4,81,60,587, రూ.25,31,31,352, 2,26,28,500 చొప్పున జమ చేశారు. జూబ్లీ హిల్స్‌లోని యూనియన్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.33,47,27,071 డిపాజిట్‌ చేశారు. 2016 నవంబరు నుంచి 2017 జనవరి మధ్యలో రూ.500, రూ.వేయి నోట్లను కట్టల రూపంలో తరలించి ఈ అక్రమ నిధులను జమ చేశారు. విస్తుపోయే విషయం ఏమిటంటే.. ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.



కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో పెద్ద నోట్ల రద్దును ప్రకటించింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించి ఆదాయ మార్గాలు వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాల్లోకి ఏకంగా రూ.65.86 కోట్లు జమ కావడం గమనార్హం. నోట్ల డిపాజిట్‌ సమయంలో ‘పే–స్లిప్‌’లో ఆ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి.  

ఇక బాబుపై ఈడీ కొరడా! 

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌కు సంబంధించి సిట్‌ పూర్తి ఆధారాలను ఈడీకి అందచేసింది. షెల్‌ కంపెనీల ద్వారా హవాలా మార్గంలో నిధుల తరలింపుపై కేసు నమోదు చేసిన ఈడీ ఈ ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఇప్పటికే సుమన్‌ బోస్‌ (సీమెన్స్‌ కంపెనీ మాజీ ఎండీ), వికాస్‌ ఖన్విల్కర్‌ (డిజైన్‌ టెక్‌ కంపెనీ ఎండీ), ముకుల్‌చంద్ర అగర్వాల్‌ (స్కిల్లర్‌ కంపెనీ ప్రతినిధి), సురేశ్‌ గోయల్‌ (చార్టెడ్‌ అకౌంటెంట్‌)లను అరెస్టు చేసింది. డిజైన్‌టెక్‌ కంపెనీ ఎండీ వికాస్‌ వినాయక్‌ ఖన్వేల్కర్‌తోపాటు నలుగురిని అరెస్ట్‌ చేసింది. డిజైన్‌టెక్‌ కంపెనీకి చెందిన రూ.31.32 కోట్ల బ్యాంకు ఖాతాలను జప్తు చేసింది.



ఈ కేసులో ఆ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం సరైన చర్యేనని ఏపీ హైకోర్టు కూడా సమర్థించింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు తీర్పు నేపథ్యంలో హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లో చేరిన అక్రమ నిధులపై ఈడీ దృష్టి సారించాల్సి ఉంది. తాజా తీర్పు ప్రకారం రాజకీయ పార్టీ ఖాతాలో చేరే అక్రమ నిధులకు సంబంధిత పార్టీ అధ్యక్షుడే బాధ్యత వహించాలి. అంటే టీడీపీ అధ్యక్షుడుగా ఉన్న చంద్రబాబే నిందితుడు అన్నది సుస్పష్టం. ఈ క్రమంలో ఆయన్ని ఈడీ అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని పలువురు న్యాయ నిపుణులతోపాటు సిట్‌ కూడా ఈడీ దృష్టికి తీసుకెళ్లనుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Tags:
TDP
Chandrababu Naidu
Illegal funds
Delhi High Court
Skill Development Scam
Enforcement Directorate (ED)
సంబంధిత పోల్స్
Loading..

సంబంధిత వార్తలు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

గుంటూరులో టీడీపీ నాయకుల బరితెగింపు

 బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే : వైఎస్సార్‌సీపీ

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

పోయేకాలం వస్తే ఇలాంటి కేసులే పెడతారు.. దేశద్రోహం కేసు పెట్టాల్సింది పవన్, బాబు పైనే..?

ఏమన్నా ఉంటే కదా..  చెప్పడానికి!

ఏమన్నా ఉంటే కదా.. చెప్పడానికి!

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

తుమ్మిళ్ల ఇసుక రీచ్‌లో ఏపీ టీడీపీ మూకల దాడి

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

పోలవరంలో ‘కట్ట’ప్ప లూటీ!

మరిన్ని వార్తలు

Loading...

  

ADVERTISEMENT 
ADVERTISEMENT
ADVERTISEMENT
పోల్స్
Loading..
Sakshi Home

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశం మరియు ప్రపంచం నుండి తాజా వార్తలకు మీ విశ్వసనీయ వనరు.

  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook
  • Sakshi Facebook

Categories

  • AP Political News
  • Amaravati News
  • Andhra Pradesh News
  • Cricket News in Telugu
  • Crime News
  • Hyderabad News
  • International Telugu News
  • Photo Galleries
  • Political News in Telugu
  • Sports News
  • TS Politics News
  • Telangana News
  • Telugu Movie Reviews

Company

  • About Us
  • Contact Us
  • Media Kit
  • Terms and Conditions

Our Media

  • Education
  • Sakshi LIVE TV
  • Sakshi Life
  • Sakshi Post
  • e-Paper

© 2026 Sakshi. All rights reserved. Designed & Developed by Yodasoft Technologies Pvt Ltd.